Home / Videos / లోకేష్ కి ట్యూషన్ చెప్పబోతున్న బిత్తిరి సత్తి.

లోకేష్ కి ట్యూషన్ చెప్పబోతున్న బిత్తిరి సత్తి.

Author:

అంబేద్కర్ 125 వ జయంతి నాడు ఆంధ్ర ప్రదేశ్ ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి అయిన నారా లోకేష్ మాట్లాడుతూ పొరపాటున జయంతికి బదులు వర్థంతి అని మాట్లాడాడు, ఒక మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి జయంతికి వర్థంతికి ఉన్న తేడా తెలియకపోవడం చాలా ఆశ్ఛర్యకరమైన విషయం, లోకేష్ మాట్లాడిన మాటలు పై సోషల్ మీడియా చాలా ఫోటోలు , వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి.ఈ సంఘటన జరిగిన రెండు రోజులకే గుంటూరు ప్రాంతంలో పర్యటించిన నారా లోకేష్ మరోసారి నోరు జారటంతో అవాక్కవ్వడం ప్రజల వంతు అయింది, రాష్ట్రంలో తాగునీటి సమస్య లేకుండా చేయటమే లక్ష్యం అనడానికి బదులు తాగునీటి సమస్యని చేయటమే తన లక్ష్యం అని అన్నారు, ప్రజలకి ఒక రాజకీయ నాయకుడు దగ్గర కావాలంటే వాక్చాతుర్యం చాలా ఉండాలి, భవిష్యత్ లో ముఖ్యమంత్రి కావాలనుకుంటున్న లోకేష్ తెలుగు భాషని సరిగ్గా మాట్లాడటం నేర్చుకోకపోతే చాలా కష్టం.

అన్ని విషయాలపై వ్యంగంగా తన మాటని చెప్పే బిత్తిరి సత్తి, నారా లోకేష్ విషయంలో కూడా తీన్మార్ న్యూస్ లో వ్యంగంగా తన మాటని చెప్పాడు, లోకేష్ బాబుకి ట్యూషన్ చెప్పాలి అనే కాన్సెప్ట్ తో వచ్చిన బిత్తిరి సత్తి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది, మీరు కూడా ఆ వీడియోని ఒకసారి చూడండి.

Comments

comments