చింత గింజలు పారేస్తున్నారా? ఇది చదివితే అలా ఏప్పటికీ చేయరు.

Author:

చింత మన ఎన్నో చింతలు తగ్గించ గలదని రుజువయ్యింది. సాధారణంగా చింతపండు వాడుకొని దాని గింజలను పారవేస్తుంటాము. ఈ సారి అలా చేయకండి. ఎందు కంటే చింత గింజల్లో ఎన్నోఆరోగ్య సమస్యలు తొలగించే ఔషధ పదార్థాలు ఉన్నాయని తెలుసుకొన్నారు.

ఇవ్వాళ చాలా మందిని బాధిస్తోన్న ‘మోకాలి నొప్పి’ ని చింత గింజల పొడి తగ్గించగలదు. వయసు పెరగడం అధిక బరువు వంటి కారణాల వల్లమోకాలిలో కీళ్ళు అరిగి పోయి మోకాలి నొప్పి కలుగుతుంది. ప్రతీక్షణం మన వేగానికి అడ్డు వేసే ఈ మోకాలి నొప్పికిఇంట్లోనే అధ్బుత ఔషధాన్ని తయారు చేసుకోవచ్చు.

చింత గింజల ఔషధం తయారీ

చింత గింజలను తీసుకొని పుచ్చులు లేకుండా బాగా శుభ్రపరచుకోవాలి. వీటిని బాగా వేయించిన తర్వాత మంచినీటిలో రెండు రోజుల పాటు నాన బెట్టాలి. ప్రతి రోజూ రెండు పూటలా నీటిని మారుస్తుండాలి. ఇలా నానిన చింత గింజల ను పొట్టు తీసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి.ఈ పొడిని గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి.

చింత గింజల పొడివాడుకొనే విధానం

చింత గింజలపొడి ని రోజు కు రెండు సార్లు అర టీ స్పూన్ చొప్పున పాలు లేదా నీటితో నెయ్యి లేక చక్కెర కలిపి తీసుకోవాలి. ఇలా చేస్తే రెండు ,మూడునెలల్లో గుణం కనపడుతుంది. మోకాలి నొప్పి పూర్తిగా తగ్గుతుంది.

2

చింత గింజలతో మరిన్ని లాభాలుః

చింత గింజల చూర్ణం కీళ్ళ నొప్పులకే కాక డయేరియా, డయాబెటిస్, గొంతులో ఇన్‌ఫెక్ష‌న్లు ఇంకా దంత సమస్యలను గుణపరుచుతుంది.

రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

గుండె సంబంధిత వ్యాధులకు ఇది చక్కని ఔషధం. ఎముకలు విరిగిన చోట చింత గింజల పొడి పేస్టు పెట్టి కట్టు కడితే త్వరగా అతుక్కుంటాయి.

చూశారుగా చింత గింజలతో ఉపయోగాలు మ‌రెందుకు ఆల‌స్యం? వెంటనే చింత గింజల చూర్ణం వాడడం మొదలు పెట్టండి.

తెలుగు డాట్ అలజడి డాట్ కామ్ ను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌,ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.

(Visited 1 times, 185 visits today)