EDITION English తెలుగు
"పీవీ సింధు..మమ్మల్ని క్షమించు"   Video: ప్రియురాలి శవానికి తాళి కట్టి పెళ్లి చేసుకున్న ప్రేమికుడు.   Video: ఒక్క పాటతో ఇంటర్నెట్ ని ఊపేస్తున్న మల్లు బ్యూటీ..!   నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసాడు.. సంపాదించిన ఆస్తి రూ.3930 మాత్రమే..!   మహేష్ బాబు, అల్లు అర్జున్ లకు షాక్ ఇచ్చిన రజినీకాంత్..!   లవర్స్ మధ్య జరిగిన ఈ వాట్సాప్ చాట్ లు చూస్తే ఖచ్చితంగా నవ్వుకుంటారు..! 3వది అయితే హైలైట్..!   మహారాజశ్రీ హైకోర్టు న్యాయమూర్తి గారికి....! కదిలించిన జెడ్పి విద్యార్థినిల లెటర్..!   హైదరాబాద్ లోని ఈ హాస్పిటల్ లో రూ. 10 లక్షలు అయ్యే చికిత్సలు అన్ని ఉచితం..!   తల్లి చనిపోతూ తన కొడుక్కి రాసిన లెటర్..! అది చదివితే కన్నీళ్లొస్తాయి...!   బీటెక్ స్టూడెంట్స్ కు నెలకు రూ.80వేల స్కాలర్ షిప్.
Home / Reviews / భాగమతి పర్ఫెక్ట్ రివ్యూ & రేటింగ్.

భాగమతి పర్ఫెక్ట్ రివ్యూ & రేటింగ్.

భాగమతి రివ్యూ రేటింగ్

Alajadi Rating

3/5

Cast: అనుష్క, ఉన్ని ముకుందన్‌, జయరామ్‌, ఆశా శరత్‌, మురళీ శర్మ..

Directed by: జి. అశోక్‌

Produced by: వంశీ, ప్రమోద్

Banner: యూవీ క్రియేషన్స్

Music Composed by: థమన్

అరుంధతి, రుద్రమదేవి సినిమాలలో లీడ్ రోల్ గా చేసి హీరోయినే ఓరియెంటెడ్ సినిమాలు అంటే అనుష్కతోనే తీయాలి అనేంత క్రేజ్ అనుష్క సంపాదించుకుంది, బాహుబలితో ఆ క్రేజ్ ని డబుల్ చేసుకున్న అనుష్క యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో పిల్ల జమిందార్ సినిమా డైరెక్టర్ అశోక్ కుమార్ దర్శకత్వంలో ” భాగమతి ” గా మన ముందుకు వచ్చింది, మరి ఈ సినిమాలో అనుష్క ఎలా చేసిందో, సినిమా ఎలా ఉందో తెలుసుకోండి.

కథ:

ఐఏఎస్‌ అధికారి చంచల(అనుష్క) కేంద్ర మంత్రి ఈశ్వర్‌ ప్రసాద్‌(జయరాం) దగ్గర పర్సనల్‌ సెక్రటరీగా పనిచేస్తుంటుంది. ప్రజలలో ఆయనకి ఉన్న పేరుని, ఇమేజ్ ని చెడగొట్టాలని రాజకీయ ప్రత్యర్థులు కుట్రలు చేస్తుంటారు. ఒక హత్య కేసులో జైలులో ఉన్న చంచలను సీబీఐ అధికారులు తమ కస్టడీలోకి తీసుకుని పురాతన బంగ్లాకు తీసుకెళ్లి విచారణ చేస్తుంటారు,హత్య కేసులో చంచల జైలుకు వెళ్లడానికి కారణం ఏంటి? ఆమె ఎవరిని హత్య చేసింది? అసలు ఈశ్వర్ ప్రసాద్ కి చంచలకి సంబంధం ఏంటి..? ఆ పురాతన బంగ్లాలో ఏం జరిగింది అనేది మిగిలిన కథ.

