Home / Political / ఈ దేశాల్లో సోషల్ నెట్వర్కింగ్ సైట్లు నిషేదమని మీకు తెలుసా..?

ఈ దేశాల్లో సోషల్ నెట్వర్కింగ్ సైట్లు నిషేదమని మీకు తెలుసా..?

Author:

countries that blocked social media

ఫేస్‌బుక్.. ఫేస్‌బుక్.. స్మార్ట్‌ఫోన్‌లో ఏది ఉన్నా లేకపోయినా ఫేస్‌బుక్ మాత్రం ఉండాల్సిందే.. పొద్దున లేచింది మొదలు ఫేస్ బుక్ కే అతుక్కుపోతున్నాం మన దైనందిన కార్యక్రమాల్లో ఫేస్ బుక్ ఒక భాగమై పోయింది. ఫేస్ బుక్ లో అకౌంట్ల సంఖ్య రోజు రోజుకూ పెరిగి పోతూనే ఉంది. సోషల్ మీడియా ఒక ప్రత్యామ్న్యాయ విప్లవ వేదిక గా మారింది. ప్రభుత్వాలే కూలిపోతున్నాయి. భయంకర ఉగ్రవాద సంస్థలు సైతం ఇప్పుడు ఫేస్ బుక్ ని తమ నెట్వర్క్ విస్తరణ కోసం వాడుకుంటున్నాయి. అయితే ఫేస్‌బుక్ వాడని దేశాలు కొన్ని ఉన్నాయి తెలుసా..!? ఆ దేశాల్లోని అధ్యక్షులు ఉద్యమకారుల దెబ్బకి తట్టుకోలేక ఫేస్‌బుక్‌ని బంద్ చేశారు ఫేస్ బుక్ ని మాత్రమే కాదు మరికొన్ని సోషల్ మీడియా సైట్లను ఆ దేశ పౌరులు వాడకుండా బ్యాన్ చేసారు.

నార్త్ కొరియా: ప్రపంచం మొత్తం 5జీ నెట్ వర్క్ వెంట పడుతుంటే ఇక్కడ 3జీ నెట్ వాడుతుంటారు. అదీ ఫారిన్ నుంచి వచ్చే టూరిస్ట్‌లకు లిమిట్లో అందుబాటులో ఉంటుంది. ఈ దేశానికి ప్రపంచం గురించి పెద్దగా ఏమీ తెలియదు. ఈ దేశ ప్రజలు ఇంటర్నెట్ పెద్దగా వాడరు, అసలు ఇక్కడ ఇంటర్నెట్ కూడా కేవలం చాలా తక్కువ చోట్ల ఉంటుంది. ఇక ఆ దేశాధ్యక్షుడు కిమ్ జాంగ్ వున్ ఫేస్‌బుక్ పేజీని అసలు చూడలేము.

ఇరాన్ : ఇరాన్ లో ఫేస్‌బుక్ ను బ్యాన్ చేయాలని రాజకీయ నాయకులంతా పార్లమెంట్ లో తీర్మానించుకున్నారు. వీటివల్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అందుకే బ్యాన్ చేయాలని 2009లో పిలుపునిచ్చారు. అయితే ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాను అక్కడ బయటకు తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ దేశ అధ్యక్షుడు హసన్ రోహాని ట్విట్టర్ లో ఉన్నా కాని లేనట్లే ఉంటారు.

చైనా: మన పొరుగుదేశం చైనా గురించి ఇక చెప్పనే అవసరం లేదు.ఒకప్పుడు గూగుల్ నే బహిష్కరించి తమ సొంత సెర్చ్ ఇంజిన్ ని ఏర్పాటు చేసుకున్న ఈ దేశం.ఇప్పుడు ఫేస్‌బుక్ సహా అన్నీ సోషల్ మీడియాలనూ బ్యాన్ చేసి చేసి సొంతంగా సోషల్ మీడియాను రూపొందించుకునే పనిలో పడింది.

క్యూబా: ఎన్నొ కష్టాలకోర్చి ఆహారాన్ని కూడా రేషన్ లో అందించుకుంటూ ప్రభుత్వమే అన్ని చూసుకునే దేశం క్యూబా. ఇక్కడ జనాభాకు వచ్చే దానిలో బతికేదే చాలా కష్టం. అందుకని వీరు సమయాన్ని తినేసే ఎటువంటి సోషల్ మీడియా జోలికి వెళ్లరు. ఇక్కడ నెట్ వాడకానికి చట్టపరంగా అనేక సమస్యలు ఉండటంతో వాటి జోలికి వెళ్లే సాహసం చేయరు. అక్కడ గంటకు దాదాపు 6 నుంచి 10 డాలర్లు నెట్ బిల్లు ఉంటుంది. వారికి నెలకి వచ్చేది 20 డాలర్లు. అందుకోసం వారు ఫేస్‌బుక్ వాటిజోలికి వెళ్లరు.

