బాహుబలి థియేటర్లకి సర్కార్ షాక్, షోలు నిలిపివేయాలంటూ ఆదేశాలు…!

Author:

బాహుబలి క్రేజ్ ని క్యాష్ చేసుకోవడం కోసం అధిక ధరకి టికెట్ లని అమ్మితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం అని తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని థియేటర్ల యజమాన్యాలని తెలంగాణ ప్రభుత్వం హెచ్చరించింది, ప్రభుత్వం మొదటి రోజు ఐదు షోలకి అనుమతి ఇచ్చిందని , బెనిఫిట్ షో లకి పర్మిషన్ లేదని , అలాగే టికెట్ ని సాధారణ ధర కంటే ఎక్కువకి అమ్మకూడదని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.

బాహుబలి రివ్యూ

బాహుబలి సినిమా శుక్రవారం (ఏప్రిల్ 28) రోజు విడుదల అవుతుంది , కొన్ని థియేటర్ లలో సినిమా విడుదల కాకముందే అంటే గురువారం ( ఏప్రిల్ 27) రాత్రి కొన్ని షోలకి టికెట్ లని విక్రయిస్తున్నారని తెలుసుకున్న ప్రభుత్వం అలా ముందురోజు షోలు వేయరాదని ఆదేశించింది, ప్రేక్షకులు విడుదలకి ముందు రోజు ఉన్న షోలకి టికెట్ లని కొనవద్దని, అలాగే ఏ థియేటర్ లో అయిన అధిక ధరకి టికెట్ ని అమ్ముతున్నారని తెలిస్తే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1800-4253787 నంబర్ కు కంప్లయింట్ చేయాలని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

(Visited 3,675 times, 35 visits today)

Comments

comments