Home / Inspiring Stories / ఈ సర్పంచ్ చదువుకోలేదు కానీ కంప్యూటర్ ఆపరేట్ చేస్తుంది…

ఈ సర్పంచ్ చదువుకోలేదు కానీ కంప్యూటర్ ఆపరేట్ చేస్తుంది…

Author:

నరోటీ దేవీ… రాజస్తాన్ లోని అజ్మీర్ జిల్లా హర్మడా అనే ఒక చిన్న పల్లెటూరి కి చెందిన 70 ఏళ్ళ వృద్దురాలు. అయితే సాధారణ మహిళ అయితే మనం ఎందుకు చెప్పుకుంటాం..!అసలు స్కూలు మొహం కూడా ఎరగని ఈమె ఆ గ్రామానికి సర్పంచ్ గా భాద్యతలు నిర్వర్తించటమే కాదు. కంప్యూటర్ వాడుతూ తన ఆఫీస్ లో ఉన్న వాళ్ళకి కంప్యూటర్ వాడకం లోని మెళకువలనూ చెప్పింది. అసలు ఏమీ తెలియని ఈ దళిత మహిళ ఆ వూరిలో ఆధిపత్యం చెలాయించే జాట్ కులస్తులకు ధీటుగా నిలవటమే కాదు, వెనక బడ్డ వాళ్ళయిన తన జాతి మనుషుల అభివృద్దికి ఎంతగానో కృషి చేసింది.హిందూ దిన పత్రిక కథనం ప్రకారం ఆమె చెప్పిన మాటలు..” నేను నా చేతులతోనే కంప్యూటర్,ప్రింటర్ లను ఆఫీస్ కి తెచ్చాను ఐతే అది కేవలం ముఖ్యమైన పత్రాలు ప్రింట్ ఔట్ తీసుకోవటానికి”నరోటీ చిన్న తనం లో స్కూలుకు వెళ్ళే అవకాశం లేకుండా పోయినా,1980 ల్లో ఆమె టిలోనియా లోని (బేర్ ఫూట్ కాలేజ్) వయోజన విధ్యా కేంద్రం లో అక్షరాలు నేర్చుకుంది.అక్కడే కంప్యూటర్ ఏలా ఆపరేట్ చేయాలో కూడా నేర్చుకుంది. దాంతో గ్రామం లోని తన ఆఫీస్ లోకూడా ఆమె టెక్నాలజీని పరిచయం చేసారు. అంతే కాదు పంచాయతీ సెక్రటరీ కి కంప్యూటర్ ఆపరేట్ చేయటం నేర్పంది కూడా నరోటీ దేవీ నే.

sarpanch using computer

అగ్ర కుల ఆధిపత్యం కొనసాగే రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో అదీ ఒక మారుమూల పల్లెలో ఒక మహిళ అందునా ఒక దళిత మహిళ గ్రామ సర్పంచ్ గా భాధ్యతలు తీసుకోవటం అంటే మాటలు కాదు. జాట్ కులస్థుల ఆధిపత్యం కొనసాగే ఆ ఊరిలో వెనుకబడ్డ వారికోసం,దారిద్ర్య రేఖ కి దిగువ గా జీవించే వారి కోసమూ చేసిన కృషి మామూలుదేం కాదు. ప్రతీ ఇంటికీ మరుగుదొడ్డీ నిర్మింపచేయటం లోనూ ఆ ఊరిలో అందరికీ అందుబాటులో ఉండాల్సిన ప్రాథమిక ఆసుపత్రిని నిర్మింపచేయటమూ ఒక ఎత్తైతే. మెజారిటీ జాట్ కులస్థుల ఆక్రమణలకు గురౌతున్న స్మశానం చుట్టూ అక్కడే నిలబడి హద్దుల వరకూ కంచె వేయించటం మరో విజయం. ఆడపిల్లల చదువు కోసమూ ఆమె చాలా తపన పడ్డారు. ఊరు మొత్తం మీద ఉన్న సారా బట్టీలను తోలగించి అక్కడ సారా మాఫియానూ ఎదిరించారు.ఇన్ని పనులు చేసి కూడా ఆమె అధికారం లో ఉన్న ఐదేళ్ల లోనూ 13లక్షల మిగులు బడ్జెట్ నూ చూపించారు.

అయితే 2015 లో ఆమె నిరక్షరాస్యురాలు అన్న కారణం తో ఆమె ఎలక్షన్ లలో నిలబడటానికి అనర్హురాలుగా ప్రకటించటం తో మళ్ళీ ఆమె సర్పంచ్ అయ్యే అవకాశం లేకుండా పోయింది. చదువుకున్న సర్పంచ్ ఉన్నా కూడా తమ గ్రామం లో ఇంతమార్పు వచ్చి ఉండేది కాదని. హర్మడా గ్రామస్థులే అంటున్నారు. నరోటీ దేవీ కూడా ఈవిషయం పై సుప్రీం కోర్ట్ లో రిట్ వేషారు. ఆ కేసు నడుస్తోంది. ఇప్పుడామె ఆ గ్రామ సర్పంచ్ కాదు అయినా తను పని చేయటం మాత్రం మాన లేదు. ప్రతీరోజు పంచాయతీ ఆఫీసుకి ఆమె వెళ్ళాల్సిన అవసరం పడుతూనే ఉంటుంది. ఆమె ఆ గ్రామాన్ని తల్లి లా చూసుకుంటూనే ఉంది…..

(Visited 637 times, 24 visits today)