Home / Reviews / చీకటి రాజ్యం సినిమా రివ్యూ & రేటింగ్.

చీకటి రాజ్యం సినిమా రివ్యూ & రేటింగ్.

Chikati rajyam movie review andreting

Alajadi Rating

2.75

[easy-social-share buttons="facebook,twitter" counters=0 total_counter_pos="left" hide_names="no" template="flat-retina" facebook_text="Share" twitter_text="Tweet"]

Cast: కమల్ హాసన్ - త్రిష - ప్రకాష్ రాజ్ - కిషోర్ - సంపత్ రాజ్ - యుగి సేతు - మధు శాలిని - ఆశా శరత్ తదితరులు.

Directed by: రాజేష్ ఎం.సెల్వ.

Produced by: కమల్ హాసన్ - చంద్ర హాసన్.

Banner: రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ & శ్రీ గోకులం మూవీస్.

Music Composed by: జిబ్రాన్

కమల్ హాసన్ సినిమాలు ఆడొచ్చు ఆడకపోవచ్చు. కానీ ప్రేక్షకులకు ఏదో కొత్తదనాన్ని అందించాలనే ఆయన తపన మాత్రం ప్రతి సినిమాలో కనిపిస్తుంది. విశ్వరూపం ఉత్తమ విలన్ సినిమాల్లో ఆ కొత్తదనం ఆయన అభిమానుల్ని బాగానే ఆకట్టుకుంది. ఇప్పుడాయన ఇంకో కొత్త సినిమాతో ముందుకొచ్చారు. అదే లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘చీకటి రాజ్యం’. ఫ్రెంచ్ మూవీ ‘స్లీప్ లెస్ నైట్’ అనే సినిమాకి అధికారిక రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో త్రిష, ప్రకాష్ రాజ్, మధు శాలిని, సంపత్ లు ముఖ్య పాత్రలు పోషించారు. డ్రగ్ మాఫియా నేపధ్యంలో సాగే ఈ సరికొత్త తరహా యాక్షన్ థ్రిల్లర్ కి రాజేష్ ఎం సెల్వ డైరెక్టర్. తెలుగు ప్రేక్షకులకి బాగా తక్కువ పరిచయం ఉన్న ఈ జానర్ తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది అనేది ఇప్పుడు చూద్దాం..

కథ:

దివాకర్ (కమల్ హాసన్) నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోలో పని చేసే అధికారి. తన డిపార్ట్ మెంట్ లోనే పని చేసే మణి (యుగి సేతు)తో కలిసి ఓ గ్యాంగ్ నుంచి దౌర్జన్యంగా కొకైన్ ఎత్తుకెళ్తాడు.. ఈ క్రమంలో కమల్ బ్యాచ్ కొకెయిన్ బ్యాచ్ లో ఒకడిని చంపేస్తారు.దాంతో ఆ ఇన్సిడెంట్ పై ఇన్వెస్టిగేట్ చేయడానికి నార్కోటిక్ ఆఫీసర్స్ అయిన మోహన్(కిషోర్), మల్లిక(త్రిష) రంగంలోకి దిగుతారు. కట్ చేస్తే ఆ కొకెయిన్ పాకెట్స్ మాదాపూర్ లో ఇన్సోమియా అనే నైట్ క్లబ్ నడిపే విట్టల్ రావు(ప్రకాష్ రాజ్)కి సంబంధించినవి. ఐతే ఆ కొకైన్ యజమాని అయిన విఠల్ రావు (ప్రకాష్ రాజ్).. దివాకర్ కొడుకు వాసు (అమన్ అబ్దుల్లా)ను కిడ్నాప్ చేసి.. తన సరకు తెచ్చి ఇచ్చి కొడుకును తీసుకెళ్లమంటాడు. దీంతో ఆ సరకు తీసుకుని విఠల్ రావు నడిపే నైట్ క్లబ్బుకి వెళ్తాడు దివాకర్. కొడుకును విడుదల చేసుకోవడానికి బయలుదేరిన దివాకర్ ఫేస్ చేసిన ప్రాబ్లెమ్స్ ఏమిటి? మల్లిక అండ్ మోహన్ వలన దివాకర్ క్రియేట్ అయిన ఇబ్బందులేమిటి? ఫైనల్ గా దివాకర్ తన కొడుకును కాపాడుకున్నాడా లేదా? నేషనల్ వైడ్ గా ది బెస్ట్ నార్కోటిక్ ఆఫీసర్ అనిపించుకున్న దివాకర్ ఏ రీజన్ తో ఆ కొకెయిన్ దొంగతనం చేసాడు అన్నది? మీరు వెండితెరపై చూసి తెలుసుకోవాలసిన మిగతా కథ.

