EDITION English తెలుగు
కాలా సినిమా రివ్యూ & రేటింగ్.   డేవిడ్ వార్నర్ మరియు భార్య కాండిస్ బాల్-టాంపెరింగ్ కుంభకోణం తరువాత గర్భస్రావం చేస్తారు   చైనా హఫీజ్ సయీద్ ను వెలుపలికి వెలుపల కోరుకుంటున్నారు.   MH17 రష్యన్ సైనిక క్షిపణి వ్యవస్థ డౌన్ కూలిపోయింది, పరిశోధకులు చెప్పారు   అమెరికాపై ఆధారపడిన సంబంధం భారత్కు ఎప్పటికీ ఉండదు: నిపుణుడు కాంగ్రెస్ సభ్యులకు చెబుతాడు   హెల్త్కేర్ యాక్సెస్ అండ్ క్వాలిటీలో 195 దేశాలలో నెమ్మదిగా మెరుగుపరుచుకోవడం, భారతదేశం రాంక్స్ 145   ఢిల్లీ మనిషి తన కుమారుని హతమార్చాడు   పెట్రోల్ ధరలు పెరగడంతో పలు నగరాల్లో 80 రూపాయల మేరకు ధరలు పెరిగాయి   కేరళ ప్రభుత్వం గత 24 గంటల్లో బాధిత ప్రాంతాల్లో తాజా కేసులను నమోదు చేయకుండా, సమయానుగుణ జోక్యం ద్వారా వ్యాప్తిని తగ్గించింది.   మనిషి ఇండోర్-గోవా ఇండిగో విమానంలో టేకాఫ్ ముందు తన ప్రియురానికి ప్రతిపాదించాడు.

నాని బాకీ తీర్చేసిన మెగాస్టార్ చిరంజీవి…!

Author:

మన నాచ్యురల్ స్టార్ నానికి తన బాకీని మెగాస్టార్ చిరంజీవి గారు తీర్చేసారు, నాని చిన్నతనంలో చిరంజీవి గారి ‘ మాస్టర్ ‘ సినిమాని చూడటానికి అమీర్ పేట్ లో ఉన్న సత్యం థియేటర్ కి తన కొత్త సైకిల్ ని తీసుకోని నాని వెళ్ళాడు, సైకిల్ ని థియేటర్ బయట పెట్టి టికెట్ తీసుకోని వచ్చేలోపే నాని సైకిల్ ని ఎవరో దొంగిలించారు, అయినప్పటికీ టికెట్ దొరికిందన్న ఆనందంలో సినిమా మాత్రం చూసేసాడట.. సినిమా అయిపోయాక సైకిల్ పోయిందని తనకు ఏడుపొచ్చిందని చెప్పాడు నాని. ఇంట్లో వాళ్లకు ఏవో మాయ మాటలు చెప్పి విషయాన్ని కవర్ చేసేశాడట.

Nani-With-Megastar

కాగా ఈ విషయాన్నీ అల్లు అరవింద్ గారికి ‘భలే భలే మగాడివోయ్’ సినిమా చేసినపుడు చెబితే.. నేను కొనిస్తా అన్నాడు కానీ ఇప్పటివరకూ ఇవ్వలేదు అని మీలో ఎవరు కోటీశ్వరులు కార్యక్రమంలో చిరంజీవికి నాని చెప్పాడు, ఆ వెంటనే చిరు స్పందిస్తూ ఆ సైకిల్ పోవడానికి కారణం నేనే కాబట్టి.. నేనే నీకు ఒక సైకిల్ కొనిస్తా.. అని ప్రామిస్ చేశాడు. ఆ మాట ప్రకారం నాని ఇంటికి ఒక కొత్త సైకిల్ ని చిరంజీవి పంపారు, ఆ విషయాన్నీ నాని తన సోషల్ మీడియా అకౌంట్ లలో పంచుకున్నాడు, ఏ హీరో కోసం అయితే సైకిల్ పోగొట్టుకున్నాడో ఆ హీరోనే ఇప్పుడు నానికి సైకిల్ కొనివ్వడంతో నాని ఫుల్ ఖుషిలో ఉన్నాడు.

(Visited 660 times, 28 visits today)

Comments

comments