EDITION English తెలుగు
కాలా సినిమా రివ్యూ & రేటింగ్.   డేవిడ్ వార్నర్ మరియు భార్య కాండిస్ బాల్-టాంపెరింగ్ కుంభకోణం తరువాత గర్భస్రావం చేస్తారు   చైనా హఫీజ్ సయీద్ ను వెలుపలికి వెలుపల కోరుకుంటున్నారు.   MH17 రష్యన్ సైనిక క్షిపణి వ్యవస్థ డౌన్ కూలిపోయింది, పరిశోధకులు చెప్పారు   అమెరికాపై ఆధారపడిన సంబంధం భారత్కు ఎప్పటికీ ఉండదు: నిపుణుడు కాంగ్రెస్ సభ్యులకు చెబుతాడు   హెల్త్కేర్ యాక్సెస్ అండ్ క్వాలిటీలో 195 దేశాలలో నెమ్మదిగా మెరుగుపరుచుకోవడం, భారతదేశం రాంక్స్ 145   ఢిల్లీ మనిషి తన కుమారుని హతమార్చాడు   పెట్రోల్ ధరలు పెరగడంతో పలు నగరాల్లో 80 రూపాయల మేరకు ధరలు పెరిగాయి   కేరళ ప్రభుత్వం గత 24 గంటల్లో బాధిత ప్రాంతాల్లో తాజా కేసులను నమోదు చేయకుండా, సమయానుగుణ జోక్యం ద్వారా వ్యాప్తిని తగ్గించింది.   మనిషి ఇండోర్-గోవా ఇండిగో విమానంలో టేకాఫ్ ముందు తన ప్రియురానికి ప్రతిపాదించాడు.

బిగ్ బాస్ కే షరతులు పెట్టిన రాధేమా…!

Author:

సంచలన ప్రొగ్రాం ఐన బిగ్ బాస్ షో 9 కోసం అంతా ఎదురు చూస్తున్నారు. సెలెబ్రిటీ రియాలిటీ షో లలోనే కింగ్ లాంటి ప్రొగ్రాం గా పేరు తెచ్చుకున్న ఈ స్కాండల్ లో రాబొయే సెలెబ్రిటీలు ఎవరో అన్న విశయం పై కాస్త ఉత్సాహంగానే ఉన్నరు జనాలు.ఈ షో కోసం  వివాదాస్ప సెలబ్రిటీల కోసం
జల్లెడపడుతోంది బిగ్ బాస్ యూనిట్. బిగ్ బాస్ ఎనిమిది ముగిసినప్పటి నుంచి వెలుగులోకి వచ్చిన అలాంటి వివాదాస్పద వ్యక్తులను వెదుకుతున్నారు. ఈసారి బిగబాస్ కి కూడా అలాంటి వ్యక్తులనే వెతుకుతున్న నిర్వాహకులు ఎంచుకున్న కొందరు సెలెబ్రిటీల లిస్టులో ఈసంవత్సరం సరికొత్త వివాదంతో తెరపైకొచ్చిన సంచలన ఆధ్యాత్మిక మాతాజీ రాధేమా కూడా ఉన్నారు. రాధేమా జీవిత కథ జాతీయ మీడియానే కాదు దేశం మొత్తాన్నీ ఆకర్శించింది. పంజాబ్ లోని పల్లెటూరిలో టైలరింగ్ చేస్తూ సాధారణ గృహిణిలా ఉన్న “సుక్వీర్ కౌర్” అనే అమ్మాయి భర్తతో విడిపోయి ముంబాయి వచ్చి అధ్యత్మికత వైపు మళ్ళి అత్యాధునిక సౌకర్యాల ఆశ్రమం, తన పేరుతో సొంత ఊరికి దగ్గరలో గుడీ నిర్మించుకునే దాకా ఎదిగింది. ఈ షో కి ఇంతకన్నా పాపులారిటీ ఉన్న సెలబ్రిటీ ఎక్కడ దొరుకుతారు మరి.

బిగ్ బాస్ షో కోస నిర్వాహకులు రాధేమా ని సంప్రదించారట కూడా ఐతే అమ్మవారు కొన్ని షరతులు విధించారట. ఆ షరతులకు ఒప్పుకుంటేనే నే తాను షో లో పాల్గొంటానని తేల్చి చెప్పారట ఈ దేవీ మాత. అయితే ఆ షరతును బిగ్ బాస్ వాళ్లు యాక్సెప్ట్ చేయలేకపోయారు. దీంతో ఆమె బిగ్ బాస్ లో పాల్గొనడం జరగని పని స్పష్టం అవుతోంది. ఇంతకీ మ్యాటర్ ఏమిటంటే… అమ్మవారు రోజుకు రెండు గంటల సేపు తనకు విరామం ఇవ్వాలని అడిగారట. బిగ్ బాస్ హౌస్ నుంచి తను రోజుకు రెండు గంటల సేపు బయటకు వస్తాననీ, ఆ రెండు గంటలలో తన భక్తులని కలిసి వారిని అనుగ్రహించి , ఆ తర్వాత మళ్లీ షో సభ్యులతో కలిసిపోతానని అమ్మవారు అడిగారట.

అయితే..! అది  షో నియమ నిబంధనలకు విరుద్ధం!  అసలు షోలో పాల్గొంటున్న సెలబ్రిటీలకు తాము ఎక్కడున్నది కూడా తెలియదు. వారుండే ఇంట్లో క్యాలెండర్లు గానీ, సెల్ ఫోన్ లు గానీ కనీసం వాల్ క్లాకులు కూడా అందుబాటులో ఉండవు. అసలు ఈ షొలో కీలకమైన పాయింటే అది  మరి ఈ నయా అమ్మవారి కోసం వారి షో కి ప్రాణం లాంటి  రూల్స్ ను మార్చలేరు కదా..! అందుకే రాధేమా బిగ్ బాస్ లో పాల్గొనడం సాధ్యం
అయ్యేలా లేదు.

(Visited 104 times, 61 visits today)

Comments

comments