అలజడి విశ్లేషణ:

అనుష్క లీడ్ రోల్ గా భాగమతి సినిమా ప్రకటించిన నాటి నుండే ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి, ఇంతకముందు థ్రిల్లర్ కాన్సెప్ట్ తో అనుష్క లీడ్ రోల్ గా చేసిన అరుంధతి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనకి తెలుసు, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా అంటే అద్భుతమైన టేకింగ్, ట్విస్ట్ లని ప్రేక్షకులు ఊహిస్తారు, వాటిని భాగమతి సినిమాలో డైరెక్టర్ అశోక్ బాగానే డీల్ చేసాడు, కథ పెద్దగా లేకపోయిన సస్పెన్స్ క్రియేట్ చేయడంలో కొంచెం సక్సెస్ అయ్యారు.

ఫస్ట్ ఆఫ్ లో రాజకీయ నేపథ్యంలో సినిమాని మొదలుపెట్టి చిన్న చిన్న ట్విస్ట్ లతో కథని నడిపించారు, అనుష్క భాగమతి బంగ్లకి చేరుకున్న తరువాతనే అసలు కథలోకి ఎంటర్ అవుతాము, బంగ్లలో ఉన్న భాగమతి ఆత్మ నేపథ్యంలో వచ్చే సీన్స్ కొంచెం సాగదీతగా అనిపించినప్పటికీ బాగానే ఉన్నాయి, ఒక స్టేజిలో సినిమాలో అనుష్కనే విలన్ అనేంతలా అనిపిస్తుంది, చిన్న చిన్న ట్విస్ట్ లు, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లు ఆకట్టుకుంటాయి, కానీ కొన్ని కామెడీ సీన్స్ మరి రొటీన్ గా అనిపిస్తాయి, చివరికి ట్విస్ట్ తో సినిమా క్లైమాక్స్ కి చేరుకుంటుంది.చివరగా భాగమతి కొంచెం భయపెట్టి, కొంచెం రొటీన్ గా అనిపించి.. థ్రిల్ చేస్తుంది.

త‌మ‌న్ నేప‌థ్య సంగీతం గురుంచి ఖచ్చితంగా చెప్పుకోవాల్సిందే, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో సినిమాని నిలబెట్టాడు, ఇంకా భాగమతి బంగ్లా సెట్ ఆర్ట్ వర్క్ సినిమాకే హైలైట్, కెమెరా విజువల్స్ కూడా బాగున్నాయి, దర్శకుడు అశోక్ సినిమాని బాగానే తీర్చిదిద్దినప్పటికీ అక్కడడక్కడ రొటీన్ సన్నివేశాలతో ఇబ్బంది పెట్టాడు.

నటీనటుల పెర్ఫార్మన్స్:

అనుష్క ఈ సినిమాతో తన యాక్టింగ్ టాలెంట్ ఏంటో మరోసారి నిరూపించింది, ఇటు ఐఏఎస్ గా, అటు భాగమతిగా సూపర్బ్ గా నటించింది, మినిస్టర్‌ ఈశ్వర్‌ ప‍్రసాద్‌గా.. రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో జయరామ్‌ బాగా చేసాడు. హీరోగా నటించిన ఉన్ని ముకుందన్ ది చిన్న పాత్రే అయినా తనదైన హావ భావాలతో మెప్పించాడు . సీబీఐ జేడీ పాత్రలో ఆశా శరత్‌ నటన బాగుంది, పోలీస్ ఆఫీసర్ గా మురళి శర్మ, కమెడియన్లుగా ప్రభాస్ శ్రీను, ధనరాజ్, విధ్యుల్లేఖ రామన్ బాగానే చేసారు.

ప్లస్ పాయింట్స్ :

  • అనుష్క పెర్ఫార్మన్స్
  • బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
  • కొన్ని ట్విస్ట్ లు
  • ఆర్ట్, కెమెరా వర్క్

మైనస్ పాయింట్స్ :

  • కొన్ని రొటీన్ సన్నివేశాలు.
  • డైలాగ్స్
  • కామెడీ సన్నివేశాలు.

పంచ్ లైన్: భాగమతి అడ్డాలో లెక్క మొత్తం తేలలేదు..!

Comments

comments