అలజడి విశ్లేషణ:

చీకటి రాజ్యం.. ‘స్లీప్ లెస్ నైట్’ అనే ఫ్రెంచ్ నవల ఆధారంగా తెరకెక్కిన సినిమా అని కమలే స్వయంగా వెల్లడించాడు. ఐతే ఆ కథలోంచి ఏం తీసుకున్నారు? ఏం మార్పులు చేశారో అన్న సంగతి తెలియదు కానీ.. ‘చీకటి రాజ్యం’ మనం ఈజీగా కనెక్టయ్యే థ్రిల్లరే. ఉత్కంఠతో ఊపేసేంత థ్రిల్ ఇందులో లేదు కానీ.. రెండు గంటల పాటు ఎంగేజ్ చేసే కథనానికైతే ఢోకా లేదు. చీకటి రాజ్యం ఒక్క రాత్రిలో ముగిసిపోయే కథ. సినిమా నిడివి 2 గంటల 8 నిమిషాలైతే ఇందులో 90 శాతం వరకు ఒకే నైట్ క్లబ్బులో సాగిపోతుంది.ఈ యాక్షన్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా లో ది బెస్ట్ అని చెప్పుకోవాల్సింది నటీనటుల ఎంపిక మరియు వారి నటన.. ప్రతి పాత్రకి వీళ్ళే పర్ఫెక్ట్ అనేలా నటీనటుల్ని ఎంపిక చేసారు. చీకటి రాజ్యం సినిమాకి మెయిన్ పిల్లర్ కమల్ హాసన్ అని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఒక నార్కోటిక్ పోలీస్ ఆఫీసర్ గా కమల్ హాసన్ పెర్ఫార్మన్స్ సింప్లీ సూపర్బ్. ఒకవైపు సీనియర్ పర్సన్ గా, కొడుకును రక్షించుకోవాలనే ఫాదర్ గా, పోలీస్ గా అతను చూపిన హావ భావాలు ఆడియన్స్ ని కట్టి పడేస్తాయి త్రిష ఒక టఫ్ పోలీస్ గర్ల్ గా కమల్ కి మంచి పోటీని ఇచ్చింది. ముఖ్యంగా వీరిద్దరి మధ్యా వచ్చే యాక్షన్ సీన్స్ మాత్రం ఆడియన్స్ ని సీట్ ఎడ్జ్ కి తీసుకొస్తాయి. త్రిషకి సపోర్ట్ గా చేసిన కిషోర్ కూడా పోలీస్ గా నెగటివ్ షేడ్స్ ని చాలా బాగా పలికించాడు.నైట్ క్లబ్బులోకి ఒక్కో పాత్ర ప్రవేశించాక ఒకరి వెంట ఒకరు పడుతూ ఆడే దొంగా పోలీస్ ఆటతో గంటన్నరకు పైగా కథనం నడుస్తుంది. మధుశాలినితో ముద్దులు.. త్రిషతో ఫైటింగులు.. మధ్య మధ్యలో ప్రకాష్ రాజ్ తో చమక్కులు.. ఇలా కమల్ ప్రేక్షకుడిని బాగానే ఎంగేజ్ చేసేస్తాడు.ఇకపోతే మెయిన్ విలన్స్ గా కనిపించిన ప్రకాష్ రాజ్, సంపత్ రాజ్ లు వారి వారి పాత్రలకి న్యాయం చేసారు. వీరిద్దరి పాత్రల్లో సీరియస్ తో పాటు కాస్త హ్యూమర్ ని కూడా పండించడం ప్రేక్షకుల పెదవులపై కాస్త నవ్వును తెప్పిస్తుంది. ఓ ముఖ్య పాత్రలో కనిపించిన మధు శాలిని తన గ్లామర్ తో కాసేపు యువతని, ముందు బెంచ్ వారిని ఆకట్టుకుంటుంది.

