ఊబర్ ఊబిలో డ్రైవర్లు.

Author:

Uber Cabs Hyderabad

రోజుకు రూ.5,000 ఆదాయం, నెలకు ఇంచుమించు 1,25,000 రూపాయలు సంపాదించొచ్చు, ఇందుకోసం మీరు చేయాల్సింది కేవలం ఒక్క కారు కొనుక్కుంటే చాలు’ ఇప్పటికే మీ దగ్గర కారుంటే చాలూ ఈ మాటలు విన్న డ్రైవర్ ఎవరైనా ఆ కంపెనీతో ఆనందం గా పని చేయటానికి  ఒప్పుకుంటాడు. అంతర్జాతీయ ట్యాక్సీ అగ్రిగేటర్‌ ఉబేర్‌ పైవిధంగా చేసిన ప్రకటన తో ఎంతోమందు అప్పులు చేసి మరీ వాహనాలు కొన్నారు…

కానీ ఇప్పుడు సీన్ తిరగ బడింది ఊబెర్ ఇప్పుడు 20,000 మంది డ్రైవర్లను నడి రోడ్డున పడేసింది. కార్ల కొనుగోళ్లకు అప్పులు తెచ్చుకోవడంతో వడ్డీ, అసలు చెల్లించలేక వారు తీవ్ర ఒత్తిడికి గురి అవుతున్నారు. రెండు రోజుల క్రితం ఓ డ్రైవర్‌ ఆత్మహత్య చేసుకున్నాడంటే పరిస్థితి తీవ్రత స్పష్టమవుతుంది. నెలకు రూ. లక్షకు దగ్గరగా ఆదాయం, స్మార్ట్‌ఫోన్‌, ఇంటర్నెట్‌ బిల్లు, ఫోన్‌ బిల్లులు ఉచితంగా అందిస్తామని ఆశలు చూపడంతో పెద్ద మొత్తంలో డ్రైవర్లు ఊబర్ తో చేరి పోయారు. ఇలా ఊబెర్ తో కైసే కార్ల సంఖ్య విపరీతం గా పెరుగుతూ రావటం తో ఉబేర్‌ ముందు చెప్పిన సౌకర్యాలను మరింతగా తగ్గిస్తూ పోయింది.ఉబర్‌ విధానాలపై గత ఆరేడు మాసాల నుంచి ఔత్సాహిక డ్రైవర్లు తీవ్ర నిరసనతో ఉన్నారు. తాజాగా గత వారం నుంచి నగరంలో 90 శాతం ఉబర్‌ వాహనాలు నిలిచిపోయాయి.హైటెక్స్‌లోని కార్యాలయాన్ని ఇంకా తెరువలేదు. ఆఫీసు ముందు 500 మంది డ్రైవర్లు ధర్నా చేశారు.

ఐతే ఈ సమస్య కేవలం హైదరా బాద్ లోనో భారత దేశం లోనో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఊబర్ శాఖల త్తో కలిసి పని చేసే ప్రతీ చోటా ఇదే సమస్య. ఉబర్‌ సేవలపై అన్నీ దేశాల్లోనూ ఎదో తరహా వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. మలేషియా కౌలాలంపుర్‌లో 250 మంది టాక్సీ డ్రైవర్లు ఉబర్‌ కు వ్యతిరేకంగా తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కెనాడాలోని టొరాంటాలోనూ 500 క్యాబ్‌ డ్రైవర్లు ఉబర్‌పై తిరుగుబాటును ప్రకటించారు. కాలిఫోర్నియాలోని సాన్‌జోస్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు వద్ద అక్కడి డ్రైవర్లు ఉబర్‌ విధానాలపై నియంత్రణ పద్దతిని ప్రవేశపెట్టాలని 300 పైగా డ్రైవర్లు ర్యాలీ చేశారు. ఉబర్‌ కంటే ప్రయాణికుల పట్ల డ్రైవర్లు అత్యంత విశ్వాసంతో పని చేస్తారని, దీన్ని ఆ సంస్థ గుర్తించడం లేదని వారు వాపోయారు. ఈ నెల 12న లండన్‌లోనూ అక్కడి డ్రైవర్లు ఊబర్ విధానాలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు.

Source: Nava Telangana.

(Visited 230 times, 45 visits today)