Home / User Stories / హైదరాబాద్ లో బెస్ట్ హలీమ్ దొరికే ప్రాంతలివే…!

హైదరాబాద్ లో బెస్ట్ హలీమ్ దొరికే ప్రాంతలివే…!

Author:

హలీం సీజన్ వచ్చేసింది… ఔను..! ప్రపంచానికి ఇది రంజాన్ మాసమే కానీ హైదరబాదీలకు మాత్రం ఇది హలీం మాసం… ప్రతీ ముస్లిం సోదరుడూ తన ప్రార్థనలో కోరుకునే శాంతి తన సాటి సోదరుడికి ఇవ్వాలనుకుంటాడు అందుకే హైదరాబాద్ ఎన్ని రాజకీయ కోణాలతో మత ఘర్షణలు రెచ్చగొట్టినా మళ్ళీ మళ్ళీ హిందూ ముస్లిం ఐక్యతకు నిదర్శనం గా నిలబడుతూనే ఉంది. ప్రతీ నోటికీ అద్బుతమైన రుచులని అందిస్తూనే ఉంది. హలీం ఎన్నొ ప్రొటీన్ లతో కూడిన బలవర్థక ఆహారం. ముస్లింల ఉపవాస దినాలలో వండే ప్రత్యేక వంటకమే అయినా.ఇది అందరి ఫేవరెట్ హైదరబాదీ వంటకంగా అంతర్జాతీయ సాయిలో హలీం పేరు వినిపిస్తుంది. ఆహారపుటలవాట్లూ రెండు సంస్కృతులను దగ్గర చేస్తాయనేందుకు నిదర్శనం హలీం.. మరి హైదరాబాద్ లో దొరికే హలీం ఒకటేనా అంటే ఒక్కో ఏరియాలో ఒక్కో టేస్ట్… ఒక్కో బావర్చి(వంటగాడు) చేతిలో ఒక్కో ప్రత్యేక రుచి… హైదరాబాద్ బెస్ట్ హలీం ఎక్కడా అంటే… ఇదిగో మీకోసం ఈ ప్లేస్ లు….

1.హొటల్ షా గౌస్ కేఫ్ అండ్ రెస్టారెంట్ @ చార్మినార్ & టోలీ చౌకి :

shah-ghouse-haleem

చార్మినార్ కి కూతవేటు దూరం లో ఈ మహా నగర గుర్తింపు కట్టడాన్ని చూస్తూ హలీం ని ఆస్వాదించొచ్చు పక్కా ఓల్డ్ సిటీ ఫ్లేవర్ కనిపిస్తుంది కేవలం నాలికే కాదు మనస్సూ ఆ రుచిని ఆస్వాదిస్తుంది. ఒక వేళ ఏమాత్రం అవకాశం ఉన్న షా గౌస్ రెస్టారెన్ లో హలీం ని మిస్ కాకండి. ఇక్కడ హలీం ఆస్వాదించటం ఒక అద్బుతమైన అనుభూతి… వీరిదే టోలీ చౌకీ లో కూదా ఇంకో బ్రాంచ్ ఉంది అక్కడ కూదా ఇదే హలీమ్ని అందుకోవచ్చు….

2.సర్వీ @ బంజారా హిల్స్:

sarvi-haleem-hyd

హలీం అంటే కేవలం మాంసాహారమే అనుకుంటే పొరపాటే గోదుమల తోనూ మాంసానికి ఏమాత్రం తీసి పోని రుచి తో ఇక్కడ మీరు హలీం ని ఆస్వాదించొచ్చు. అయితే ఇక్క డ కేవలం మటన్ తోనూ, గోధుమల తోనూ చేసిన హలీం మాత్రమే ఉంటుంది. చికెన్ లాంటి వెరైటీలు ఇక్కడ ఉంద్ఫవు. పక్కా డ్రై ఫ్రూట్స్ తో నింపిన హలీం మిమ్మల్ని ఒక్క ప్లేట్ తో ఆగనివ్వదు. తిన్నాక ఆ అనుభూతిని మరపుకు రానివ్వదు.

3.కేఫ్ బహార్ @ బషీర్ భాగ్:

Cafe-Bahar-haleem

హలీం హోయా హరీస్ ఖానా పడేగా బహార్ మే… బషీర్ భాగ్ లో బహార్ కేఫ్ హలీం ఇక్కడ హాట్ ఫేవరెట్ సాయంత్రానికల్లా అక్కడికి వచ్చే హలీం ప్రియులతో నిండిపోతుంది ఆ ప్రాంతమంతా. అంటేనే అర్థం చేసుకోవచ్చు ఆ రుచికి ఉన్న మహత్తేమిటో. ఇక హలీం కాంబోస్ ఇక్కడి ప్రత్యేకం దీని గురించి మేం ఎంత చెప్పినా తక్కువే కాబట్టి ఒక్క సారి వెళ్లి టేస్ట్ చేయండి అప్పుడు మీకే అర్థమౌతుంది అది మాటల్లో చెప్పలేం అని.

4.పిస్తా హౌస్ @చార్మినార్:

Pista House Haleem

ఇప్పటికే ప్రపంచ ప్రసిద్ది గాంచిన ఈ పిస్తా హౌస్ గురించీ ఇక్కడ తయారయ్యే హలీం డిమాండ్ గురించీ మీరు వినే ఉంటారు. అయితే పిస్తా హౌస్ కేవలం చార్మినార్ దగ్గరే కాదు సిటీ లోని అన్ని ప్రాంతాలలోనూ బ్రాంచ్ లు తెరుస్తుంది. ఈ ప్రసిద్ది చెందిన వంటకాన్ని అందరికీ అందిస్తూ ఉంటుంది. అయితే మెయిన్ బ్రాంచ్ లో మాత్రం సంవత్సరమంతా హలీం దొరుకుతుంది. ఇక్కడి నుంచి విదేశాలకూ హలీం ఎగుమతి ఔతుంది.

