విద్యార్థులను గుంజీలు తీయించడం మంచిదే – ఆరోగ్య నిపుణులు.

Author:

వెనుకటి రోజుల్లో స్కూల్లో ఏదైనా తప్పులు చేసినా, లేటుగా స్కూల్ కి వెళ్లినా, స్కూల్లో చెప్పిన విధంగా చేయకపోయినా టీచర్స్ విద్యార్థులను గుంజీలు తీయించేవారు. అలా గుంజీలు చేయించడం వలన అందరి ముందు సిగ్గుగా అనిపించేది.ఇప్పుడు చాలా మంది విద్యార్థులకు గుంజీలు అంటే కూడా తెలియదు ఎందుకంటే పాఠశాలలో విద్యార్థులను ఏవిధంగా ఇబ్బంది పెట్టకూడదు అనే ఒక విధానం అమల్లోకి వచ్చింది. కానీ గుంజీలు తీయడం వలన విద్యార్థులకు మంచి ఆరోగ్యంతో పాటు జ్ఞాపక శక్తి పెరుగుతుందని ఒక పరిశోదనలో తేలింది..

uses-of-squat-punishment-to-students

పలు అభివ్రుద్ది చెందిన దేశాలలో కూడా వెనకబడిన పిల్లలతో రోజు కనీసం ఒక 10-15 గుంజీలు తీయిస్తారట. రెండు చేతులతో చెవులని పట్టి లాగుతూ గుంజీలు తీయడం వలన నాడులు స్పందించి మెదడుకి వచ్చే సంకేతాలను మెరుగుపరుస్తాయట! దాని వలన జ్ఞాపకశక్తి చాలా మెరుగుపడుతుంది. ఇంకేందుకు ఆలస్యం మీ పిల్లలను బడిలో కాకుండా ఇంటి వద్దనైనా రోజు గుంజీలు తీయించండి దానితో మీ పిల్లల వెనుకబడిన పిల్లలు జాబితా నుండి మొదటి జాబితాలోకి వస్తారు….

(Visited 599 times, 50 visits today)