EDITION English తెలుగు
'తిత్లీ' బాధితులకు సంపూర్ణేష్ బాబు, విజయ్ దేవరకొండ, తారక్‌, కల్యాణ్‌రామ్‌ సాయం   మనుషుల్లో మానవత్వం గురించి అబ్దుల్ కలాం చివరిసారి చెప్పిన కథ.... తప్పక చదవండి.   కొన్ని యూట్యూబ్‌ చానెళ్లపై గీతామాధురి సీరియస్‌ వార్నింగ్‌   ఇద్దరికీ యావజ్జీవ: భర్తను స్కెచ్ వేసి చంపిన భార్య, ప్రియుడు   జొహ్యానెస్బర్గ్ లో ఘనంగా బతుకమ్మ సంబరలు ధూమ్ ధామ్   గర్ల్‌ఫ్రెండ్‌ కోసం దొంగగా మారిన గూగుల్‌ ఉద్యోగి కటకటాల పాలయ్యాడు   ఈవీఎంలు తరలిస్తున్న భద్రతాసిబ్బందికి చెందిన ఏకే47 తుపాకి మిస్సింగ్‌   కూలీ ప‌నిచేసే మ‌హిళ‌….పేద‌ల‌కోసం ఏకంగా ఆసుప‌త్రినే నిర్మించింది.!   56శాతం భారతీయులు లంచం ఇచ్చారు..గత ఏడాదితో పోలిస్తే 11 శాతం ఎక్కువ   సీఎం రమేశ్‌పై ఐటీ దాడులు కడప, హైదరాబాద్‌లోని ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు

ఫోన్ పోయిందా..? ఎక్కడ ఉందో నిమిషాల్లో కనిపెట్టేయొచ్చు..!

Author:

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ లని కొనేవాళ్ళతో పాటు దొంగిలించే వాళ్ళు కూడా బాగా పెరిగిపోయారు, ఎంతో ఇష్టపడి కొనుక్కున్న ఫోన్ ని ఎవరైనా దొంగిలిస్తే ఏం చేస్తాం IMEI నెంబర్ తో పోలీసులకి కంప్లైంట్ ఇచ్చి ఆ ఫోన్ ఎక్కడుందో కనుక్కుంటాం, కానీ IMEI మార్చేస్తే ఏం చేయలేము.. ఆ ఫోన్ లో ఉన్న కాంటాక్ట్స్, పర్సనల్ డేటా అంత కోల్పోతాం, ఇంకా ఆర్థిక వివరాలు కూడా ఉంటే..ఆ రకంగా కూడా నష్టపోయే ప్రమాదం ఉంది, ఇక నుండి ఈ సమస్యలకు చెక్ పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురానుంది.

మీ మొబైల్ ఫోన్ ని ఎవరైనా దొంగిలించిన., ఎక్కడైనా పోగొట్టుకున్న .. ఏం చేయాలంటూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, అందులో ఉన్న సిమ్‌కార్డును తీసేసి.. కొత్త సిమ్ కార్డ్ వేసినా, IMEI నెంబబర్‌ మార్చినా.. ఆ ఫోన్‌ పని చేయకుండా బ్లాక్‌ చేసేలా ప్రభుత్వమే మొబైల్‌ ఫోన్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకురానుంది.

మొబైల్ ట్రాకింగ్ సిస్టమ్ Mobile Tracking System

సెంట్రల్‌ ఎక్విప్మెంట్స్‌ ఐడెంటిఫై రిజిస్టర్‌ (CEIR) పేరుతో టెలికం శాఖ (DOT) ఆధ్వర్యంలో ఈ వ్యవస్థను ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రూ.15 కోట్లు కేటాయించింది కేంద్రం. మొబైల్‌ ఫోన్‌ చోరీ, పోవటం ద్వారా వినియోగదారుడికి ఆర్థికంగా నష్టం కలిగించడం కాకుండా.. వ్యక్తిగత జీవితానికి, దేశ భద్రతకు కూడా ప్రమాదకరం అని భావించిన కేంద్ర ప్రభుత్వం మొబైల్ ఫోన్ ల చోరీ లని నిరోధించడం, అరికట్టడం పై నిర్ణయం తీసుకుంది, అన్ని మొబైల్‌ ఆపరేటర్ల IMEI నెంబర్ల డేటాని CEIR కి లింక్ చేయనున్నారు. IMEI నెంబర్‌ టాంపరింగ్‌ చేస్తే కఠిన శిక్ష పడేలా చట్టాన్ని రూపొందించనున్నారు.ఈ సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తే మన మొబైల్ ఫోన్ చోరీ అయిన, లేదా ఎక్కడైనా పోయిన.. ఎక్కడ ఉందో నిమిషాల్లో కనిపెట్టవచ్చు. ఒకవేళ ఫోన్ లొకేషన్ ని మనం కనిపెట్టలేక పోతే ఆ ఫోన్ పనిచేయకుండా బ్లాక్ కూడా చేయవచ్చు.

(Visited 910 times, 967 visits today)