Home / Inspiring Stories / క్యాంపస్ ప్లేస్ మెంట్ల పేరుతో విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న కార్పోరేట్ కంపెనీలు.

క్యాంపస్ ప్లేస్ మెంట్ల పేరుతో విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న కార్పోరేట్ కంపెనీలు.

Author:

ఇంజనీరింగ్ విద్య అనేది ఇప్పుడు అందరికి ఎంత అందుబాటులో ఉందో మనకు తెలిసిందే, ఇంటర్మీడియేట్ అయిపోగానే ఇంకో కోర్స్ అనేది లేనట్లు చాలామంది ఇంజనీరింగ్ విద్య వైపు పరుగులు తీస్తున్నారు. ప్రతి సంవత్సరం లక్షల్లో ఇంజనీరింగ్ విద్యార్థులు పట్టా చేత పట్టుకొని సమాజంలోకి ఉద్యోగ వేటకి బయలుదేరుతున్నారు. కానీ కొందరు అదృష్టవంతులు తమ ఇంజనీరింగ్ పూర్తి కాకుండానే క్యాంపస్ ప్లేస్ మెంట్లలొ ప్రముఖ కంపెనీలలో ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు. క్యాంపస్ ప్లేస్ మెంట్లు ఎప్పటి నుండే ఉన్న ఇంతకు ముందు కేవలం ప్రఖ్యాత యూనివర్సిటీలలో మాత్రమే జరిగేవి..కానీ ఐ.టి ఎగుమతులు పరిధి పెరిగి ఎక్కువ ఉద్యోగులు అవసరం ఉండటంతో కంపెనీలు చిన్న చిన్న కాలేజీల వెంట పడ్డాయి. కానీ ఈ క్యాంపస్ ప్లేస్ మెంట్లు ఇప్పుడు విద్యార్థుల పాలిట శాపాలుగా తయారవుతున్నాయి.

campus placements in IT companies

భారతదేశం ఐ.టి కంపెనీలు రోజు, రోజుకు కొత్త కొత్త ప్రాజెక్టులు సంపాదిస్తూ మరిన్ని దేశాలకు విస్తరిస్తున్నాయి. అందులో భాగంగానే పలు కంపెనీలు భవిష్యత్ లో వచ్చే ప్రాజెక్టులను ముందే ఊహించి కొన్ని వేల మంది ఇంజనీరింగ్ విద్యార్థులను మంచి మంచి ప్యాకేజ్ ల ఆశజూపి క్యాంపస్ లలో రిక్రూట్ చేసుకుంటున్నాయి. విద్యార్థులు కూడా ఎంతో సంతోషంతో కంపెనీల ఆఫర్ ని ఒప్పుకొని ఇంజనీరింగ్ అయిపోగానే ఎప్పుడు ఎప్పుడు తమ కొత్త జాబ్ లో జాయిన్ అవుదామా అని ఎదురు చూస్తుంటారు. అక్కడి నుండే విద్యార్థుల కష్టాలు మొదలవుతున్నాయి.

కంపెనీ అనుకున్న ప్రాజెక్ట్ రాకపోయినా, కంపెనీ గత సంవత్సర ఆర్దిక ఫలితాలు తగ్గినా లేదంటే మరే కారణంతో చాలా కంపెనీలు రిక్రూట్ చేసుకున్న విద్యార్థులను వారి ఇంజనీరింగ్ అయిపోగానే తమ కంపెనీలో జాయిన్ చేసుకోవట్లేదు. ఎటువంటి కారణాలు చెప్పకుండా, ఎప్పుడు చేర్చుకుంటారో చెప్పకుండా నెలలకు నెలలు వారిని వెదీస్తున్నాయి. దానితో క్యాంపస్ ప్లేస్ మెంట్లలో సెలెక్ట్ అయిన విద్యార్థులు కంపనీ జాయినింగ్ లెటర్ కోసం వేచి చూడలేక, కొత్త జాబ్ వెతుక్కోలేక మనో వేదన కి గురి అవుతున్నారు. ఇలా సంవత్సరాలు ఎదురు చూసిన విద్యార్థులు కూడా ఉన్నారు. అన్ని రోజులు ఇంట్లో కూర్చొని కంపెనీ పంపించిన బుక్స్, సీడీ లు చూసి సాఫ్ట్‌వేర్ గురించి అవగాహన పెంచుకొని చివరికి ఉద్యోగంలో చేరిన తర్వాత చాలా రోజులు బెంచ్ మీదే ఉంచి తర్వాత అస్సైన్మెంట్ పరీక్షలు పెట్టి అందులో సరిగ్గా పర్ఫార్మ్ చేయలేదని ఉద్యోగం నుండి తీసేస్తున్నారు. ఇలా చేయడం వల్ల విద్యార్థులు తమ రెండు, మూడు సంవత్సరాల విలువైన సమయాన్ని కోల్పోవడమే కాకుండా చివరికి నిరుద్యోగి గా మిగులుతున్నాడు. ఈ బాధితుల్లో చిన్న కాలేజ్ విద్యార్థులతో పాటు ప్రముఖ ఐ.ఐ.టి కాలేజ్ విద్యార్థులు కూడా ఉన్నారని ఈ మధ్య వెలువడిన ఫ్లిప్కార్ట్ కంపెనీ వ్యవహారంతో బయటపడింది. లక్షలకు లక్షలు జీతాలు  ఇస్తామని ఐ.ఐ.టి కాలేజ్ విద్యార్థులను రిక్రూట్ చేసుకున్న ఫ్లిప్కార్ట్ సంస్థ ఆరు నెలల వరకు వారిని ఉద్యోగంలో చేర్చుకోలేదు. ప్రభుత్వాలకు వీటిపై అవగాహన లేకపోవడం, విద్యార్థులు ఎవరు ఈ కంపనీలపై ఫిర్యాదు చేసే సాహసం చేయకపోవడంతో ఇలాంటి కంపెనీల ఆటలు ఇలాగే కొనసాగుతున్నాయి. అందుకే ఇకముందు ఏదైన సంస్థ లో ఉద్యోగం వస్తే జాయినింగ్ డేట్ గురించి పక్క సమాచారం ఉంటేనే ఆ సంస్థ ఆఫర్ ని ఒప్పుకోండి.

(Visited 877 times, 8 visits today)