కొరియర్ బాయ్ వచ్చెనా………!!!!!!

Author:

నితిన్, యామి గౌతమ్ జంటగా నటించిన “కొరియర్ బాయ్ కల్యాణ్” సినిమా అప్పుడెప్పుడో షూటింగ్ పూర్తి చేసుకొని గౌతమ్ మీనన్ ఆర్దిక పరిస్థితుల కారణంగా రిలీస్ కాకుండా ఉండిపోయింది. ఆ సినిమా విషయంలో గత రెండు సంవత్సరాలుగా ఎటువంటి కదలిక లేదు, ప్రేమ్ సాయి డైరెక్షన్లో తెలుగు, తమిళ భాషల్లో ఒకటే సారి నిర్మితమయిన ఈ సినిమా “ప్రీమియమ్ రష్” అనే ఇంగ్లీష్ సినిమా నుండి ఇన్‌స్పైర్ అయ్యారని టాక్.
ఇప్పుడు ఈ సినిమా గురించి పాసిటివ్ న్యూస్ ఒకటి బయటకి వచ్చింది. “కొరియర్ బాయ్ కల్యాణ్” సినిమా నవంబర్ 27న రిలీస్ అవుతుందనీ ముందు ప్రకటించారు, కానీ తాజా సమాచారం ప్రకారం సినిమాను సెప్టెంబర్ 11నే రిలీస్ చేస్తారట. ఆడియో మాత్రం ఆగస్ట్ 20న బయటకి వస్తుంది. ఇలా రిలీస్ డేట్లు ముందుకు, వెనుకకు మార్చే బదులు ఒక కరెక్ట్ డేట్ చెబితే మూవీ లవర్స్ ఫిక్స్ అవుతారుగా….

(Visited 68 times, 39 visits today)

Comments

comments