EDITION English తెలుగు
"పీవీ సింధు..మమ్మల్ని క్షమించు"   Video: ప్రియురాలి శవానికి తాళి కట్టి పెళ్లి చేసుకున్న ప్రేమికుడు.   Video: ఒక్క పాటతో ఇంటర్నెట్ ని ఊపేస్తున్న మల్లు బ్యూటీ..!   నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసాడు.. సంపాదించిన ఆస్తి రూ.3930 మాత్రమే..!   మహేష్ బాబు, అల్లు అర్జున్ లకు షాక్ ఇచ్చిన రజినీకాంత్..!   లవర్స్ మధ్య జరిగిన ఈ వాట్సాప్ చాట్ లు చూస్తే ఖచ్చితంగా నవ్వుకుంటారు..! 3వది అయితే హైలైట్..!   మహారాజశ్రీ హైకోర్టు న్యాయమూర్తి గారికి....! కదిలించిన జెడ్పి విద్యార్థినిల లెటర్..!   హైదరాబాద్ లోని ఈ హాస్పిటల్ లో రూ. 10 లక్షలు అయ్యే చికిత్సలు అన్ని ఉచితం..!   తల్లి చనిపోతూ తన కొడుక్కి రాసిన లెటర్..! అది చదివితే కన్నీళ్లొస్తాయి...!   బీటెక్ స్టూడెంట్స్ కు నెలకు రూ.80వేల స్కాలర్ షిప్.
Home / Entertainment / ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మహేష్ బాబు..!

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మహేష్ బాబు..!

Author:

సూపర్ స్టార్ మహేశ్‌బాబు స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ చుట్టూ తిరిగే స్టోరీతో భరత్‌ అనే నేను సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే, ఆ సినిమాలో మహేష్ బాబు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా నటిస్తున్నాడు, మహేష్ బాబు ముఖ్యమంత్రిగా ఎన్నికైన తరువాత చేసే ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఆడియోని ఈ సినిమా టీమ్ సోషల్ మీడియాలో రిలీజ్ చేసారు,సాధారణంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు తీసుకుంటున్నప్పుడు గవర్నర్ ఏదైతే రాజ్యంగా బద్ధంగా ప్రమాణం చేయిస్తూ చదివిస్తారో అందులో అక్షరం పొల్లు పోకుండా అదే దీనికి కూడా వాడుకున్నారు. మహేష్ వాయిస్ మంచి బేస్ లో వినిపిస్తుండగా బ్యాక్ గ్రౌండ్ లో వినిపిస్తున్న మ్యూజిక్ తో దేవి శ్రీ ప్రసాద్ అదరగొట్టాడు.

ఆడియోలో..‘భరత్‌ అనే నేను..శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను, శ్రద్ధతో, శుద్ధితో నిర్వహిస్తానని, భయంగా కానీ పక్షపాతంగా కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని , శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.’ అని మహేశ్‌ చెప్పడం హైలైట్‌గా నిలిచింది. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌లో మహేశ్‌బాబు సూట్‌కేసు పట్టుకుని నడుచుకుంటూ రావడం సూపర్బ్ గా ఉంది. అయితే ఇందులో ఆయన ముఖ్యమంత్రిగా ఎలా ఉండబోతున్నారు అన్నది మాత్రం చూపించలేదు. మహేశ్‌కు జోడీగా బాలీవుడ్‌ నటి కైరా అడ్వాణీ నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఏప్రిల్‌లో ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాను.

Comments

comments