ఇక నటీనటుల పరంగా చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన ఆశా శరత్, అమన్ అబ్దుల్లా, యుగి సేతు తదితరులు టం పాత్రల పరిధి మేర చేసారు. సహజంగా అనిపించే హీరో క్యారెక్టరైజేషనే కమల్ ఆ పాత్రను పోషించిన తీరు సినిమాకు హైలైట్. హీరోయిజం రియలిస్టిక్ గా ఉంటుంది. హీరోకు ఎదురు లేనట్లు చూపించకుండా సహజంగా ఉండేలా తీర్చిదిద్దారు. దీంతో ఆ పాత్రకు ఈజీకి కనెక్టవుతాం. మొదట్లో తండ్రీ కొడుకుల మధ్య దూరాన్ని.. ఆ తర్వాత వాళ్లిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని చాలా తక్కువ సన్నివేశాల్లో చూపించిన తీరుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.వీరి తర్వాత సినిమాకి హైలైట్స్ గా చెప్పుకోవాల్సిన విషయానికి వస్తే, సినిమా మొదలవ్వడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది, అలాగే ఆ తర్వాత వచ్చే కమల్ – ఆశ శరత్ మధ్య వచ్చే కొన్ని సీన్స్ కాస్త నవ్విస్తే, అక్కడి నుంచి సినిమాని సీరియస్ చేసి చాలా గ్రిప్పింగ్ గా సినిమాని లాగడం మరియు ఫస్ట్ పార్ట్ లో వచ్చే చిన్న చిన్న యాక్షన్ ఎపిసోడ్స్ తో బాగానే సాగుతుంది. ఆ తర్వాత సెకండాఫ్ లో కమల్ – త్రిష, కమల్ – కిషోర్ యాక్షన్ ఎపిసోడ్స్ మరియు ఓకే ట్విస్ట్ ని రివీల్ చెయ్యడం చాలా బాగుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సినిమా చివర్లో వచ్చే ఒకే ఒక్క పాటని సూపర్బ్ గా ఎడిట్ చేశారు, సో డోంట్ మిస్ ఇట్.ప్రి క్లైమాక్స్ – క్లైమాక్స్ విషయంలో ప్రేక్షకుడు ‘యే దిల్ మాంగే మోర్’ అనుకుంటే తప్పేమీ లేదు.

థ్రిల్లర్ మూవీస్ చివర్లో కచ్చితంగా ఏదో సర్ ప్రైజింగ్ ఎలిమెంట్ కోరుకుంటారు. బ్యాంగ్ బ్యాంగ్ క్లైమాక్స్ అయినా ఆశిస్తారు. అలాగే ఈ సినిమా జానర్ యాక్షన్ థ్రిల్లర్.. అంటే యాఖాన్ తో పాటు ఆడియన్స్ అబ్బో అనిపించినే థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ కూడా ఉండాలి. కానీ ఈ సినిమాలో ఆడియన్స్ ని థ్రిల్ చేసే ఒక్క థ్రిల్లింగ్ పాయింట్ కూడా లేకపోవడం చెప్పుకోదగిన మరో మైనస్ పాయింట్. ముఖ్యంగా మెయిన్ విలన్ ఎవరనేది దాచి పెట్టడమే ఈ సినిమాకి కీలకం కానీ కథనంలో ఆ విషయాన్ని ఫస్ట్ లోనే రివీల్ చేసెయ్యడం చూసే ఆడియన్స్ కి పెద్ద కిక్ ఇవ్వదు. స్క్రీన్ ప్లే మొత్తం ఆడియన్స్ ఊహించి నట్లే సాగడం, అలాగే నేరేషన్ చాలా చోట్ల బాగా స్లో అయిపోవడం ఈ సినిమాకి మరో మైనస్. ఫాదర్ – సన్ సెంటిమెంట్ యాంగిల్ తో పాటు, కమల్ హాసన్ మిషన్ గురించిన విషయాన్ని ఇంకాస్త క్లియర్ గా చూపించాల్సింది.

