EDITION English తెలుగు
Video: సినిమాలకు ఇక సెలవు : పవన్ కల్యాణ్.   ఇక వాట్సాప్ లో డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు.   హైదరాబాద్ నగరం అసలు పేరు ‘ చిచులం ’, ఇదే నిజమైన పేరు, ఈ విషయం చాలామందికి తెలియదని చారిత్రక పరిశోధకుడు పాండులింగారెడ్డి తెలిపారు.   స్కూల్ కి రావట్లేదని అడిగినందుకు.. ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన స్టూడెంట్.   షాకింగ్ న్యూస్: మూతపడిన ట్రంప్ ప్రభుత్వం, సంక్షోభంలో అమెరికా...!   Video: మెట్రో నుంచి రోడ్ మీద వెళ్తున్న కారులో దిగబడిన రాడ్.   క్యాన్సర్ తో పోరాడుతున్న చిన్నారి.. సాయం అందించాలనుకునే వారు అకౌంట్ నం. 80808080101026419 లో డబ్బులు వేయండి.   డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ప్రదీప్ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..!   Video:స్కూల్ కి పది నిముషాలు లేట్ గా వచ్చాడని.. బాతులా నడిపించి..బలి తీసుకున్నారు.   పెద్ద పెద్ద క్రేన్లు ఆ హనుమాన్ విగ్రహాన్ని ఇంచుకూడా కదలించలేక పోయాయి.
Home / Entertainment / త్వరలో బ్రూస్లీ కామెడీ ట్రైలర్

త్వరలో బ్రూస్లీ కామెడీ ట్రైలర్

Author:

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు శ్రీనువైట్లల క్రేజీ కాంబినేషన్‌లో భారీ ఎత్తున నిర్మించ బడుతున్న సినిమా బ్రూస్లీ త్వరలో రాబోతోందన్న విషయం తెలిసిందే. దర్శకుడు శ్రీనువైట్ల మార్క్ పంచ్ కామెడీతో పాటు, రామ్ చరణ్ స్టైల్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తోన్న ఈ సినిమా అందరినీ మెప్పిస్తుందని సినిమా యూనిట్ చెబుతోంది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి అరవయ్యో పుట్టినరోజు సందర్భంగా విడుదలైన బ్రూస్లీ యాక్షన్ టీజర్, పవర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఫ్యామిలీ సెంటిమెంట్ టీజర్ సినిమాపై విపరీతమైన ఆసక్తిని పెంచేశాయి. ప్రేక్షకులలో మరింత ఆసక్తిని పెంచాయ్. ఈ టీజర్లో కనిపించిన రాం చరణ్ చేతి మీద ఉన్న బ్రూస్లీ పచ్చబొట్టు. యూత్ ని విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పటికే కొందరు ఆ టాటూ టూవీలర్లపై వేయించుకుంటున్నారు. కాస్త బాడీ ఉన్న వాళ్ళైతే ఏకంగా అలాంటి పచ్చబొట్లకే రేడీ ఐపోతున్నారట. ఐతే కేవలం బ్రూస్లీ వే కాదు వేరే తారలవి కూడా టాట్టూలు గా వేయించుకోవటానికి ఎగబడుతున్నారట.

ఇక శ్రీనువైట్ల సినిమాలంటేనే సాధారణంగా యాక్షన్, ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తో పాటు మేజర్ అట్రాక్షన్‌గా నిలిచేది కామెడీ. .ప్రతి కథలోనూ ఆయన ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేదీ, ఎక్కువగా దృష్టి పెట్టేదీ కామెడీ పైనే.అందులోనూ శ్రీను వైట్ల, కోనా వెంకట్ల కాంబినేషన్ ఎలా ఉంటుందో తెలుగు సినిమా ప్రేక్షకులకి చెప్పల్సిన అవసరమే లేదు. ఈ నేపథ్యంలోనే ‘బ్రూస్‌లీ’ లో కామెడీ ఎలా ఉండనుందనే విషయంపై అభిమానులు ఇప్పట్నుంచే ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.ఇప్పుడు ఇంకాస్త ఉత్తేజం పెంచేందుకు రెడీ ఐపోతున్నారు దర్శక నిర్మాతలు. త్వరలోనే బ్రూస్లీ కామెడీ ట్రైలర్ ని విడుదల చేయబోతున్నారు.ఈ సినిమా రచయిత కోన వెంకట్ ఇదే విషయంపై మాట్లాడుతూ “ఇప్పటివరకూ యాక్షన్, ఫ్యామిలీ టీజర్స్‌తో సినిమా ఈ రెండు అంశాల్లో ఎలా ఉండనుందనేది తెలియజేశాం. త్వరలోనే ఓ కామెడీ టీజర్‌తో మిమ్మల్ని మెప్పించేందుకు వచ్చేస్తున్నాం” అని తెలిపారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పనిలో తలమునకలు గా ఉన్నాడట. తను ఇప్పటి వరకూ చేసిన దానిలోనే బెస్ట్ మ్యూజిక్ ఇస్తానని ప్రామిస్ కూడా చేసాడట ఈ ముద్దుగా కనిపించే క్యూట్ మ్యూజిక్ డైరెక్టర్. డీవీవీ దానయ్య నిర్మాణంలో భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించారు.

Comments

comments