బంగ్లాదేశ్: మన పొరుగునే ఉన్న బంగ్లాదేశ్ లో మొదట్లో ఫేస్‌బుక్ మీద ఎటువంటి ఆంక్షలూ లేకపోయినా.. 2010లో ఫేస్‌బుక్‌ని తమ దేశం లో బ్యాన్ చేసింది. తమ దేశాధ్యక్షుడికి చెందిన కార్టూన్ ఫేస్‌బుక్‌లో సైటైరికల్ గా వాడటంతో వారంతా ఈ సైట్ ను బ్యాన్ చేయాలని తీర్మానించారు. అయితే బ్యాన్ అయిన వారం రోజులకు ఫేస్‌బుక్ ఆ ఇమేజ్‌ని తొలగించింది. అయినా బంగ్లాదేశ్ దిగిరాలేదు ఫేస్‌బుక్ ని తమ దేశం లోకి అనుమతించలేదు ఇప్పటికీ నిషేధం అలానే కొనసాగుతోంది.

ఈజిప్ట్: 2011లో ఈజిప్ట్ అధ్యక్షుడు హోస్నీ ముబారక్ కొన్ని సోషల్ మీడియా సైట్లను బ్యాన్ చేశారు. వాటిల్లో ఈ ఫేస్‌బుక్ కూడా ఉంది. ఎందుకంటే అక్కడ ఉద్యమం జరుగుతన్న సమయంలో ఉద్యమకారులు ఎక్కువగా ఫేస్‌బుక్ వినియోగిస్తుంండటం. ప్రతీ సమాచారాన్ని ఉధ్యమకారులు సోషల్క్ మీడియాతో వేగంగా ప్రచారం చేస్తూండటం తో ప్రభుత్వ భవిస్యత్తే ప్రమాదం లో పడింది అందుకే ముబారక్ సోషల్ మీడియాను బహిష్కరించాలని చేయాలని తీర్మానించారు.

సిరియా: ప్రపంచం లోనే అత్యదికంగా సోషల్ మీడియా తో ప్రభుత్వాలకూ, పాలకులకూ ప్రమాదం ఉందని గుర్తించిన మొదటి దేశం సిరియా. సిరియాలో 2007 నుంచి ఫేస్‌బుక్ బ్లాక్ అయింది. రాజకీయంగా బషర్ అల్ అసద్ కి వ్యతిరేకంగా ఉద్యమకారులు చెలరేగిపోవడం..ఆయన్ని గద్దె దింపాలని కొత్త ఉద్యమం లేవదీయడంతో చిర్రెత్తుకొచ్చిన అసద్ అన్ని సోషల్ మీడియా సైట్లకు చెక్ చెప్పారు. అయినప్పటికీ సిరియన్లు కొన్ని ప్రొక్సీ సర్వర్ల ద్వారా కొన్ని సోషల్ మీడియా సైట్లను ఇప్పటికీ వాడుతున్నారు.

పాకిస్తాన్: మన దాయాది దేశమైన పాకిస్తాన్ లోనూ అయిదేళ్ళుగా ఫేస్‌బుక్ మీద నిషేదం కొనసాగుతొఈంది. మొదట్లో సోషల్ నెట్వర్కింగ్ సైట్ అయిన ఫేస్‌బుక్ వినియోగం పాక్ లో బాగానే ఉండేది. అయితే పాక్ కూడా బంగ్లాదేశ్ తరహా లోనే ప్రజల భద్రతా, ప్రభుత్వ వ్యతిరేకత ఉధ్యమాల భయం వంటి కారణాలతో కాదు గానీ ఆన్లైన్‌లో పాకిస్తాన్‌పై కార్టూన్లతో విమర్శలు గుప్పించడం వల్ల ప్రభుత్వం 2010లో సోషల్ మీడియాను బంద్ చేసింది. ఇప్పటికీ అక్కడ కొన్ని సైట్లపై నిషేధం కొనసాగుతోంది.

(Visited 1,054 times, 35 visits today)