EDITION English తెలుగు
మూవీ రివ్యూ: 'పేట'   మూవీ రివ్యూ:వినయ విధేయ రామ   మూవీ రివ్యూ:యన్.టి.ఆర్‌ -కథానాయకుడు   5 రూపాయలు తీసుకొని అటే ఉడాయించి ఉంటాడు,అనుకున్న వ్యక్తికీ. సార్ మీ ఛాయ్..అన్న పిలుపుతో అతను షాక్ కు గురయ్యాడు.అసలు ఏమైందో తెలుసా..?   ఈ క్యాబ్ డ్రైవ‌ర్ రాత్రి పూట అవ‌స‌రం ఉన్న వారిని ఉచితంగా క్యాబ్‌లో ఇంటి దగ్గ‌ర దింపుతాడు. ఎందుకో తెలుసా..?   మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే మాటకు కరెక్ట్ అర్థం ఈ జంటే... వీరి కథ వింటే ఆశ్చర్యపోవాల్సిందే. రియల్ స్టోరీ..!   మూవీ రివ్యూ: పడి పడి లేచె మనసు   పొరిగింటి రెండేళ్ల చిన్నారి కోసం...చనిపోతూ ఈ తాత ఇచ్చిన విలువైన బహుమతి ఏంటో తెలుసా..?   కేంద్రం సంచలన నిర్ణయం...! ఇకపై ఆధార్ అడిగితే కోటి జరిమానా...జైలు శిక్ష! వివరాలు ఇవే!   ఎంతపెద్ద జ్వరమైనా ఈ ట్రిక్ పాటిస్తే సింపుల్ గా తగ్గిపోద్ది.! కావాల్సింది పెసరపప్పు ఒక్కటే.!
Home / General / ఈ లక్షణాలు మీలో ఉన్నట్లయితే..! మీకు క్యాన్సర్ ఉన్నట్లే..! ఒకసారి చెక్ చేసుకోండి.

ఈ లక్షణాలు మీలో ఉన్నట్లయితే..! మీకు క్యాన్సర్ ఉన్నట్లే..! ఒకసారి చెక్ చేసుకోండి.

Author:

ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమందిని భయపెడుతున్న వ్యాధి క్యాన్సర్,ప్రస్తుతం క్యాన్సర్ చాలా ప్రాణాంతకమైన వ్యాధిగా మారిపోయిది ఎందుకంటే క్యాన్సర్ వచ్చినట్టు గుర్తించటం చాలా కష్టం, మన శరీరంలోని ఏ భాగంలో అయిన క్యాన్సర్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది, మన శరీరంలో కొన్ని అవయవాల్లో కణాలు సరైన పద్దతిలో కాకుండా అస్త‌వ్య‌స్తంగా అభివృద్ధి చెందితే ఆ చోట క్యాన్సర్ గడ్డలు పెరిగే అవకాశం ఉంది, క్యాన్సర్ వ్యాధి మెల్లమెల్లగా పెరుగుతూ ఉండే వ్యాధి, దీనిని మొదటి దశలోనే గుర్తిస్తే నయం చేయడానికి వీలుంటుంది, చివరి స్టేజి లలో ఉంటే క్యాన్సర్ వ్యాధి నుండి ప్రాణాలని కాపాడటం చాలా కష్టం, క్యాన్సర్ వ్యాధి మొదటి స్టేజి లోనే ఉన్నప్పుడే కొన్ని లక్షణాల ద్వారా మనం కనిపెట్టొచ్చు, ఆ లక్షణాలు ఏంటో మీరు తెలుసుకోండి.

1. జీర్ణాశయంలో రక్తస్రావం, కడుపులో నొప్పి, ఆహారం తీసుకోవటంలో ఇబ్బంది, పేగు కదలికలు సరిగా లేకపోవటం, మలంలో రక్తం పడటం వంటి సమస్యలు క్యాన్సర్ వ‌ల్ల వ‌స్తాయి. ఈ స‌మ‌స్య‌లు ఉంటే గ‌న‌క అనుమానించాలి. వెంట‌నే వైద్య ప‌రీక్ష‌లు చేయించుకుని అవ‌స‌రం ఉన్న మేర‌కు చికిత్స తీసుకోవాలి.

