EDITION English తెలుగు
Home / Latest Alajadi / CRPF లో 2945 పోలీస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల.

CRPF లో 2945 పోలీస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల.

Author:

పదవ తరగతి అర్హతతో  కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) లో 2945 మంది పోలీస్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. పదవతరగతి పాసైన వాళ్లు ఈ సీఆర్ పీఎఫ్ ఉద్యోగాలకు అర్హులు. టెక్నికల్ విభాగాల్లో అదనపు అర్హతలు కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుందని సీఆర్ పీఎఫ్ ప్రకటించింది. 10వ తరగతితో పాటు హైవీ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్న అభ్యర్థులకు సంబంధిత ఖాళీలలో అవకాశం ఉంటుందని తెలిపింది.

crpf recruitment for the post of constable

దేశవ్యాప్తంగా నిర్వహిస్తోన్న ఈ రిక్రూట్ మెంట్ లో ఆంధ్రప్రదేశ్ కి 137 పోస్టులు ఉండగా.. తెలంగాణ రాష్టానికి 100 ఖాళీలు ఉన్నట్టు ప్రకటించింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో ధరఖాస్తు చేసుకోవాలని తెలియజేసింది. వివరాలకు www.crpf.nic.in  వెబ్ సైట్ లో సందర్శించవచ్చని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) తెలిపింది. ఈ పోస్టులకి  ఆన్ లైన్ లో జనవరి 31 నుండి మార్చి 1 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలి.

ఉద్యోగ వివరాలు:

ఖాళీల సంఖ్య: 2945

పోస్టులు: CRPF పోలీస్( డ్రైవర్స్ అండ్ టెక్నికల్ )

అర్హత: SSC(టెక్నికల్ కోర్సులు, డ్రైవర్స్)

ప్రారంభ తేది: 31- 01- 2017

చివరి తేది: 01- 03- 2017

ధరఖాస్తు విధానం: ఆన్ లైన్

(Visited 1,436 times, 28 visits today)