EDITION English తెలుగు
మూవీ రివ్యూ: 'పేట'   మూవీ రివ్యూ:వినయ విధేయ రామ   మూవీ రివ్యూ:యన్.టి.ఆర్‌ -కథానాయకుడు   5 రూపాయలు తీసుకొని అటే ఉడాయించి ఉంటాడు,అనుకున్న వ్యక్తికీ. సార్ మీ ఛాయ్..అన్న పిలుపుతో అతను షాక్ కు గురయ్యాడు.అసలు ఏమైందో తెలుసా..?   ఈ క్యాబ్ డ్రైవ‌ర్ రాత్రి పూట అవ‌స‌రం ఉన్న వారిని ఉచితంగా క్యాబ్‌లో ఇంటి దగ్గ‌ర దింపుతాడు. ఎందుకో తెలుసా..?   మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే మాటకు కరెక్ట్ అర్థం ఈ జంటే... వీరి కథ వింటే ఆశ్చర్యపోవాల్సిందే. రియల్ స్టోరీ..!   మూవీ రివ్యూ: పడి పడి లేచె మనసు   పొరిగింటి రెండేళ్ల చిన్నారి కోసం...చనిపోతూ ఈ తాత ఇచ్చిన విలువైన బహుమతి ఏంటో తెలుసా..?   కేంద్రం సంచలన నిర్ణయం...! ఇకపై ఆధార్ అడిగితే కోటి జరిమానా...జైలు శిక్ష! వివరాలు ఇవే!   ఎంతపెద్ద జ్వరమైనా ఈ ట్రిక్ పాటిస్తే సింపుల్ గా తగ్గిపోద్ది.! కావాల్సింది పెసరపప్పు ఒక్కటే.!
Home / General / కలియుగంలో చిరంజీవి? 256సం॥ బ్రతికిన వ్యక్తి గురించి మీకు తెలుసా?

కలియుగంలో చిరంజీవి? 256సం॥ బ్రతికిన వ్యక్తి గురించి మీకు తెలుసా?

Author:

మహా అయితే నూరేళ్ళు లేదా మరో పదో పదిహేనేళ్ళో బ్రతికి శతక్కొట్టిన వారి గురించి అడపాదడపా పేపర్లలో టీవీల్లో చదువుతుంటాం, చూస్తుంటాం. అయితే 256సం॥జీవించిన వ్యక్తి ఉన్నాడంటే మీరు నమ్ముతారా?!

లీ చింగ్ యున్

చైనా కుచెందిన లీ చింగ్యున్ 256సం॥బ్రతికాడు.  1930 వ సం॥ లో న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఒక ఆసక్తికర విషయం ప్రచురించింది. 1827వసంవత్సరంలో చైనా ప్రభుత్వం తమ రికార్డుల ప్రకారం 150వ పుట్టిన రోజు జరుపుకొంటున్న లీ చింగ్యున్ కు శుభాకాంక్షలు తెలిపిన ప్రకటనను న్యూయార్క్ టైమ్స్ ప్రచురించింది.  అంతేకాదు 1877లో అతని200వ పుట్టిన రోజు శుభాకాంక్షలు కూడా అందజేయబడ్డాయని తెలిపింది. ఇలా ఈ దీర్ఘాయుష్మంతుడి గురించి ప్రపంచానికి తెలిసింది. న్యూయార్క్ టైమ్స్ విలేఖరి అతని గురించిన వివరాలు ఆరాతీస్తే లీ ఇరుగు పొరుగున ఉన్న వృద్ధులలో చాలా మంది లీ ని తమ తాతలు వారి చిన్నతనం నుంచీ చూశామన్నారని చెప్పారు.

1

లీ చింగ్ యున్ ఎలా జీవించాడు?

లీ చింగ్ యున్ పదేళ్ళ వయసుకే చదవడం వ్రాయడం నేర్చుకొన్నాడు.ఆ వయసు నుండే మూలికా వైద్యుడిగా పని ప్రారంభించాడు. తన గ్రామం చుట్టు ప‌క్క‌ల‌ ఉన్న పర్వత సానువుల నుండి అరుదైన మూలికలు సేకరించి ఔషధాలు తయారు చేసేవాడు. అతనికి దీర్ఘకాలం జీవించడానికి ఉపకరించే మూలికల గురించి బాగా తెలుసు. దాదాపు 40సం॥ పాటు ఔషధాలుగా వాడే అడవి జిన్ సెంగ్ లింగ్ఝ్, గోజీ హిషోవూ అనే మూలికలను, ఒక రకమైన బియ్యం సారాను మాత్రమే ఆహారంగా తీసుకొన్నాడు. తన జీవిత కాలంలో మొదటి నూరేళ్ళు మూలికా వైద్యుడిగా తర్వాత మూలికల విక్రేత గా పని చేశాడు. మధ్యలో కొంతకాలం అంటే 1749లో తన 70వ యేట చైనా సైన్యంలో యుద్ధ విద్యల శిక్షకుడిగా కూడా పని చేశాడు. లీ చింగ్ యున్ కి 23 వివాహాల నుండి 200మంది సంతానం ఉన్నారు.

2

లీ చింగ్ యున్ ధీర్ఘాయష్షు రహస్యం ఏమిటి?

లీ చింగ్ యున్ మూలికలు సేకరించడానికి మంచూరియా టిబెట్, సియాం లాంటి దూర ప్రాంతాలకు వెళ్ళే వాడు. అక్కడ అతనికి 500 సం॥లుగా జీవిస్తున్న ఒక గురువు కనబడ్డాడని ఆయనే లీ కు ఎక్కువ కాలంజీవించడానికి రహస్యాలు చెప్పాడని అంటారు. ఆయనే లీ కు ధీర్ఘాయష్షు కు ఉపకరించే క్విగొంగ్ వ్యాయమ పద్ధతులు మూలికలు ఆహార విధానాలను బోధించాడని చెప్తారు. తన చరమాంకంలో లీ అందరితో తన ధీర్ఘాయష్షు రహస్యాన్ని ఇలా చెప్పేవాడు.

“నేను ఈ ప్రపంచంలో చేయాల్సింది అంతా చేశాను.హృదయంలో ప్రశాంతంగా ఉండండి. తాబేలు లా కూర్చొండి. పావురంలా పనిచేయండి. కుక్కలా నిద్రపోండి” అని చెప్పేవాడు.

నమ్మ శక్యంగా లేదా?

ఈ కాలంలో మానవుడి సగటు ఆయుర్ధాయం 70-80దాటడం లేదు. 100ఏళ్ళు బ్రతకటమే గొప్ప. అంతటా కాలుష్యం. కల్తీ ఆహారం, ఉరుకుల పరుగుల జీవన శైలి, మానసికసమస్యలకు తోడు.., మంట కలిసిన మానవ సంబంధాలు వెరసి మన జీవిత కాలాన్ని తగ్గించేస్తున్నాయి. సాత్వికాహారం, ధ్యానం, యోగా , సంతృప్తి, నియమిత వ్యాయామం,పృకృతితోఋముడి పడిన జీవనశైలి మనల్ని ధీర్ఘాయష్మంతుల్ని చేస్తాయి. కాదంటారా?!

తెలుగు డాట్ అలజడి డాట్ కామ్ ను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌,ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.

(Visited 1 times, 123 visits today)