EDITION English తెలుగు
ఈ రోజు: 18-10-2018 (గురువారం) చమురు ధరలు..! పెట్రోల్ ధర ఎంత ఉందో చూడండి.! డీజిలు ధర ?   ఈ రోజు: 18-10-2018 (గురువారం) రాశిఫలాలు..! ఏ రాశివారికి ఎలా ఉందో చూడండి.! ఎవరికి బాగుందంటే.?   సుప్రీం మరోకీలక నిర్ణయం: వెంటనే డైవర్స్ తీసుకోవచ్చు   రెండు వారాల్లోనే హైదరాబాద్ లో స్వైన్ ఫ్లూ…ఐదుగురు మృతి   ఈ రోజు: 17-10-2018 (బుధవారం) రాశిఫలాలు..! ఏ రాశివారికి ఎలా ఉందో చూడండి.! ఎవరికి బాగుందంటే.?   హాస్పిటల్స్‌లో రోగుల ప‌క్క‌నే ఉంచే హార్ట్ బీట్ మెషిన్‌ను ఏమ‌ని పిలుస్తారో, అందులో రీడింగ్స్‌ను ఎలా చ‌ద‌వాలో తెలుసా..?   ఆరోగ్యం,భోజ‌నం, చ‌దువు, అంతా…..ఈ వాత్స‌ల్యం సంస్థే అండ‌గా నిల‌బ‌డ‌తుది   'తిత్లీ' బాధితులకు సంపూర్ణేష్ బాబు, విజయ్ దేవరకొండ, తారక్‌, కల్యాణ్‌రామ్‌ సాయం   మనుషుల్లో మానవత్వం గురించి అబ్దుల్ కలాం చివరిసారి చెప్పిన కథ.... తప్పక చదవండి.   కొన్ని యూట్యూబ్‌ చానెళ్లపై గీతామాధురి సీరియస్‌ వార్నింగ్‌

Video: కమెడియన్ విజయ్ ఆత్మహత్యలో సెల్ఫీ వీడియో ట్విస్ట్..!

Author:

కమెడియన్ విజయ్‌ సాయి ఆత్మహత్య చేసుకోవడం టాలీవుడ్ ఇండస్ట్రీలో కలకలం రేపింది. కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్న విజయ్ ఆత్మహత్యకి ముందు తీసుకున్న సెల్ఫీ వీడియో బయటకి రావడంతో పోలీసులు వీడియో ఆధారంగా విచారణ చేస్తున్నారు, సినిమా అవకాశాలు తగ్గిపోవడం..అదే సమయంలో ఆర్థిక సమస్యలతో పాటు విడాకుల విషయంలో భార్య నుండి కూడా వేధింపులు ఎక్కువ అవడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు విజయ్ సాయి సన్నిహితులు మీడియాకి తెలిపారు.

విజయ్‌ సాయి

కమెడియన్ విజయ్ సాయి సెల్ఫీ వీడియోలో తన చావుకి భార్య వనిత యే కారణం అని వనిత మరియు ఆమె తరుపు వ్యక్తులు విడాకుల విషయంలో రూ.3 కోట్లు ఇవ్వాలని బెదిరించడంతో పాటు కూతురి విషయంలో మానసికంగా ఇబ్బంది పెట్టడంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పాడు… తన చావుకు భార్య వనిత, వరలక్ష్మి, విన్నీ, బృందతోపాటు పారిశ్రామికవేత్త శశిధర్‌, న్యాయవాది శ్రీనివాస్‌ కారణమని ఆరోపించారు. వీరంతా తనను మానసికంగా హింసించారని విజయ్‌ సాయి ఆవేదన వ్యక్తం చేశారు. ‘డాడీ.. ఎవ్వర్నీ విడిచిపెట్టొదు. అందరికి శిక్ష పడేలా చూడు.. లవ్‌ యూ డాడీ.. నా కూతురు అలాంటి వాతావరణంలో పెరగడం ఇష్టంలేదు.. తీసుకొని రండి డాడీ’ అని విజయ్‌ సాయి సెల్ఫీ వీడియోలో అన్నారు.

తన భర్త విజయ్‌సాయికి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందో తనకు తెలియదని ఆయన భార్య వనిత తెలిపారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘విజయ్‌కి వేరే మహిళతో సంబంధం ఉంది. ఆ విషయం నేను కళ్లారా చూశాను. అప్పటి నుంచే మా మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ విషయాన్ని ఆయన తల్లిదండ్రులు దృష్టికి తీసుకెళ్తే వారు కూడా పట్టించుకోలేదు. రెండేళ్లుగా కోర్టులో విడాకుల కేసు నడుస్తోంది. సూసైడ్‌ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందో నాకు తెలియదు. పాప విషయంలో కూడా నేను ఎలాంటి జోక్యం చేసుకోలేదు. అప్పుడప్పుడు వచ్చి పాపను తీసుకెళ్లి మళ్లీ తీసుకొస్తుండేవారు. అయితే పెళ్లి సమయంలో నేను ఏదైతే ఇచ్చానో దాన్ని తిరిగి ఇవ్వమని కోరాను. ఎందుకంటే పాప భవిష్యత్‌ను కూడా నేను చూసుకోవాలి కదా’’ అని చెప్పుకొచ్చారు.

Also Read:  Video:నటుడు పృద్వీ రాజ్ ఆత్మహత్య వీడియో.

(Visited 1,512 times, 65 visits today)