Home / Inspiring Stories / మీ రైలు భోగి శుభ్రంగా లేదా? ఒక ఎస్.ఎమ్.ఎస్ తో మీ సమస్య తీరుతుంది.

మీ రైలు భోగి శుభ్రంగా లేదా? ఒక ఎస్.ఎమ్.ఎస్ తో మీ సమస్య తీరుతుంది.

Author:

clean your train coach with an sms

కొన్ని రైళ్ళ లో అపరిశుభ్రత వల్ల, రైలు ప్రయాణం ఎంత అసౌకర్యంగా ఉంటుందో ప్రతి ఒక్కరికీ అనుభవమే. ఇకనుండి అలాంటి అనుభవాలు ఎదురుకాకుండా ప్రతి ఒక్కరూ సుఖ ప్రయాణం చేయడానికి భారతీయ రైల్వే శాఖ కొత్త సేవలను మొదలుపెట్టింది. ఈ సేవలో భాగంగా ప్రతి రైలులో శుభ్రం చేసే సిబ్బంది ఎల్లప్పుడు అందుబాటులో ఉంటారు. అంటే రైలు నడుస్తున్నంత సేపు శుభ్రత సిబ్బంది రైలు లోనే ఉండి, ఎల్లప్పుడు రైలు ని శుభ్రం చేస్తూ ప్రయాణీకులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చేస్తారన్న మాట.

ఇంత జరుగుతున్న మీ రైలు భోగి శుభ్రంగా లేకపోతే, మీరు మీ మొబైల్ ఫోన్ నుండి CLEAN < Space >< 10-digit PNR number> అని టైప్ చేసి 58888 నంబర్ కి మెసేజ్ చేస్తే చాలు. మీ మెసేజ్ డైరెక్ట్ గా ఆ రైలు లో ఉన్న శుభ్రత సిబ్బందికి చేరుతుంది. వెంటనే మీ ఫోన్ కి కూడా ఆ రైలు లో ఉన్న సిబ్బంది వివరాలు మెసేజ్ రూపంలో వస్తాయి. అంతే కాకుండా రైల్వే అధికారులకు కూడా మీ మెసేజ్ అందుతుంది. వెంటనే శుభ్రత సిబ్బంది మీ రైలు భోగిని శుభ్రపరుస్తారు. మీ దగ్గర ఇంటెర్నెట్ ఉంటే www.cleanmycoach.com వెబ్‌సైట్ కి వెళ్ళి కూడా ఫిర్యాదు చేయవచ్చు. వెంటనే మీ ఫిర్యాదు వెబ్‌సైట్ లో ప్రత్యక్షం గా అందరికి కనపడుతుంది మరియు ఆ ఫిర్యాదు ను ఎంత సేపట్లో పరిష్కరించారో కూడా చూడవచ్చు. ఇప్పటికే 14,000 వేల కి పైగా ఇలాంటి ఫిర్యాదులని ఈ వెబ్‌సైట్ ద్వారా పరిష్కరించారు. ప్రస్తుతానికి ఈ సేవ అన్ని రైళ్ళ లో అందుబాటులో లేదు. కేవలం దూర ప్రాంతాలకు ప్రయాణించే 1102 రైళ్ళ లో మాత్రమే ఉంది. ముందు ముందు అన్ని రైళ్లకు ఈ సేవ అందుబాటులోకి రానుంది. ఇతర వివరాలకు www.cleanmycoach.com చూడండి.

(Visited 940 times, 8 visits today)