Home / Inspiring Stories / మూఢ నమ్మకాల కంచెని చేధించిన కలెక్టర్.

మూఢ నమ్మకాల కంచెని చేధించిన కలెక్టర్.

Author:

మనం ఎంత అభివృద్ది చెందుతున్నాం అని ఆనంద పడుతున్నామో ఆ అభివృద్ది పట్టణాల్లోనే తప్ప ఇంకా గ్రామాల్లో కాదని ౠజువు చేసే సంఘటనలు రోజూ జరుగుతూనే ఉన్నాయి. ఇంకా వీడని పిచ్చినమ్మకాల ముసుగులో చాలా మంది మగ్గిపోతూనే ఉన్నారు. రకరకాల నమ్మకాల వల్ల ఎందరో క్షోభ పడుతూనే ఉన్నారు.అలాంటిదే బీహార్ లో జరిగిన తాజా ఘటన.

బీహార్లోని గోపాల్ గంజ్ జిల్లాలోని కళ్యాన్ పూర్ గ్రామంలో ఉన్న పాఠశాలలో మధ్యాహన భోజనం వండే సునితా కౌర్ ని రెండు సంవత్సరాల క్రితం విధుల నుంచి తొలగించారు. దానికి పాఠశాల వారు చెప్పిన కారణం ఆమె వితంతువు కావటమే. పాఠశాలలో వంట చేయడం ద్వారా నెలకు 1000 రూపాయలు వేతనం. ఇద్దరు పిల్లలు ఉన్న ఆమె కుటుంబానికి అదే ఆధారం. ఏం చేయాలో దిక్కుతోచని సునితా ప్రభుత్వనికి అర్జీ పెట్టుకుంది ఆమెను విధుల్లో చేర్చుకోవాల్సిందిగా పైనుంచి వచ్చిన ఆఙ్ఞలను అనుసరించిన స్కూల్ ప్రిన్సిపాల్ ఆమె మళ్ళీ వంట వండటానికి  పిలిచారు, ఐతే ఈసారి గ్రామస్తులు ఊరుకోలేదు, వితంతు మహిళను తమ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకానికి వంట చేయడానికి వీల్లేదంటూ ఆందోళన చేపట్టారు. సునితాని కనీసం స్కూల్ ఆవరణలోకి కూడా రాకుండా అడ్డుపడ్డారు. వితంతువు తమ పాఠశాలలో వంట చేస్తే ఒప్పుకోమంటూ కళ్యాణ్ పూర్ గ్రామవాసులు కొంతమంది ఆందోళనకు దిగారు. ఆమె చేతి వంట తమ పిల్లలు తింటే అనర్థమని వాదించారు. స్కూల్ గేట్లకు తాళం వేసి పాఠశాలను నడవనీయమంటూ మొండి పట్టు పట్టారు. దీంతో వివాదం రేగింది.ఈ నమ్మకాలతో తన జీవితం లో వచ్చిన ఈ సమస్యని ఎలా ఎదుర్కోవాలో ఆమెకి అర్థం కాలేదు.

తన గోడుని ఎవరికి చెప్పుకోవాలో తెలియని అయోమయంలో ఏడుస్తూ ఉండిపోయింది ఐతే విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ రాహుల్ కుమార్ ఈ సమస్యని పరిష్కరించాలనుకున్నారు. ఇక్కడ సమస్య కేవలం సునితా కౌర్ ఉద్యోగం మాత్రమే కాదు. ప్రజల్లో ఉన్న కొన్ని మూఢ నమ్మ కాలనూ తొలగిస్తే తప్ప తరువాత కూడా ఇటువంటి వివక్ష లేకుండా చేయవచ్చు. లేదంటే మరికొందరు స్త్రీలు ఇలా భాదపడుతూనే ఉంటారు. అందుకే రాహుల్ కుమార్ స్వయంగా ఉన్నతాధికారులతో కలిసి శుక్రవారం పాఠశాలను సందర్శించారు. వితంతు మహిళకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారితో చర్చలు జరిపారు.తాను స్వయంగా ఆమె చేతి వంటను విద్యార్థులతో కలిసి అక్కడే తిన్నారు కూడా. దీంతో పాటుగా ఉన్న సమస్యల గురించీ ముఢ విశ్వాసాల గురించీ గ్రామస్తుల్లో అవగాహన కల్పించి పరిస్థితిని చక్కదిద్దారు. సునితా కౌర్ ఇప్పుడు ఆనందంగా ఉంది ఐతే ఈ ఆనందం తన జీవితం పట్ల మాత్రమే కాదు భవిశ్యత్తులో తన లాంటి మహిళలకు ఎదురయ్యే సమస్యలు తొలగిపోయినందుకు..కలెక్టర్, ఉన్నతాధికారులు చొరవ తీసుకొని తనకు న్యాయం చేయడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేసింది.

(Visited 396 times, 12 visits today)