Home / Inspiring Stories / కాల్ మనీ వ్యవహారం లో ముఖ్యమంత్రి మోపుతాం అన్న “ఉక్కుపాదం” ఎవరిమీద?

కాల్ మనీ వ్యవహారం లో ముఖ్యమంత్రి మోపుతాం అన్న “ఉక్కుపాదం” ఎవరిమీద?

Author:

Chandrababu1

కాల్ మనీ వ్యవహారంలో ఉక్కుపాదం మోపుతాం అన్న ముఖ్యమంత్రి గారి ఉక్కుపాదం ఎవరి మీదో అర్థమైపోయింది ఇరవై నాలుగు గంటల్లోనే పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ లీవుపై వెళ్ళారు. కాదు వెళ్ళే విధంగా ఆయన మీద ఒత్తిడి తెచ్చారు అన్నది నిజం అనేదే ఎక్కువమంది అభిప్రాయం. ఐతే సవాంగ్ ని తప్పించటం పై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తాయ్. ‘కాల్ మనీ వ్యవహారంలో మాపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవు. అని చెప్పిన ఇరవై నాలుగు గంటల్లోనే లీవు పై వెళ్ళాలని లీవ్ మీద వెళ్ళే నిర్ణయం తీసుకోవటం అది రెండు నెలల క్రితందే అని చెప్పిన మరో ఇరవై నాలుగ్గంటలలోనే విదుల్లో హాజరౌతానంటూ రావటం పలు అనుమానాలకు తావిస్తోంది. కాల్ మనీ వ్యవహారంపై జనసేన పార్టీ ధర్నా చేపట్టింది! కాళేశ్వరరావు మార్కెట్ వద్ద ఆ పార్టీ జెండాలతో కొందరు నిరసన వ్యక్తం చేశారు. కాల్ మనీ వ్యవహారంలో మహిళలను వేధిస్తున్న వ్యాపారులను ఉరితీయాలని డిమాండ్ చేశారు. కాల్ మనీ నిర్వాహకులను ఎన్‌కౌంటర్ చేయాలని ప్లకార్డులు ప్రదర్శించారు. పత్రికలూ,ప్రజాసంఘాలే కాదు సామాన్య పౌరుడి ఆయుధమైన సోషల్ మీడియా కూడా ప్రభుత్వాన్ని ఒక్క సారి ఉలిక్కిపడేలా చేసింది.

ఈ లోపు ఏమైందో ఏమో గానీ కాల్ మనీ కేసు తీవ్రత దృష్ట్యా సెలవు రద్దు చేయాలని డిజిపి జేవీ రాముడిని కోరానని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ ఈ ఉదయం కోరారు. ఆయన ఈ నెల 17వ తేదీ నుంచి 24వ తేదీ వరకు వారం రోజుల పాటు కుటుంబ సభ్యులతో ఆస్ట్రేలియా వెళ్లేందుకు నెల రోజుల క్రితం సెలవు తీసుకున్నారు అని వచ్చిన వార్తలు వచ్చాయి.కానీ కాల్ మనీ ప్రకంపనల నేపథ్యంలో తన సెలవును రద్దు చేసుకుంటున్నట్లు ఈ రోజు ఉదయమే సవాంగ్ తెలిపారు. కేసు తీవ్రత దృష్ట్యా తాను సెలవుల పైన వెళ్లడం లేదని చెప్పారు. ఈ కేసు పూర్తయ్యాకనే తాను విదేశాలకు వెళ్తానని ఆయన అభిప్రాయపడ్డారు.ఐతే సవాంగ్ మళ్ళీ రావటం కేవలం ప్రజల నుంచి వస్తూన్న వ్యతిరేకతని తగ్గించటానికే తప్ప కేసు విషయంలో ఇప్పుడు సవాంగ్ చేతుల్లో ఏమీ ఉండబోదనీ ఇప్పటికే సాక్ష్యాలు ఎన్నో మాయమయ్యాయనీ సోషల్ మీడియాలో ఆరోపణలు వస్తున్నాయి.