క్యాన్సర్ లక్షణాలు

2. చర్మం పైన ఉండే మచ్చలలో స‌డెన్‌గా మార్పులు వ‌స్తుంటే దాన్ని క్యాన్స‌ర్‌గా అనుమానించాలి. ఎందుకంటే క్యాన్స‌ర్ ఉంటే చ‌ర్మంపై ఉండే మ‌చ్చ‌ల ప‌రిమాణం, రంగు త‌దిత‌రాల్లో మార్పులు వ‌స్తాయి. అవి కూడా స‌డెన్‌గా వ‌స్తాయి. దీంతోపాటు ఆ ప్రాంతంలో దుర‌ద‌లు వ‌స్తాయి. ర‌క్తస్రావం కూడా అయ్యేందుకు వీలుంటుంది.

3. శ‌రీరంలో ఎక్క‌డైనా అసాధార‌ణంగా గ‌డ్డ‌లు వ‌స్తే వాటిని చెక్ చేయించాలి. అవి క్యాన్స‌ర్ క‌ణ‌తులు అయి ఉండ‌వ‌చ్చు. కొన్ని సార్లు కొవ్వు క‌ణ‌తులు కూడా ఏర్ప‌డుతాయి. వాటితో ఇబ్బందేమీ ఉండ‌దు. కానీ క్యాన్స‌ర్ క‌ణ‌తులు అయితే మాత్రం జాగ్ర‌త్త వ‌హించాల్సిందే.

క్యాన్సర్ లక్షణాలు

4. కొన్ని ర‌కాల క్యాన్స‌ర్‌ల వ‌ల్ల శ‌రీరంలో నిర్దిష్ట‌మైన భాగాల్లో విప‌రీత‌మైన నొప్పి ఉంటుంది. ఉదాహ‌ర‌ణ‌కు బోన్ క్యాన్స‌ర్ తీసుకుంటే ఎముక‌లు నొప్పి పుడ‌తాయి.

5.ఏ కార‌ణం లేకుండా బ‌రువు స‌డెన్‌గా త‌గ్గుతుంటే మీరు క్యాన్స‌ర్ వ్యాధి బారిన ప‌డ్డారేమో గుర్తించాలి. క్యాన్సర్ ఉంటే బ‌రువు స‌డెన్‌గా త‌గ్గుతారు. క‌నుక ఇలా ఎవ‌రికైనా అయితే డాక్ట‌ర్‌ను సంప్ర‌దించ‌డం మంచిది.

క్యాన్సర్ లక్షణాలు

6. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణం కాకున్నా లేదంటే ఆహారాన్ని మింగే స‌మ‌యంలో గొంతులో మంట పుట్టినా దాన్ని క్యాన్స‌ర్‌గా అనుమానించాలి. క్యాన్స‌ర్ క‌ణాలు గొంతులో మంట‌ను క‌లిగిస్తాయి.

క్యాన్సర్ లక్షణాలు

7. ద‌గ్గు బాగా ఉందా ? 3 వారాల క‌న్నా ఎక్కువ స‌మ‌యం పాటు ద‌గ్గుతో బాధ‌ప‌డుతున్నారా ? అయితే అది ఊపిరితిత్తుల క్యాన్స‌ర్ అయి ఉండ‌వ‌చ్చు. క‌నుక ఓ సారి చెక్ చేయించుకుంటే మంచిది.

పై లక్షణాలలో ఏ ఒక్కటి మీలో ఉన్న.. మీరు వెంటనే డాక్టర్ ని సంప్రదించాల్సిందే, అది కచ్చితంగా క్యాన్సర్ అవ్వొచ్చు లేదా మాములు అనారోగ్య సమస్య కావొచ్చు కానీ ఈ లక్షణాలన్నీ క్యాన్సర్ వ్యాధిని గుర్తించడానికి ఉపయోగపడుతాయి.

(Visited 269 times, 293 visits today)