Home / Inspiring Stories / నాయిని సారు మాటలు సత్తికి ఇట్ల అర్థమైనయా..!?

నాయిని సారు మాటలు సత్తికి ఇట్ల అర్థమైనయా..!?

Author:

ఇగో గిదేం కథనో గనీ సత్తి జైలుకు పోతడాట. జైళ్ళల్ల అన్ని సౌలతులున్నయ్ ఒక్క సారి మన జైల్లని చూస్తే బైట ఉన్నవాళ్ళకు కూడా జైలుకు రావాలనిపిస్తది” అన్న మన నాయిని సారు మాతలు మన సత్తికి ఇంకోతీరు అర్థమైనట్టున్నయ్. ఇగో సారు రమ్మన్నడు నేను జైలుకోపోతా అని ఓశెద్దరి బుజానేశి ప్లేటూ,గిలాస పట్టుకోని బైలెల్లిండు. గిదేం కథ నాయినా ? అంటే మా నాయిని సారు చెప్పిందిన్లేదా జైళ్ళ అన్ని సౌలతులున్నయాట సార్ రమ్మన్నడు అనుకుంట పోతున్నడు. అవ్వన్ని స్కాములల్ల పడి జైలుకచ్చిన పెద్దమనుషులకే మనకేం ఉండయ్ అన్నా ఇంటలేడు దొర. ఒక్కడే కాక రోడు మీద అచ్చి పోఏటోళ్ళను కూడ ఏందో సీన్మకత్తవ్వా అన్నట్టు “తమ్మీ..! జైలుకత్తవా అని అడుగుతుండు మల్ల.”
మన సత్తి సంగతి పక్కకు పెట్టున్లి గనీ… మన రాష్ట్రం లున్న దొంగలకూ, క్రిమినల్స్ కూ నాయిని సార్ మాటలు ఇట్లనే అర్థమైతే..! గప్పుడేందో మల్ల తమాషా. అందరు జైల్లకే ఎగవడ్తరు. అప్పుడు జైళ్ళ కూడా “ఘర్ వాపస్” పెట్టి అందర్ని ఇండ్లకు తోలేస్తరేమో మల్ల… నాయిని సారే చెప్పలె. ఏమంటరు..?

(Visited 175 times, 41 visits today)