EDITION English తెలుగు
బాలకృష్ణపై నాగబాబు షాకింగ్ కామెంట్స్.! అసలు బాలకృష్ణ గురించి ఎందుకు టాపిక్ వచ్చింది?   ఈ స్వీట్ కేజీ 9000 రూపాయలు అంట.! అంత ధర ఎందుకో తెలుసా.? ఎలా తయారుచేస్తారంటే?   ముంబై ఎయిర్ పోర్ట్ లో సరికొత్త రికార్డ్.! అంబానీ కూతురు పెళ్లా మజాకా...!   పాతబస్తీలో ఓటింగ్ తగ్గడానికి కారణం అదేనంట.? ఆలస్యంగా వెలుగులోకి.!   సోదరి సుహాసిని తరుపున ఎన్ఠీఆర్ ఎందుకు ప్రచారం చేయలేదో తెలుసా.? కారణం ఇదేనట!   చాలామంది పండ్లపై ఉప్పు చల్లుకొని తింటారు..! అలా తినడం వల్ల ఏమవుతుందో తెలుసా.?   2014లో ఎంత శాతం మంది ఓట్లు వేసారో తెలుసా.? ఇప్పుడు మారిన లెక్కల వల్ల గెలుపు తారుమారవుతుందా.?   రాజమౌళి, ఎన్ఠీఆర్ ఓట్లు వేశారు.! మరి రామ్ చరణ్ ఎందుకు వేయలేదు.? అసలు కారణం ఇదే!   పాటలు పాడుతూ.. స్టెప్‌లు వేసిన కోహ్లీ.! మైదానంలో కోహ్లీ వెరైటీ డాన్స్ వైరల్ వీడియో.!!   గుత్తాజ్వాల ఓట్ల గల్లంతుపై మరో సంచలన ట్వీట్..! నెట్ లో చూస్కుంటే..?
Home / Entertainment / రూ.7 కోట్ల ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పింది.. కానీ..

రూ.7 కోట్ల ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పింది.. కానీ..

Author:

కౌన్‌ బనేగా కరోడ్‌పతి (కేబీసీ) 10వ సీజన్‌లో నిన్న అసోంలోని గువాహటికి చెందిన బినిత జైన్‌ రూ.కోటి గెలుచుకున్నారు. ఈ విషయాన్ని వారం రోజుల క్రితం సోనీ టీవీ విడుదల చేసిన ఓ ప్రోమోలోనూ చూపించిన విషయం తెలిసిందే. అయితే, ఆమె రూ.ఏడు కోట్ల జాక్‌పాట్‌ ప్రశ్నకు కూడా సరైన సమాధానం చెబుతారా? అనే విషయంపై ప్రేక్షకులు అమితాసక్తి కనబర్చారు. కేబీసీ 10వ సీజన్‌లో రూ.కోటి గెలుచుకున్న మొదటి పోటీదారుగా ఆమె నిలిచిన అనంతరం మరో ప్రశ్నకు సరైన సమాధానం చెబితే రూ.ఏడు కోట్లు గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ చెప్పలేకపోతే అప్పటివరకు గెలుచుకున్న డబ్బు పోతుంది. ‘1867లో మొదటి స్టాక్‌ టికెట్‌ను ఎవరు కనుగొన్నారు?’ అని ఈ కార్యక్రమ వ్యాఖ్యాత, బాలీవుడ్‌ దిగ్గజ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ ఆమెను ఆ ప్రశ్న అడిగారు. అయితే, దానికి సరైన సమాధానం తెలిసినప్పటికీ, తాను చెప్పబోయే ఆ జవాబు సరైందో? కాదో? అని సందేహించిన బినిత జైన్‌ రూ.కోటితో వైదొలుగుతానని ప్రకటించారు. అనంతరం ఆమె ఆ ప్రశ్నకు చెప్పిన సమాధానం చెప్పగా.. అది సరైందేనని అమితాబ్‌ తెలిపారు. అయితే, రూ.కోటితో వైదొలుగుతానని ఆమె ముందుగా ప్రకటించడంతో రూ.ఏడు కోట్లు గెలవలేకపోయారు. ఆమె రూ.కోటితో పాటు ఓ కారు కూడా గెలుచుకున్నారు.

కేబీసీ నుంచి వైదొలిగాక ఆమె తన వ్యక్తిగత జీవితం గురించి చెప్పారు. తాను అనుభవించిన బాధల గురించి ఆమె వివరిస్తుంటే ప్రేక్షకులు కన్నీరు పెట్టుకున్నారు. 2003 ఫిబ్రవరిలో ఓ బిజినెస్ ట్రిప్ నిమిత్తం పొరుగు రాష్ట్రాలకు వెళ్లిన ఆమె భర్త మళ్లీ తిరిగిరాలేదు. కొద్ది కాలానికి ఆయన ఉగ్రవాదుల చేతుల్లో కిడ్నాప్‌కి గురైనట్టు తెలిసింది. అప్పట్నుంచి తప్పిపోయిన తన భర్త కోసం ఆమె శక్తిమేర ప్రయత్నించినా ప్రయోజనం దక్కలేదు.

ఏడాదిన్నర పాటు ఎదురు భర్తకోసం ఎదురు చూసిన ఆమె.. చంటి బిడ్డల తల్లిగా తన కాళ్లపై తానే నిలబడాలని నిర్ణయించుకున్నారు. తన భర్త చనిపోయినట్టు అధికారులు ధ్రువీకరించడంతో… బతుకుదెరువు కోసం ట్యూషన్లు చెప్పడం మొదలు పెట్టారు.

Binita Jain didn't win Rs 7 crore despite guessing the correct answer

ఏడుగురు పిల్లలతో ట్యూషన్ మొదలు పెట్టగా… ఇప్పుడు 125 మంది విద్యార్దులు ఆమె వద్ద కోచింగ్ తీసుకుంటున్నారు. అయితే ఏదో ఒకనాడు తన భర్త తిరిగి రాకపోతాడా అని ఎదురుచూస్తున్నామంటూ ఆమె కంటతడి పెట్టడం ప్రేక్షకుల గుండెలను బరువెక్కించింది.

(Visited 1 times, 139 visits today)