చీటింగ్ కేసులో రాజమౌళి.

Author:

Cheating-case-on-Director-Rajamouli

ఎస్.ఎస్.రాజమౌళికి చీటింగ్ కేసు విషయంలో బంజారాహిల్స్ పోలీసులు సమన్లు జారీ చేశారు.పోలీసులు చెప్పిన దాని ప్రకారం…. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 12 ఎమ్మెల్యే కాలనీ, లోటస్ పాండ్ అపార్ట్‌మెంట్స్‌ గ్రౌండ్‌ ఫ్లోర్‌లో రాజమౌళికి  జీ-1 ఫ్లాట్‌ ఉంది. దాన్ని 2011లో ఆయన అమ్మకానికి పెట్టగా నిర్మాత భువనేశ్వర్‌ మారం రూ.42 లక్షలకు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అడ్వాన్స్‌గా రూ.2.7 లక్షలు రాజమౌళికి చెల్లించారు. ఫ్లాట్‌ తనకు అమ్ముతానని మరొకరికి విక్రయించారంటూ దర్శకధీరుడిపై ఫిర్యాదు చేశారు. భువనేశ్వర్ ఫిర్యాదు మేరకు కోర్టు కేసు నమోదు చేసింది. అయితే ఈ కేసు విచారణకు రాజమౌళి హాజరు కాకపోవడంతో పోలీసులు సమన్లు జారీ చేశారు.

(Visited 105 times, 9 visits today)