5. షాదాబ్ హొటల్ @ చార్మినార్:

Shabad-Hotel-Haleem

హలీం అంటే ఉండే మజా ఏమిటో తెలియాలీ అంటే షాదాబ్ హొటల్ కి వెళ్ళాల్సిందే హలీం విత్ అండా (గుడ్డు) మిలేగా టేస్ట్ కా ఫందా.. ఒక అచ్చమైన మొఘలాయీ రుచి తో ఇచ్చే హలీం… మరింత స్పెషల్ టేస్ట్ తో ఉంటుంది.

6.హొటల్ ఇక్బాల్ @ యాకూత్ పురా:

Hotel Iqubal

ఇరానీ స్టయిల్ ఆఫ్ కుకింగ్ తో ఇక్కడ తయారయ్యే హలీం రుచిని మీరు ఇంకెక్కడా పొందలేరు. ఇది కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ మాత్రమే వచ్చే రుచి… ఈ హలీం రుచి మీకు హైదరాబాద్ లోనే కాదు ప్రపంచం లోనే ఇంకెక్కడా దొరకదు. కుంకుమపువ్వు ని వాడటం వల్ల దీనికి మరింత ప్రత్యేక రుచి వస్తుందట. అయితే ఆ మొతాదు వీరికి మాత్రమే తెలుసు కుంకుమ పువ్వు వేసే మోతదులో ఏమాత్రం తేడా వచ్చిన ఆ టేస్ట్ రాదు..

7. గ్రాండ్ హోటల్ @ అబిడ్స్ :

Grand-hotel-haleem

అబిడ్స్ చౌరస్తా పోస్టాఫీస్ కి వెనక ఉండే ఈ గ్రాండ్ హొటల్ కూడా కొన్ని దశాబ్దాల కాలంగా హలీం కి పేరుగాంచింది. కేవలం గ్రాండ్ హొటల్ లో హలీం కోసమే చుట్టు పక్కల 50 కిలోమీటర్ల నుంచి అదే పనిగా వచ్చేవారున్నారు. అక్కడ హలీం తినటం మీరెప్పటికీ మర్చిపోలేని అనుభూతి. 1946 నుంచీ హలీం కి ప్రసిద్ది గాంచిందీ హొటల్.

8.మదీనా హోటల్@పత్థర్ గట్టీ:

hyderabadi_haleem-

70 ఏళ్ళ చహ్రిత్ర ఉన్న హోటల్ ఇది హైదరాబాద్ లోని క్లాసికల్ హొటల్స్ లో ఇదీ ఒకటి. హలీం లో నే రకరకాల రుచులకు మదీనా హొటల్ పెట్టింది పేరు. ఇక్కడ దొరికే హలీం ప్రపంచం లోనే ద బెస్ట్ అంటారు హలీం ప్రియులు..

9. హొటల్ నయాగరా @ మలక్ పేట్:

Hotel-Niagara-haleem

రంజాన్ మాసం లోనే కాదు సంవత్సరమంతా ఇక్కడ హలీం ఘుమగుమలు వస్తూనే ఉంటాయి. పవిత్ర మాసంలో మరింత గా నోరూరిస్తుంది ఈ మస్త్ మస్త్ హైదరబాదీ వంటకం. నయాగరా లో తినటం అంటే ఓల్డ్ సిటీ సంస్కృతినీ దగ్గరినుంచి చూసినట్టే…

10.రుమానియన్ హొటల్ @ టోలీ చౌకీ:

Hotel-Rumaan-haleem-hyderad

హలీం లో మట్టన్ ఎక్కువగా ఉందాలి అనుకునే వారికి ఇదే సరైన ప్లేస్. మరీ పలుచగా కాకుండా ఎక్కువ మొత్తం లో మాంసాన్ని వాడి చేసే హలీం. మీకు ఒక ఫుల్ మీల్స్ తిన్నంత కడుపునింపటమే కాదు. మీ మనసుని కూడా అంతులేని సంతృప్తి తో నింపుతుంది. ఆ టేస్ట్ అలా ఉంటుంది మరి….

ఇదండీ మన హైదరాబాద్ హలీం అడ్డా న్యూస్. అయితే ఇవేకాదు హలీం అంటేనే హైదరాబాద్ అని పేరున్న మన నగరంలో ప్రతీ గల్లీ చివరా ఈ టేస్ట్ అండ్ హెల్త్ కాంబో దొరికుతుంది. సంవత్సరమంతా ఎక్కడో ఒక చోట దొరికినా…. ఈ సమయంలో దొరికే హలీం మరింత రుచిగా ఉంటుంది. అయితే హైదరబాదీలకు సంబందించినంత వరకూ హలీం కేవలం వంటకం కాదు ఇది ఇక్కడి మతసామరస్యానికి ప్రతీక… గంగా జమునా తెహజీబ్ కా షాన్ ఏ హమారా హైదరదాద్ కా హలీం… ఒక్కసారి టేస్ట్ చేయకుంటే ఎలా మరీ..? సో పదండి మరి పైన అన్ని అడ్రస్ లు ఇచ్చాం కదా..! చలో యార్ ఏక్ ఈద్ ముభారక్ కా హగ్ లేనే కే లియే…

Source: Chaibisket.com

(Visited 3,427 times, 80 visits today)