ఈ నేపథ్యం లోనే రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘కాల్ మనీ’ కేసులో దోషులను తప్పించేందుకు పలువురు ప్రముఖులు రంగంలోకి దిగి చాప కింద నీరులా పావులు కదుపుతున్నారంటూ.ప్రముఖ దిన పత్రికలో వచ్చిన కథనం ఈ ఆరోపణలకు ఊతమిస్తోంది. ఈ కేసులో కీలక వ్యక్తుల్లో ఒకరైన విద్యుత్ శాఖ డీఈ సత్యానందంను తప్పించేందుకు పెద్ద ఎత్తున లాబీయింగ్ మొదలైంది. సత్యానందాన్ని తప్పించేందుకు ఇప్పటికే ఓ ఎన్నారై ప్రముఖుడు రంగంలోకి దిగినట్లు సమాచారం. సదరు ఎన్నారై తానాలో కీలక పదవిలో ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో కూడా ఆ ఎన్నారైకి మంచి సన్నిహిత సంబంధాలున్నాయని చెబుతున్నారంటూ ఆపత్రిక కొన్ని నిజాలను వెల్లడించింది.

విజయవాడలో దాదాపు రూ.600 కోట్ల మేర కాల్ మనీ దందా సాగుతోందని తెలుస్తోంది. ఓ ఫిర్యాదు నేపథ్యంలో.. పోలీసుల చర్యలతో కాల్ మనీ దందా వెలుగు చూసింది. రూ.ఒక లక్ష అప్పు తీసుకున్న వారు రూ.తొమ్మిది లక్షల వరకు చెల్లిస్తున్న ఘటనలు ఉన్నాయి. సోదాలు నిర్వహించే ఆఫీసుల పక్కనే ఉన్న ఉన్న మురికి కాలువలూ,చెత్తకుప్పలవద్ద పెద్ద ఎత్తున కండోం లూ, బ్లూఫిలిం సీడీలు కనిపించటం మరింత ప్రజల్లో ఇప్పటికే ఉన్న ఆగ్రహాన్ని రెట్టింపుచేస్తోంది. తాజాగా, ఓ మహిళ తన ఆవేదనను వెళ్లగక్కారు. కాల్ మనీ వ్యవహారంలో చేకూరు శ్రీను, సూరపనేని శ్రీధర్ అనే ఇద్దరు తన అవసరం నిమిత్తం తనకు రూ.24 లక్షలు అప్పుగా ఇచ్చి వడ్డీ పేరుతో 41 లక్షలు తీసుకోవటమే కాక తన మామిడి, జామ తోటల పత్రాలనుకూడా తీసుకున్నారనీ,. మామిడి తోటను చేకూరి శ్రీను తన మరదలి పేరిట రాయించుకున్నారని చెప్పారు. తాను ఉంటున్న చోటుకు వచ్చి తనను గెస్ట్ హౌస్‌కు రావాలని హెచ్చరించారని, రాకుంటే ఇబ్బంది పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై పోలీసులను ఆశ్రయించానని, ఈ విషయమై ఓ ఎమ్మెల్యేను కూడా కలిసి విన్నవించానని చెప్పారు. వారి వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం చేసి ఆసుపత్రిలో ఉన్నప్పుడు, ఆసుపత్రికి వచ్చి కూడా వేధించారన్నారు. మేం చెప్పినట్లు గెస్ట్ హౌస్‌కు వచ్చి కోరిక తీర్చితే నావి నాకు ఇస్తామని చెప్పారని, లేదంటే బ్రోతల్ కేసు కింద కేసు పెడతామని బెదిరించారన్నారు. ఇప్పుడు కాల్ మనీ వ్యవహారం బయటకు రావడంతో ధైర్యంగా వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నానని చెప్పారు..

(Visited 128 times, 41 visits today)