Home / Inspiring Stories / కలెక్టర్ అవటానికి ఆటో నడుపుతోన్న అమ్మాయి.

కలెక్టర్ అవటానికి ఆటో నడుపుతోన్న అమ్మాయి.

Author:

Bengaluru lady driving auto

ఆత్మ విశ్వాసం తో బతకటమెలాగో, జీవితం తో పోరాడి గెలవటం ఎలాగో మనకు చెప్పటానికి మన జీవితం లో ఉన్న సమస్యలను అధిగమించటానికి ఏం చేయాలో నేర్పించటానికి ఎక్కడా ఇనిస్టిట్యూట్లు ఉండవు. జీవితం ఒక క్లాస్ రూం లో నేర్చుకునే కోర్స్ కాదు. జీవించటం ఎలానో నేర్పించేది జీవితమే…. మన చుట్టూ ఉండే మనుషులే మనం జీవించటం ఎలానో నేర్పించే టీచర్లు… ఇదిగో ఈ 22ఏళ్ళ ఎల్లమ్మ లాగా….

బెంగుళూరుకు చెందిన ఎల్లమ్మ ఒక దిగువ మధ్య తరగతి కుటుంబం లో పుట్టిన అమ్మాయి. సగటు పేదతండ్రుల్లాగే ఎల్లమ్మకు కూడా కనీస వివాహ వయస్సు రాక ముందే ఒక ఫ్లవర్ డేకోరేటర్ కి ఇచ్చి పెళ్ళి చేసాడు. ఒక పాప పుట్టగానే వ్యసనాలకు బానిసైన ఆ వ్యక్తి ఎల్లమ్మని వదిలేసి వెళ్ళిపోయాడు. విడాకులు ఇచ్చేసాడు… ఎక్కువగా చదువుకోని అబ్బాయిల జీవితాలకే గ్యారెంటీ లేని చోట నేనెలా బతకాలి? అని ఆలోచించలేదు ఎల్లమ్మ. బతకాలి ఎంతకష్టమైనా బతకాలి కానీ బతకటమంటే కేవలం బతకటం కాదు తన మూడేళ్ళ పాపనీ తనలా అవకుండా పెంచాలి. అంటే తను చదువుకోవాలి… ఇదే ఆలోచించిన ఎల్లమ్మ. ఒక నిర్ణయం తీసుకుంది…

ఇప్పటివరకూ మగ వాళ్ళ పని గానే కొన సాగుతున్న ఆటో డ్రైవింగ్ ని ఎంచుకుంది. ఒకప్పుడు తన అక్క భర్త కున్న ఆటోని సరదాగా నడిపిన తను ఇప్పుడు ఆ ఆటోనే నడపాలి అని అనుకుంది. ఇప్పటికి తన తండ్రిగా భావించే బావనే ఒక ఆటో అద్దెకి ఇప్పించమని అడిగిమంది. 130 మంది ఓనర్లు కేవలం స్త్రీ అన్న కారణం తో ఆటో అద్దెకివ్వటానికి నిరాకరించారు..అంతే కాదు ఆటో నడపటం అంటే మామూలు విశయం కాదు.. ఇక్కడ మగవాళ్ళే తట్టుకోలేకపోతున్నారు నువ్వేం నడపగలవు ఇళ్ళలో పాచి పని చేసుకో అంటూ ఉచిత సలహాలు కూడా ఇచ్చారు… అయితే ఎల్లమ్మ లక్ష్యం ఐఏఎస్ భారత దేశపు ఉన్నత సర్వీస్లలో ఒకటి. ఐఏఎస్ కి ప్రిపేర్ అవ్వాలంటే ముందు తన డిగ్రీ పూర్తవ్వాలి ఆ పుస్తకాలకీ, మిగతా ఖర్చులకీ డబ్బూ సమయం చాలా అవసరం. అందుకే పట్టిన పట్టు వదల్లేదు. ఆఖరికి 131 వ్యక్తి ఆమెకి ఆటో అద్దెకివ్వటానికి అంగీకరించాడు. రోజువారీ అద్దె 150 రూపాయలు.

బెంగుళూరు రోడ్లమీదకి తన ఆటోని పరుగులు తీయించిన ఎల్లమ్మ రోజూ ఉదయం 6గంటలనుండీ రాత్రి 8 గంటలవరకూ ఆటో నడుపుతోంది. ఇప్పుడు రోజు కి 700-800 వరకూ సంపాదిస్తోంది దీనిలో ఆటో మెయింటెనెన్స్, ఇంథనం, ఆటో అద్దే పోనూ ఆమెకి మిగిలేది 300-400 ఆ డబ్బులతోనే తను చదువుకోవటానికి కావాల్సిన పుస్తకాలనూ, తన కూతురి స్కూల్ ఫీజు నీ, ఇంటిఖర్చులనీ సరిపెడుతుంది. ఇప్పుడు తన (ఇంటర్) ముగించిన ఎల్లమ్మ ఇప్పుడు డిగ్రీ కోసం కాలేజ్ లో చేరబోతోంది. ఇప్పుడు తన లక్ష్యం కలెక్టర్ కావలన్నదే….

తన ఆటోలో ఎక్కిన పాసింజర్లు తన కథని విన్నప్పుడు తమ గమ్య స్థానాల్లో దిగిన తర్వాత కొంత డబ్బు ఆమికివ్వబోతారట అయితే మీటర్ కంటే 10-20 రూపాయలను మాత్రం తీసుకొని మిగతా నోట్లను వాళ్ళ చేతిలో పెట్టేస్తుంది ఎల్లమ్మ ఆ అదనంగా తీసుకున్న డబ్బుని కొందరు బిచ్చగాళ్ళకి ఇచ్చేస్తుందట… జీవితాన్ని గెలిచి చూపించాలన్న ఎల్లమ్మ తపన, ఆమె ఐఏఎస్ ఆశయం, తన పాపకి మంచి జీవితాన్ని అందిచాలన్న కలా నెరవేరాలని కోరుకుందాం….

(Visited 968 times, 40 visits today)