తెలుగు వారి గొప్పతనాన్ని తెలిపే విధంగా వీడియో తీసిన బ్రిటిష్ ఎయిర్ వేస్.

Author:

తెలుగు వారు అంటేనే మర్యాదకు, అప్యాయతకు పెట్టింది పేరు, ఈ కాలంలో ఆధునిక పోకడల వాళ్ళ మన తెలుగు వారి మర్యాదలు మారిపోతున్నాయి. మన మర్యాదలను మనమే మరిచిపోతున్న సమయంలో బ్రిటిష్ ఎయిర్ వేస్ వారు ఒక మంచి వీడియోతో మన సంప్రదాయాలను, తెలుగింటి రుచులను మనకు గుర్తు చేసే ప్రయత్నం చేసారు.

బ్రిటిష్ ఎయిర్ వేస్ వారి ఎయిర్ హోస్టెస్ కి ఒక తెలుగుంటి బామ్మకి మధ్య జరిగిన ఒక నిజ జీవిత సంఘటన ఆధారంగా ఈ వీడియోని రూపొందించారు,ఈ వీడియో లో తెలుగింటి ఆప్యాయతలను, సంప్రదాయాలను చాలా అందంగా తీసారు. ఇప్పుడు ఈ వీడియో నెట్ లో వైరల్ అవుతుంది.

(Visited 2,418 times, 35 visits today)