మెగా హీరోలు ఏపి ప్రభుత్వం నుండి నటన నేర్చుకోవాలంట..!?

Author:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల అంశం ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్ద చర్చనీయాంశంగా మారిపోయింది. అవార్డులను ప్రకటించడంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సరిగా వ్యవహరించలేదని విమర్శలు వస్తున్నాయి. జనాలు కూడా చాలా వరకు ఈ అవార్డులపై కామెంట్ చేస్తున్నారు. అవార్డులను ఎవరికీ వారే నిర్ణయించుకుంటే ఇక దానికి విలువ ఏంటని సోషల్ మీడియాలో కూడా నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఈ నంది అవార్డుల విషయంపై మెగా క్యాంపుకి అతి దగ్గరగా ఉండే నిర్మాత బన్నీ వాసు అభ్యంతరం వ్యక్తం చేసాడు, ఈ నంది అవార్డులను ఉద్దేశించి మెగా హీరోలందరూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుండి నటన నైపుణ్యాలను నేర్చుకొని ఏపీ నంది అవార్డులను గెలుపొందాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు, వెంటనే ఈ విషయం వైరల్ అయిపొయింది, కొద్దీసేపటికి ఆ పోస్ట్ సోషల్ మీడియా నుండి మాయం అయ్యింది.

Bunny-Vas-Tweet-On-TDP-Nandi-Awards

అయితే ఈ విషయంపై బన్నీవాసు సన్నిహితులు మీడియాకి బన్నీ వాసు అసలు అలా ట్వీట్ గాని, ఫేస్ బుక్ పోస్ట్ గాని చేయలేదని ఎవరో ఫేక్ అకౌంట్ తో అలా చేసారని తెలిపారు, మరికొంతమంది ఏమో ఆ అకౌంట్ బన్నీ వాసుదే మెగాహీరోలకి నంది అవార్డు రాకపోవటంతో అలా పోస్ట్ చేసాడని, అది వైరల్ అవ్వడంతో వెంటనే డిలీట్ చేసాడని సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు, ఏది ఏమైనా ఈసారి ప్రకటించిన నంది అవార్డులు పై ఎక్కువగా నెగిటివ్ టాక్ యే వినిపిస్తుంది.

(Visited 133 times, 144 visits today)