మామిడి పండ్లతో రక్త హీనతకు మరియు ఇతర వ్యాధులకు చెక్ పెట్టండి.

Author:

వేసవిలో వచ్చిందంటే మార్కెట్ లో మామిడి పండ్ల సందడి మొదలవుతుంది. నాలుగు వేల సంవత్సరముల చరిత్ర కలిగి ఉండి ఫలాలలో రాజుగా పిలవబడే మామిడి పండ్లు ఈ మండే వేసవిలో మన శరీరానికి కావాల్సిన పోష‌కాలను అందిస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా 1100 రకాల మామిడి పండ్లు పండుతుండగా మన దగ్గర మాత్రం బంగనపల్లి, ఆల్ఫాన్సో, రసాలు, దశహరి, హిమాయుద్దీన్‌, తోతాపురి, సువర్ణరేఖ, నీలం, కొబ్బరిమామిడి, మల్లిక, ఆమ్రపాలి, అరుణ, బాంబే మామిడి రకాలు అందుబాటులో ఉన్నాయి. కేవలం రుచి కొసమే కాకుండా మామిడి పండ్లు తినడం వలన మన శరీరానికి చాలా ప్రయోజనాలు కలిగి చాలా అనారోగ్య స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి. మరి ఆ ప్రయోజనాలు ఎమిటో క్రింద చదవండి.

benefits of mango fruit

1. మామిడి పండు క్యాన్సర్‌ నివారిణి: మామిడి పండ్లలో ఉండే పాలీఫెనోల్‌ క్యాన్సర్‌ కణాల పెరుగుదలను అడ్డుకుంటుంది. మామిడి పండ్లు రొమ్ము, పెద్దపేగు క్యాన్సర్‌ ను నిరోదిస్తాయి.
2. రక్తహీనతతో బాధపడేవారు మామిడిపండ్లతో దానికి చెక్ పెట్టవచ్చు. మామిడి పండ్ల ద్వారా శరీరానికి కావాల్సిన ఐరన్‌ పుష్కలంగా దొరుకుతుంది.
3. మామిడి పండ్లలో తగిన మోతాదులో ఎ, బి, సి విటమిన్లు, ఖనిజాలూ, యాంటీ ఆక్సిడెంట్లూ పుష్కలంగా ఉండి వివిధ రకాల వ్యాధులు మన దరి చేరకుండా చేస్తాయి.
4. బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్లు, వడదెబ్బ, మలబద్ధకం, డయేరియా, కాలేయవ్యాధులు, ఆస్తమా, నెలసరి ఇబ్బందులు, మొలలు, స్కర్వీ, సైనసైటిస్‌ లాంటి సమస్యల నుండి మామిడి పండు మంచి ఉపశమనం కలుగజేస్తుంది.
5. మామిడిపండులోని ట్రిప్టోఫాన్‌ ఆనందాన్ని అందించే సెరటోనిన్‌ను విడుదల చేసి ఏకాగ్రతనీ, జ్ఞాపకశక్తినీ పెంచుతుంది. మామిడిపండులోని బీటాకెరోటిన్‌ వృద్ధాప్యాన్ని అడ్డుకుంటే, మాంజిఫెరన్‌ శరీరంలోని విషపదార్థాలను తొలగిస్తుంది.
6. వేసవి తాపం నుండి బయటపడటానికి మామిడిపండ్లు మనకు సహకరించడంతో పాటు శరీరం లోని గ్లూకోజు మోతాదులు గణనీయంగా తగ్గించి శరీర బరువు తగ్గడానికి దోహద పడుతాయి.

(Visited 1,092 times, 101 visits today)