EDITION English తెలుగు
"పీవీ సింధు..మమ్మల్ని క్షమించు"   Video: ప్రియురాలి శవానికి తాళి కట్టి పెళ్లి చేసుకున్న ప్రేమికుడు.   Video: ఒక్క పాటతో ఇంటర్నెట్ ని ఊపేస్తున్న మల్లు బ్యూటీ..!   నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసాడు.. సంపాదించిన ఆస్తి రూ.3930 మాత్రమే..!   మహేష్ బాబు, అల్లు అర్జున్ లకు షాక్ ఇచ్చిన రజినీకాంత్..!   లవర్స్ మధ్య జరిగిన ఈ వాట్సాప్ చాట్ లు చూస్తే ఖచ్చితంగా నవ్వుకుంటారు..! 3వది అయితే హైలైట్..!   మహారాజశ్రీ హైకోర్టు న్యాయమూర్తి గారికి....! కదిలించిన జెడ్పి విద్యార్థినిల లెటర్..!   హైదరాబాద్ లోని ఈ హాస్పిటల్ లో రూ. 10 లక్షలు అయ్యే చికిత్సలు అన్ని ఉచితం..!   తల్లి చనిపోతూ తన కొడుక్కి రాసిన లెటర్..! అది చదివితే కన్నీళ్లొస్తాయి...!   బీటెక్ స్టూడెంట్స్ కు నెలకు రూ.80వేల స్కాలర్ షిప్.
Home / Political / బ్లడ్ బ్యాంకులు, ఆసుపత్రుల నిర్లక్ష్యంతో ఏటా వృధా అవుతున్న 6లక్షల యూనిట్ల రక్తం.

బ్లడ్ బ్యాంకులు, ఆసుపత్రుల నిర్లక్ష్యంతో ఏటా వృధా అవుతున్న 6లక్షల యూనిట్ల రక్తం.

Author:

ఈ వార్త వింటేనే రక్తం ఉడికిపోతుంది, మనం చిన్నప్పటి నుంచీ వింటున్నాం భారత దేశం అభివృద్ధిచెందుతున్న దేశం అని.. గత కొన్ని దశాబ్దాలుగా ఇంకా చెందుతూనే ఉంది కాని ఎప్పటికి అభివృద్ధి చెందిన దేశం గా మారుతుందో ఎవరికి తెలియదు? మన దేశం అభివృద్ధి చెందకపోవడానికి గల కారణాలు ప్రతి ఒక్కరికి తెలుసు. మన రాజకీయ నాయకులు, ప్రభుత్వాలలో ఉన్న నిర్లక్ష్య ధోరణి, అనినీతి, వనరుల వృధా, సంపదల వృధా. వర్షా కాలంలో పడినా నీటిని వృధా చేసి తరువాత తాగు నీటి కోసం కొట్లాటలు పెట్టె ప్రభుత్వాలు మనవి కానీ సాటి మనిషి ప్రాణాలు కాపాడే రక్తం కూడా ప్రభుత్వాల నిర్లక్ష్యం వలన వృథా అవుతుందనే వార్తా వింటే మాత్రం ఎవరికైనా రక్తం మరిగిపోతుంది.

blood banks negligence

ఒక చిన్న దెబ్బ నుంచి పెద్ద యాక్సిడెంట్ దాకా ఎవరినైనా కాపాడాలంటే వెంటనే కావాల్సింది రక్తం. మనిషి ప్రాణాలు కాపాడే రక్తం ఆపదలో సరైన సమయానికి అవసరం ఉన్నవాళ్ళకి అందాలనే అనేక బ్లడ్ బ్యాంకులు ఏర్పాటు చేశారు. కానీ ఆ బ్లడ్ బ్యాంకుల్లోని లోపాల వలన చాల రక్తం వృధా అవుతుండడం దారుణం. అవసరానికి సరైన బ్లడ్ గ్రూప్ దొరకక ప్రాణం కోల్పోయారనో అంజంట్ గా రక్తం కావాలనో వార్తలు రోజు చూస్తూనే ఉంటాం. అలాంటి వార్తలు వినకూడదనే లక్షల మంది రక్త దానాలూ చేస్తున్నారు. ఈ రక్తాన్ని బ్లడ్ బ్యాంకులో సరైన పద్ధతుల్లో స్టోర్ చేయాల్సి ఉంటుంది.. రక్తం, తెల్ల రక్త కణాలు, ప్లవమా, ప్లేట్లెట్స్ రూపాల్లో ఈ రక్తాన్ని వేరుపరచి భద్రపరుస్తారు.

అయితే ఏటా మన దేశం లో 12 మిలియన్ల యూనిట్ల రక్తం అవసరం కానీ మన దగ్గర 9 మిలియన్ల యూనిట్లే దొరుకుతుంది. అంటే దాదాపు 3 మిలియన్ యూనిట్ల రక్తం సమయానికి అందట్లేదన్నమాట. . దీంతో సమయానికి రక్తం అందక అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అందట్లేదంటే కొరత కాదు. నిజానికి బ్లడ్ బ్యాంకులకు ఆసుపత్రులకు మధ్య సమన్వయము లేకపోవడం వల్లే ప్లాస్మా, ప్లేట్లెట్స్ లాంటివి వృధా అయిపోతున్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తమిళనాడుల్లోనే మిలియన్ యూనిట్ల వృధా జరుగుతుందట. దాదాపు ఏటా 6లక్షల యూనిట్ల రక్తం వృధాగా పోతుంది. ఈ మొత్తం 53 వాటర్ ట్యాంకర్లతో సమానం అంటే ఎంత దారుణమో ఊహించండి. ఇంత రక్తం వేస్ట్ అయిపోతున్న దానికి సరిగా ఉపయోగించుకోకుండా మళ్ళీ కొత్తగా 79 బ్లడ్ బ్యాంకులన్ని ఏర్పాటు చేస్తున్నాం అని కేంద్రం ప్రకటించడం విడ్డూరం. ముందు ఆసుపత్రులు, బ్లడ్ బ్యాంకుల మధ్య సమన్వయము ఉండేలా చేసి ఈ వేస్టేజ్ ని అరికడితే లక్షల మంది ప్రాణాలు కాపాడినట్లవుతుంది. సమాచార హక్కు చట్టం కింద నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ సంస్థ కి చెందిన చేతన్ కొఠారి అనే యువకుడు ఈ వృధా బాగోతాన్ని బయటపెట్టాడు.

Comments

comments