Home / Videos / హెల్మెట్ పెట్టుకోలేదని రోడ్డుమీదే చితక బాదారు

హెల్మెట్ పెట్టుకోలేదని రోడ్డుమీదే చితక బాదారు

Author:

చత్తీస్ ఘడ్ లోని రాయ్ పూర్ పోలీసులు మరోసారి తమ దురుసు తనాన్ని బయట పెట్టుకున్నారు. కేవలం హెల్మెట్ పెట్టుకోలేదన్న కారణంతో ఒక సామాన్యున్ని పట్టుకొని నడీ రోడ్డు మీద చితక బాదారు. హెల్మెట్ చెకింగ్ లో భాగంగా రోడ్డుమీద వెల్తున్న వ్యక్తిని ఆపి హెల్మెట్ గురించి అవగాహన కల్పించాల్సింది పోయి తిట్లతో దురుసుగ ప్రవర్తించటంతో అతను ఎదురు తిరిగి, తిట్టవద్దు అనటంతో….

          మాకే ఎదురు సమాధానం చెప్తావా? అంటూ అందరూ చూస్తూండగానే అతన్ని లాఠీలతో చితక బాదారు. అయితే ఈ తతంగాన్నంతా వీడియో తీసి నెట్లో పెట్టాడు ఇంకో వాహన దారుడు. ఇక రాయ్ పూర్ పోలీసుల దౌర్జన్యం మీద దుమ్మెత్తిపోస్తూ వచ్చే విమర్షలకు చత్తీస్ ఘడ్ పోలీస్ బాస్ లు ఉలిక్కి పడ్డారు. వెంటనే ఆ దుశ్చర్యకు పాల్పడ్డ పోలీసుల మీద చర్య తీసుకుంటాం అంటూ ఒక ప్రకటన విడుదల చేసి ఊరుకున్నారు. హెల్మెట్ పెట్టుకోవటం మీద అవగాహన కలిగించటం అంటే ఫ్రెండ్లీగా చెప్పాలి గానీ ఇలా దురుసుగా తిట్లతోనూ, దెబ్బలతోనూ చెప్పటం కాదని మన పోలీసులకు ఎప్పటికి తెలిసి వస్తుందో ఏమో…

(Visited 1,010 times, 8 visits today)