EDITION English తెలుగు
బాలకృష్ణపై నాగబాబు షాకింగ్ కామెంట్స్.! అసలు బాలకృష్ణ గురించి ఎందుకు టాపిక్ వచ్చింది?   ఈ స్వీట్ కేజీ 9000 రూపాయలు అంట.! అంత ధర ఎందుకో తెలుసా.? ఎలా తయారుచేస్తారంటే?   ముంబై ఎయిర్ పోర్ట్ లో సరికొత్త రికార్డ్.! అంబానీ కూతురు పెళ్లా మజాకా...!   పాతబస్తీలో ఓటింగ్ తగ్గడానికి కారణం అదేనంట.? ఆలస్యంగా వెలుగులోకి.!   సోదరి సుహాసిని తరుపున ఎన్ఠీఆర్ ఎందుకు ప్రచారం చేయలేదో తెలుసా.? కారణం ఇదేనట!   చాలామంది పండ్లపై ఉప్పు చల్లుకొని తింటారు..! అలా తినడం వల్ల ఏమవుతుందో తెలుసా.?   2014లో ఎంత శాతం మంది ఓట్లు వేసారో తెలుసా.? ఇప్పుడు మారిన లెక్కల వల్ల గెలుపు తారుమారవుతుందా.?   రాజమౌళి, ఎన్ఠీఆర్ ఓట్లు వేశారు.! మరి రామ్ చరణ్ ఎందుకు వేయలేదు.? అసలు కారణం ఇదే!   పాటలు పాడుతూ.. స్టెప్‌లు వేసిన కోహ్లీ.! మైదానంలో కోహ్లీ వెరైటీ డాన్స్ వైరల్ వీడియో.!!   గుత్తాజ్వాల ఓట్ల గల్లంతుపై మరో సంచలన ట్వీట్..! నెట్ లో చూస్కుంటే..?
Home / Entertainment / నటుడు నాజర్ కి గుండెపోటు

నటుడు నాజర్ కి గుండెపోటు

Author:

అటు తమిళ పరిశ్రమ లోనూ ఇటు తెలుగులోనూ నటుడిగా ఒక ప్రత్యేక స్థానం ఉన్న నటుడు నాజర్ కి రాత్రి గుండెపోటు రావడంతో హుటాహుటిగా చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అజయకుమార్ దర్శకత్వంలో వచ్చిన మాతృదేవోభవ తెలుగులో నాజర్ లోని నటున్ని బయటికి తెచ్చిన సినిమా, మణిరత్నం బాంబే, శంకర్ తీసిన  జీన్స్, ఈమధ్యనే త్రివిక్రం శ్రీనివాస్ అతడు చిత్రాలలో అద్వితీయమైన నటన తో తెలుగు ప్రేక్షకులకు బాగానే దగ్గరయ్యాడు. సహజంగా తమిళ నటుడు అయినప్పటికీ నాజర్ తెలుగులో కూడా పలు సినిమాల్లో నటించి, ఇక్కడి వారి అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు.

ఒక్కడున్నాడు చిత్రం లో లాంటి నెగెటివ్ పాత్ర అయినా, అతడు సినిమాలోని పాజిటివ్ తరహా పాత్ర అయినా ఏమాత్రం తేడా లేకుండా అన్ని పాత్రల్లో అద్భుతంగా ఓడిగిపోగల సత్తా ఉన్న నటుడు అయన చంటి సినిమాలో విలన్ గా ఆయన చేసిన నటనకు ఉత్తమ ప్రతినాయకుడిగా నంది పురస్కారం లభించింది. మాతృదేవోభవ సినిమాలో తాగుబోతు కుటుంబ యజమని గా నటనకు కూడా నంది అవార్డు అందుకున్నాడు. తాజాగా రాజమౌళి తీసిన ‘బాహుబలి’ చిత్రంలో పురాణాల్లోని శకుని పాత్రని తలపించే విధంగా బిజ్జలదేవ గా కుట్రలు కుతంత్రాలు చేస్తూ భల్లాల దేవ వెన్నంటి ఉండే తండ్రి పాత్రలో వేశారు. ఈ పాత్ర నిడివి తక్కువే అయినా ప్రేక్షకులూ విమర్షకులనుంచి  మంచి ఆధరణ లభించింది.అంగ వైకల్యం
ఉన్న పాత్రలో అయినా నటించి మెప్పించారు.

నిన్న రాత్రి ఇంట్లోనే ఉన్న ఆయనకు హటాత్తుగా చాతీలో నొప్పి రావటం తో దగ్గర్లోనే ఉన్న అపోలో ఆసుపత్రికి తరలించారు. ఐతే ప్రస్తుతం అయన ఆరోగ్యం నిలకడగా ఉన్నదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చేకప్స్ జరుగుతున్నాయనీ పెద్ద స్టోక్  కాకపోవడం వల్ల ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు చెప్పినట్లు ఆయన సతీమణి కమీలా తెలిపారు. గత కొద్ది కాలంగా సినిమాలో బిజీ ఐపోవటం వల్ల కనీస విశ్రాంతి కూడా లేకుండా నటించడం వల్ల కాస్త వత్తిడికి లోను కావడం వల్లే వచ్చిందని తెలిపారు. ఆసుపత్రి ఫార్మాలిటీస్ పూర్తి అయిన తర్వాత  డిశ్చార్జ్ అవుతారని నాజర్ భార్య కమీలా పేర్కొనడంతో అంతా కాస్త ఊపిరి పీల్చుకున్నారంతా. ఇక బాహుబలి 2 సినిమాకు పూర్తి సన్నద్దమైన రాజమౌళి టీమ్ కి ఈ విషయం కాస్త కలవరం కలిగించినా తర్వాత ఆయన క్షేమమే అని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు.

(Visited 68 times, 35 visits today)