నటీనటుల ప్రతిభ:

కమల్ హాసన్: ఒక నార్కోటిక్ పోలీస్ ఆఫీసర్ గా కమల్ హాసన్ పెర్ఫార్మన్స్ సింప్లీ సూపర్బ్. ఒకవైపు సీనియర్ పర్సన్ గా, కొడుకును రక్షించుకోవాలనే ఫాదర్ గా, పోలీస్ గా అతను చూపిన హావ భావాలు ఆడియన్స్ ని కట్టి పడేస్తాయి. చీకటి రాజ్యం సినిమాకి మెయిన్ పిల్లర్ కమల్ హాసన్ అని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు.కత్తి పోటు బాధను అనుభవిస్తూ సాగే పాత్రలో కమల్ ఎంతలా జీవించాడంటే సినిమా చూస్తున్న ప్రేక్షకుడు కూడా ఆ దెబ్బ మెలిపెడుతున్న ఫీలింగ్ అనుభవిస్తూ ఉంటాడు. డోర్ తెరిచి లోనికి వస్తున్నపుడు ఆ డోర్ కొద్దిగా తన దెబ్బకు అలా తాకగానే నొప్పి బాధను కమల్ నటించిన తీరు చూస్తే.. ఒక పాత్రలో జీవించడమంటే ఏంటో చాటి చెబుతుంది. కొడుకుతో ఫోన్ లో ఎమోషనల్ గా మాట్లాడే ఒక్క సన్నివేశం కూడా కమల్ ప్రత్యేకతను చాటి చెబుతుంది.
త్రిష : త్రిష ఒక టఫ్ పోలీస్ గర్ల్ గా కమల్ కి మంచి పోటీని ఇచ్చింది. ముఖ్యంగా వీరిద్దరి మధ్యా వచ్చే యాక్షన్ సీన్స్ మాత్రం ఆడియన్స్ ని సీట్ ఎడ్జ్ కి తీసుకొస్తాయి.. త్రిష సినిమాలో మెరిసి మెరిసి మాయమవుతూ ఉంటుంది. కనిపించినంత సేపూ బాగానే చేసింది. కమల్ తో ఆమె ఫైటింగ్ సీన్ బాగుంది. అందులో త్రిష బాగా పెర్ఫామ్ చేసింది.
అమన్ అబ్దుల్లా: చిన్న వయసులోనే గొప్పగా నటించాడతను.ఇతనికి చాలా మంచి భవిష్యతు ఉంటుంది.
ప్రకాష్ రాజ్: ఇలాంటి ఫన్నీ విలన్ పాత్రలో చూసి చాలా కాలమైంది. భలే ఎంటర్టైన్ చేశాడాయన.

