Home / Latest Alajadi / రేపటి నుండి అక్టోబర్ 13 వరకు దసరా సెలవులు.

రేపటి నుండి అక్టోబర్ 13 వరకు దసరా సెలవులు.

Author:

ప్రతి సంవత్సరం సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలలో వచ్చే దసరా పండుగ అంటే చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరికి ఇష్టమైన పండుగ, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో దసరా పండగకి ప్రత్యేకత ఉంది, దసరా కి ముందు బతుకమ్మ పండుగని తెలంగాణ ప్రజలు జరుపుకుంటారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత బతుకమ్మ పండుగని రాష్ట్ర పండుగగా గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ నిధులని కేటాయించి జరుపుతుంది.

dasara-holidays

బతుకమ్మ, దసరా మరియు మొహరం పండుగల సందర్భంగా సెప్టెంబర్ 30 నుండి అక్టోబర్ 13 వరకు తెలంగాణ ప్రభుత్వం సెలవులని ప్రకటించింది, తెలంగాణలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలుకి ఈ సెలవులు వర్తిస్తాయి, ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీలకి, డిగ్రీ కాలేజీలకి ఈ నెల 30 నుండి అక్టోబర్ 12 వరకు సెలవులు ప్రకటించారు, ప్రయివేట్ పాఠశాలలు, జూనియర్ కాలేజీలని,డిగ్రీ కాలేజీలని ఈ సెలవు రోజుల్లో నడిపిస్తే ఆ పాఠశాల,కాలేజీ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటాం అని విద్య శాఖా డైరెక్టర్ ప్రకటించారు.

(Visited 582 times, 47 visits today)