Home / Latest Alajadi / 15 రోజుల్లోనే పీఎఫ్ సొమ్ము మీ ఖాతాలోకి వచ్చేస్తుంది..!

15 రోజుల్లోనే పీఎఫ్ సొమ్ము మీ ఖాతాలోకి వచ్చేస్తుంది..!

Author:

ఉద్యోగంలో చేరిన అప్పటి నుండి నెల, నెల వచ్చే జీతం నుండి కొంత అమౌంట్ ప్రోవిడెంట్ ఫండ్ (PF) రూపంలో ప్రతి ఉద్యోగి జమచేస్తారు, రిటైర్మెంట్ సమయానికి పీఎఫ్ ఖాతాలో సొమ్ము భారీ మొత్తానికి చేరుకుంటుంది, రిటైర్మెంట్ తరువాత ఆ సొమ్ముని విత్ డ్రా చేసుకొని భవిష్యత్ అవసరాలకు వాడుకుంటారు, ఈ మధ్య పీఎఫ్ ఖాతాలో ఉన్న డబ్బు అత్యవసర సమయంలో వాడుకునేల కేంద్ర ప్రభుత్వం ఆవకాశం కల్పించింది, ఇంతకుముందు అత్యవసర సమయంలో పీఎఫ్ సొమ్ము తీసుకోవాలంటే ఉద్యోగులు చాలా సమయం వేచి చూడాల్సి వచ్చేది, ఇప్పుడు అలాంటి అవసరం లేకుండా దరఖాస్తు చేసుకున్న పక్షం రోజుల్లోనే డబ్బు ఉద్యోగికి చేరేలా నిర్ణయించారు.

PF-Money

10 ఏళ్ల స‌ర్వీసు త‌ర్వాత మీ పీఎఫ్ డ‌బ్బులు నిర‌భ్యంత‌రంగా మీ అవ‌స‌రాల‌కు తీసుకోవ‌చ్చ‌ని కేంద్రం తెలిపింది. దీంతో 50 ల‌క్ష‌ల మంది కేంద్ర‌ ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ల‌బ్ధి చేకూర‌నుంది. ఇంత‌కుముందు 15 ఏళ్ల స‌ర్వీసు త‌ర్వాత మాత్రమే పీఎఫ్ డ‌బ్బును ఉప‌సంహ‌రించుకునేలా నిబంధ‌న ఉండేది, ఇప్పుడు 10 ఏళ్ళ సర్వీస్ తరువాత పీఎఫ్ డబ్బుని తీసుకునేలా నిబంధనల్ని సవరించారు, కొత్త నిబంధనల ప్రకారం ఎలాంటి అవసరానికి అయిన పీఎఫ్ డబ్బుని ఉపసంహరించుకోవచ్చు, ఆరోగ్యం తీవ్రంగా దెబ్బ‌తిన్న ఎమ‌ర్జెన్సీ ప‌రిస్థితుల్లో పీఎఫ్ డ‌బ్బు ఏడురోజుల్లోనే మీఖాతాలో చేరుతుంద‌ని కేంద్రం క్లియ‌ర్‌గా చెప్పింది.

ఇంతకుముందు ఇంకో సంవత్సరంలో రిటైర్ అయ్యే ఉద్యోగులు 90 శాతం పీఎఫ్ డబ్బుని ఉపసంహరించుకోవచ్చు, ఇప్పుడు మరో రెండు సంవత్సరాలలో రిటైర్ అయ్యే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఎలాంటి కారణం అడగకుండానే 90 శాతం నగదును తీసుకునే అవకాశం ఉంది, త్వరలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పీఎఫ్ డబ్బు విషయంలో కేంద్ర ప్రభుత్వం మాదిరిగానే నిబంధనల్ని సవరించే అవకాశాలు ఉన్నాయి.

(Visited 7,334 times, 29 visits today)