Home / Entertainment / సినిమా అవార్డ్స్ లో డాన్స్ అదరగొట్టిన చిరంజీవి.

సినిమా అవార్డ్స్ లో డాన్స్ అదరగొట్టిన చిరంజీవి.

Author:

చాలా రోజుల తరువాత మెగాస్టార్ చిరంజీవి డాన్స్ చేశాడు, నిన్న సాయంత్రం జరిగిన సినీ”మా” అవార్డ్స్ ఫంక్షన్ కోసం చిరంజీవి స్టేజ్‌ పెర్ఫామెన్స్‌ ఇచ్చారు, గ్యాంగ్ లీడర్ లోని ‘పాపా రీటా’ పాటకి 60 ఏళ్ళ వయసులోనూ ఏమాత్రం ఉత్సాహం తగ్గకుండా డాన్స్ చేసి మెగాస్టార్ అదరగొట్టాడు.ఈ పాటకి చిరంజీవి పక్కకి, వెనుకల నిలబడి సునీల్, సాయి ధరమ్ తేజ్, నవదీప్, శ్రీకాంత్ లు కూడా డాన్స్ వేశారు, 150వ చిత్రం త్వరలో మొదలవుతుండడంతో తన డాన్స్ లో ఏమాత్రం ఉత్సాహం తగ్గలేదని ఈ స్టేజ్ పెర్ఫార్మన్స్ తో నిరూపించాడు.

సినీ”మా” అవార్డ్స్ వేదికపై మాట్లాడుతూ తన 150వ చిత్రం అందరిని కదిలించే ఒక రైతు కథ అని, తన అభిమానులకి ఖచ్చితంగా నచ్చుతుందని, మాస్ ఎలిమెంట్స్, డాన్స్ లు, కామెడీ ఉంటాయని చెప్పాడు, ఏది ఏమైనా మెగాస్టార్ హోదాలో ఉండి కూడా అవార్డ్స్ ఫంక్షన్ లో స్టేజ్ పెర్ఫార్మన్స్ ఇవ్వడం అంటే మన టాలీవుడ్ లో చాలా మంచి విషయం అనే చెప్పుకోవాలి, బాలీవుడ్ లో అయితే చిన్న హీరోల నుండి షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ ల వరకు అవార్డ్స్ ఫంక్షన్ లలో స్టేజ్ పెర్ఫార్మన్స్,యాంకరింగ్ చేస్తారు, చిరంజీవి పెర్ఫార్మన్స్ చూసిన మన హీరోలు మారుతారేమో చూడాలి.

Must Read: ఈ నెల 20న జైలుకి వెళ్లనున్న చిరంజీవి.

(Visited 2,895 times, 11 visits today)