Home / Entertainment / జనాలని పట్టుకున్న “పింగా” మ్యానియా.

జనాలని పట్టుకున్న “పింగా” మ్యానియా.

Author:


సంజయ్ లీలా బన్సాలి మరో సారి తన క్లాసికల్ సాంగ్ ని గుర్తుకు తెచ్చాడు.దేవ్ దాస్ సినిమాలో ఉండే “డోలారే” స్థాయిలో అంతే అందంగా తీసాడీ పాటని. యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోందీ సాంగ్ ‘భాజీరావ్ మస్తానీ” ఇప్పుడు విడుదలకు సిద్దమౌతోన్న సినిమాల్లో క్రేజీయెస్ట్ లిస్ట్ లో ఉన్న సినిమా ఇది. భారీ హ౦గులతో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఈ సినిమా షారుఖ్ ఖాన్ నటిస్తున్న “దిల్ వాలే” కి పోటిగా అదే రోజు విడుదల కాబోతు౦ది, దా౦తో సినిమాను సేఫ్ సైడ్ లో నడపడానికి దర్శకుడు స౦జయ్ లీలా భన్సాలీ కూడా రన్ వీర్ సి౦గ్ ,దీపిక ల మధ్య మ౦చి హాట్ హాట్ సన్నివేశాలను ఓ రొమా౦టిక్ సా౦గ్ ను ప్లాన్ చేశాడ౦ట. ఇవి అభిమానులను గిలిగింతలు పెట్టడమే కాకు౦డా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తాయని భన్సాలీ నమ్మక౦. దాదాపు120 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇది కూడా బాహుబలి లానే పీరియాడికల్ సినిమా. రణవీర్ సింగ్, దీపికా పదుకునే, ప్రియాంక చోప్రాలు కలిసి నటిస్తున్న ఈ చిత్రంపై ప్రస్తుతం సినీ జనాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

రణవీర్ సింగ్ దీపికా పదుకునే లాంటి బాలీవుడ్ హాట్ కపుల్ ఆ సినిమాలో ఓ హాట్ సీన్ కోసం దాదాపు 12 గంటల సమయం తీసుకున్నారట.ఇంకో విషయం ఏమిటంటే ఇందులో దీపికా ది రహస్య ప్రేమికురాలి పాత్ర అట. బాలీవుడ్ బాహుబలి సినిమాగా రాబోతున్న భాజీరావ్ మస్తానీ రిలీజ్ చేసిన ఫస్ట్ పోస్టర్ నుండి భారీ అంచనాలు ఏర్పడేలా చేసింది.ఆన్ స్క్రీన్ కాకుండా ఆఫ్ స్క్రీన్లో కూడా రణవీర్ దీపిక పీకల్లోతు ప్రేమలో ఉన్నారన్న సంగతి అందరికి తెలిసిందే. మీడియా ముందు కూడా వీరు చాలా సార్లు కంటపడ్డారు. రామ్ లీలాకు ముందు ఇద్దరు ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేసిన రణవీర్ ఆ సినిమా నుండి దీపికానే పట్టుకున్నాడు. దీపికా కూడా రణవీర్ తో సన్నిహితంగా ఉంటుంది. సంజయ్ లీలా బన్సాలి దర్శకత్వం లోనే వచ్చిన రాం లీలా సినిమాలో కూడా హాట్ హాట్ సీన్లలో నటించి ఆడియెన్స్ ని అలరించిన ఈ ఇద్దరు. ఇప్పుడు బాజీరావ్ మస్తానీ లో కూడా అదే విధంగా అలరించనున్నారన్న మాట.
సినిమా ప్రమోషన్స్ అన్నీ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించె లాగానే ఉన్నాయి. . ఇందులో రెమో డిసౌజా కొరియోగ్రఫీ అందిస్తున్న ఓ స్పెషల్‌ సాంగ్‌ ఉంది. ఈ పాటలో దీపిక,రణబీర్‌,ప్రియాంక ముగ్గురు కనిపిస్తారు. కానీ మధ్యలో ఓ ఫ్రేమ్‌ హఠాత్తుగా సర్‌ ప్రైజ్‌ చేస్తుంది. అయితే తనతో పాటే ఇరువైపులా రెండు పులులు నడిచి వస్తుంటాయి ఈ షాట్ కోసం గ్రాఫిక్స్ చేయకుందా నిజం పులలని వాడారని ఒక టాక్. ఇక తాజాగా విడుదలైన ‘పింగా’ అనే సాంగ్ వీడియో దుమ్ము రేపుతోంది. ఈ పాట చూసిన వారందరూ దేవ్ దాస్ లో ని డోలారే పాట ని గుర్తు చేసుకుంటున్నారు. ఇందులో దీపికా, ప్రియాంకాల డాన్స్ అదిరిపోయింది. ఈ పాటకు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఈ పాట యూట్యూబ్ లో రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే ఈ పాటను 497,262 మంది వీక్షించారు.

(Visited 277 times, 63 visits today)