EDITION English తెలుగు
"పీవీ సింధు..మమ్మల్ని క్షమించు"   Video: ప్రియురాలి శవానికి తాళి కట్టి పెళ్లి చేసుకున్న ప్రేమికుడు.   Video: ఒక్క పాటతో ఇంటర్నెట్ ని ఊపేస్తున్న మల్లు బ్యూటీ..!   నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసాడు.. సంపాదించిన ఆస్తి రూ.3930 మాత్రమే..!   మహేష్ బాబు, అల్లు అర్జున్ లకు షాక్ ఇచ్చిన రజినీకాంత్..!   లవర్స్ మధ్య జరిగిన ఈ వాట్సాప్ చాట్ లు చూస్తే ఖచ్చితంగా నవ్వుకుంటారు..! 3వది అయితే హైలైట్..!   మహారాజశ్రీ హైకోర్టు న్యాయమూర్తి గారికి....! కదిలించిన జెడ్పి విద్యార్థినిల లెటర్..!   హైదరాబాద్ లోని ఈ హాస్పిటల్ లో రూ. 10 లక్షలు అయ్యే చికిత్సలు అన్ని ఉచితం..!   తల్లి చనిపోతూ తన కొడుక్కి రాసిన లెటర్..! అది చదివితే కన్నీళ్లొస్తాయి...!   బీటెక్ స్టూడెంట్స్ కు నెలకు రూ.80వేల స్కాలర్ షిప్.
Home / General / కలెక్టర్లందు ఈ కలెక్టర్ వేరయా…!

కలెక్టర్లందు ఈ కలెక్టర్ వేరయా…!

Author:

జయశంకర్ జిల్లా కలెక్టర్ ఆకునూరి మురళి. ఆయన్ని చూస్తే ఎవరూ కలెక్టర్ అనుకోరు. ఎందుకంటే ఎప్పుడూ అధికారగణం, మంది మార్బలంతో హడావుడి చేసే అధికారి కాదు ఈయన. కలెక్టర్ అంటే పేపర్లోనో, టీవీలోనో లేదంటే ఏ పంద్రాగస్టు, చబ్బీస్ జనవరిలకే కనబడే అందరిలాంటి అధికారి కాదు. మనం ఆర్జీలు పెట్టుకుంటే ఏంపట్టనట్టు, ప్రజలకు సమస్యలే లేనట్టు ప్రవర్తి౦చే మనిషి కాదు. ఆయనొక కలెక్టర్ అయినప్పటికీ కూడా మనలో ఒకడు. మన సమస్యలు తీర్చడం కోసమే ప్రభుత్వం తరపున పని చేస్తాడు అని చేసి చూపిస్తున్న అసలు సిసలు తెలుగు కలెక్టర్ ఈ ఆకునూరి మురళి.

akunuri murali

ఎప్పుడూ ఆఫీస్ లో ఏసీల్లో కూర్చుని పేపర్లలో, ఫైళ్లలోనే జిల్లాల భవిష్యత్తు, అభివృద్దిని అంకెల్లో చూపే మనిషి కాదు. స్వయంగా ప్రతి చోటకూ వెళ్లి, అందరినీ కలుసుకొని నిజాలు తెలుసుకొని సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు ఈ యంగ్ అండ్ డైనమిక్ కలెక్టర్. అసలు కలెక్టర్ విధులేంటో అందరికీ అవగాహన కలిగిస్తున్నాడు. ఎవరైనా సరే.. ఏ సమయంలోనైనా తనని కలిసే సదుపాయాలని కలిపించాడు. అంతే కాదు, ఉన్నట్టుండి రురల్ ప్రాంతాలైన తండాలకు వెళ్ళి అవ్వ ఏం సంగతి అని మాట కలిపేస్తాడు. అక్కడి సమస్యలన్నీ అనుభవించి తెలుసుకుంటాడు. ఏ అర్ధరాత్రో కారేసుకుని జిల్లాలోని అన్ని ప్రాంతాలకూ వెళ్లి స్వయంగా పరిశీలించి వస్తాడు. వర్షం వస్తుందనో.. రోడ్లు బాగా లేవనో పని వదలడు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా స్వయంగా వెళ్లి వాస్తవాలు తెలుసుకుంటాడు. మొన్నటికి మొన్న వర్షం పడుతున్నాలెక్క చేయకుండా తాడ్వాయి మండలం లోని గుత్తి కోయాల గూడెంకి సైకిల్ పైన వెళ్ళాడు. అక్కడ గూడెం పరిస్తితులెలా ఉన్నాయ్.. మంచి నీటి సదుపాయం, వైద్య సదుపాయాలూ ఎలా ఉన్నాయో అడిగి మరీ తెలుసుకున్నాడు. వారితో పాటే బుక్కెడు బువ్వ కాస్త కడుపులో వేసుకుని మరీ వచ్చాడు. అంతేకాదు ఎక్కడికెళ్ళినా ప్రభుత్వ పథకాలని వారికి వారి భాషలోనే అర్థమయ్యేలా వివరిస్తున్నాడు. అవసరమైన వాళ్లకి తన అధికార పరిధిలో అన్ని సహాయాలు చేస్తున్నాడు.

ఆకునూరి మురళి కలెక్టర్

ఇలా ఏసీలు, ఆఫీసులు వదిలి ప్రజలతో తిరుగుతూ వారి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తున్న అధికారులెక్కడైనా కనబడుతున్నారా..? ప్రజల్లో ప్రభుత్వ అధికారుల పట్ల పెరుగుతున్న అపనమ్మకం, అనుమానాలు పోవాలంటే ఆకునూరి మురళి లాంటి అధికారులు ఇంకా రావాలి. ప్రభుత్వ అధికారానికి అసలు సిసలు అర్థమేంటో చేతలతో చేసి చూపుతోన్న కలెక్టర్ సాబ్ …సాహో…

Comments

comments