Home / Entertainment / అమలా పాల్ గా అరగుండు.

అమలా పాల్ గా అరగుండు.

Author:

Brahmanandam character in Bengal Tiger

బ్రహ్మానందం తెలుగు ప్రేక్షకులను గత 27ఏళ్ళుగా తెలుగు ప్రేక్షకులను పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తున్న స్టార్ కమెడియన్ బ్రహ్మానందం. ఈ పాన పాత్రలకు తగ్గట్టుగానే ఈయన పేర్లు కూడా చాలా కామెడీగా ఉండేలా చూసుకుంటూ ఉంటారు దర్శకులు. స్వల్పకాలములోనే వివిధ భాషలలో 900 కి పైగా సినిమాలలోనటించి, ప్రపంచములోనే అరుదయిన రికార్డు సృష్టించాడు. ఈ విషయం గిన్నీస్ ప్రపంచ రికార్డులు(2008వ సంవత్సరం)వారు గుర్తించారు. ఇప్పటికి ఈయన తెలుగు సినిమా పరిశ్రమలో చాలా ఎక్కువ సినిమాలలో నటిస్తూవున్న హాస్య చక్రవర్తి. అరగుండుగా, ఖాన్ దాదాగా, కత్తి రాందాసుగా, శంకర్‌దాదా ఆర్.ఎమ్.పి.గా… వైవిద్యమైన పాత్రల పేర్లతో పేరుగాంచిన నటుడు.అదే బాటలోనే డైరెక్టర్ సంపత్ నంది కూడా తన తదుపరి సినిమా ‘బెంగాల్ టైగర్’లో బ్రహ్మానందం కోసం ఓ క్రేజీ పేరు పెట్టారు. అదే అమలా పాల్. ఇప్పటి వరకూ రకరకాల క్రేజీ పేర్లు పెట్టిన బ్రహ్మానందంకి సంపత్ నంది మొదటిసారి ఓ లేడీ స్టార్ పేరు పెట్టారు. బ్రహ్మానందంని ఈ పేరులో చూపించగానే ఎంతగా నవ్వు వస్తుందో అదే రేంజ్ లో తన పాత్ర కూడా నవ్విస్తుందని సంపత్ నంది అంటున్నారు.

అల్లాగే బెంగాల్ టైగర్లో రవితేజ – బ్రహ్మానందం కాంబినేషన్ లో వచ్చే సీన్స్ కూడా ఆడియన్స్ ని బాగా నవ్విస్తాయని సమాచారం. రవితేజ కిక్ 2 తర్వాత ఫుల్ లెంగ్త్ మాస్ పాత్రలో నటించిన ఈ సినిమాలో అందాల భామలు తమన్నా, రాశీఖన్నాలు హీరోయిన్స్ గా నటించారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున్ రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది. రాధా మోహన్ నిర్మించిన ఈ సినిమాకి భీమ్స్ మ్యూజిక్ అందించాడు.

(Visited 32 times, 10 visits today)