Home / Inspiring Stories / జియో ని మించిన ఆఫర్ ని ప్రకటించిన బిఎస్ఎన్ఎల్…!

జియో ని మించిన ఆఫర్ ని ప్రకటించిన బిఎస్ఎన్ఎల్…!

Author:

జియో ఉచిత ఆఫర్లు మార్చి 31 న ముగుస్తుండడంతో దానిని ధీటుగా ఎదుర్కునేందుకు మిగతా నెట్ వర్కులు సిద్దమవుతున్నాయి. ఏప్రిల్ 1 నుండు జియో యూజర్లు కూడా ఇంటర్నెట్ కి డబ్బులు కట్టాల్సిరావడంతో ఇన్నాళ్ళు జియో వైపు వెళ్ళిన తమ కస్టమర్లు మరల తమ వైపునకు తిప్పుకునేందుకు జియోకు తగ్గ రీతిలో అఫర్లు ప్రకటిస్తున్నాయి ఇతర నెట్ వర్కులు. తాజాగా ఆ జాబితాలో భారతదేశ ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ కూడా చేరింది, తాము కూడా జియో కి ఏమాత్రం తగ్గకుండా రోజు 2జీబీ డేటా ఇస్తామని ప్రకటించింది. ఆ అఫర్ గురించి క్రింద చదవండి.

bsnl offer to counter jio

బిఎస్ఎన్ఎల్ ప్రకటించిన ఆఫర్ ప్రకారం STV 339 రూపాయలతో రీచార్జీ చేయించుకుంటే రోజు కి 2జీబీ 3G డేటా అందించనున్నారు అంతే కాకుండా ఆ ప్యాకేజీలో అన్ని నేషనల్ బిఎస్ఎన్ఎల్ నంబర్లకి ఉచితంగా కాల్ చేసుకోవచ్చు, ఇతర నెట్ వర్కులకు ఐతే రోజు 25 నిముషాలు ఉచితంగా కాల్ చేసుకోవచ్చు ఆ తరువాత నిముషానికి 25 పైసలు వసూలు చేస్తారు. తమ ఉత్తమ కస్టమర్లు తమను వీడిపోవద్దనే ఇలాంటి అఫర్లు ప్రకటించామని తెలిపారు బిఎస్ఎన్ఎల్ అధికారులు. అదే సమయంలో 303 తో రీచార్జీ చేసుకుంటే రోజుకు 1జీబీ 4G డేటా ఇస్తుంది జియో.

(Visited 2,760 times, 9 visits today)