సాంకేతిక వర్గం పనితీరు:

కమల్ సినిమా అంటేనే ఎప్పుడూ టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ లో ఉంటుంది. ‘చీకటి రాజ్యం’ కూడా అందుకు మినహాయింపు కాదు. చీకటి రాజ్యం’ సినిమాకి టెక్నికల్ గా పరంగా చాలా డిపార్ట్మెంట్స్ హైలైట్స్ గా నిలిచాయి. ముందుగా చెప్పుకోవాల్సింది. జన వర్గీస్ సినిమాటోగ్రఫీ సూపర్బ్ గా ఉంది, యాక్షన్ థ్రిల్లర్ ఎపిసోడ్ లో చూపిన కెమెరా యాంగిల్స్, విజువల్స్ సూపర్బ్ గా ఉన్నాయి.రిపీటెడ్ లొకేషన్లలోనే మొనాటనీ రాకుండా సన్నివేశాల్ని చిత్రీకరించిన తీరు ఆకట్టుకుంటుంది. కిచెన్ లో వచ్చే యాక్షన్ సన్నివేశాల్లో కెమెరా వర్క్ స్టన్నింగ్ గా అనిపిస్తుంది.. అలాగే ప్రేమ్ నవస్ ఆర్ట్ డైరెక్షన్ చాలా బాగుంది. ముఖ్యంగా ఇన్సోమియా పబ్ సెట్ ని వేసిన తీరు చాలా చాలా బాగుంది.ఇకపోతే జిబ్రాన్ మ్యూజిక్ ఈ సినిమాకి మరో హైలైట్. ప్రతి సన్నివేశంలోనూ జిబ్రాన్ ఇచ్చిన మ్యూజిక్ సినిమాని చాలా ఎలివేట్ చేసింది.మేజర్ హైలైట్. బ్యాగ్రౌండ్ స్కోర్ అదరగొట్టేశాడు. కీలకమైన సన్నివేశాల్లో ‘చీకటి రాజ్యం’ థీమ్ మ్యూజిక్ ను అతను వాడుకున్న తీరు ఆకట్టుకుంటుంది. సినిమాలో పాటలేమీ లేవు. ఎండ్ టైటిల్స్ లో కమల్ పాడిన థీమ్ సాంగ్ వస్తుంది. అది బాగుంది.ఎడిటర్ షాన్ మొహమ్మద్ ఫస్ట్ హాఫ్ ని చాలా బాగా ఎడిట్ చేసాడు, కానీ సెకండాఫ్ ని మాత్రం చాలా సాగ దీసేసారు. సెకండాఫ్ లో చాలా ఎడిట్ చేయాల్సింది.అబూరి రవి డైలాగ్స్ బాగున్నాయి. గిల్లెస్ కాన్సీల్, రమేష్ యాక్షన్ స్టంట్స్ కూడా సినిమ మూడ్ కి తగ్గట్టుగా ఉన్నాయి.. దర్శకుడిగా కమల్ నుంచి రాజేష్ సెల్వ ఎంత ఫ్రీడమ్ తీసుకున్నాడో కానీ.. దర్శకత్వ పరంగా కంప్లైంట్స్ లేవు. కాకపోతే స్క్రిప్టే మరింత పకడ్బందీగా తీర్చిదిద్దుకోవాల్సింది. డైరెక్టర్ గా రాజేష్ ఎం సెల్వ టేకింగ్ బాగుంది. సీరియస్ థ్రిల్లర్ లో కొన్ని కామెడీ బిట్స్ ని కూడా టచ్ చేయడం బాగుంది. కానీ డైరెక్టర్ కూడా థ్రిల్లర్ సినిమాలో థ్రిల్లింగ్ పార్ట్ ని వదిలేయడం బాలేదు. కమల్ మరియు రాజేష్ థ్రిల్స్ విషయంలో కేర్ తీసుకోవాల్సింది.

ప్లస్ పాయింట్స్:

  • కమల్ హాసన్
  • వర్గీస్ సినిమాటోగ్రఫీ
  • జిబ్రాన్ బ్యాగ్రౌండ్ స్కోర్

మైనస్ పాయింట్స్:

  • స్క్రీన్ ప్లే
  • సెకండాఫ్
  • ఎడిటింగ్

                                                  పంచ్ లైన్: చీకట్లో చిన్నగ వెలిగిన చీకటి రాజ్యం.

రేటింగ్; 2.5

(Visited 90 times, 69 visits today)