సిఆర్‌పిఎఫ్‌లో అసిస్టెంట్ సబ్‌ఇన్‌స్పెక్టర్ పోస్టులకి నోటిఫికేషన్ విడుదల..!

Author:

ఇంటర్మీడియట్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) లో పోలీస్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్ పాసై 18 నుండి 25 ఏళ్ళ వయసు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అర్హులు. మొత్తం 219 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసారు, ఫిజికల్ టెస్ట్, రాత పరీక్ష, మెడికల్ టెస్ట్ ల ద్వారా అభ్యర్ధులని ఎంపిక చేయనున్నారు, మార్చి 27 వ తేదీ నుండి ఏప్రిల్ 25 వ తేదీ వరకు దరఖాస్తులని స్వీకరిస్తారు, అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి..

crpf recruitment for asi

మొత్తం ఖాళీలు: 219(జనరల్‌ అభ్యర్థులకు 75 పోస్టులు ఉన్నాయి).

విద్యార్హత: ఇంటర్‌ పూర్తిచేసి ఉండాలి.

వయసు: దరఖాస్తు నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు ఫీజు: జనరల్‌ కేటగిరీకి చెందిన పురుషులకు రూ.100(ఎస్సీ/ ఎస్టీ/ ఎక్స్‌ సర్వీస్‌మన్/ మహిళలకు ఫీజు మినహాయింపు ఉంది)

ఎంపిక విధానం: ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌, డాక్యుమెంటేషన్, రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్ ద్వారా.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: మార్చి 27 నుంచి

ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఏప్రిల్‌ 25

రాత పరీక్ష: జూలై 16న

పూర్తి నోటిఫికేషన్ :  Job Notification
మరిన్ని వివరాల కోసం www.crpf.nic.in వెబ్ సైట్ లోకి వెళ్ళండి.

(Visited 1,043 times, 120 visits today)

Comments

comments