Home / Inspiring Stories / తెలియని నంబర్ కాల్ లిఫ్ట్ చేయనందుకే ఐపీఎస్ ఆఫీసర్ కి ఇంత శిక్షా.

తెలియని నంబర్ కాల్ లిఫ్ట్ చేయనందుకే ఐపీఎస్ ఆఫీసర్ కి ఇంత శిక్షా.

Author:

Lady DSP Transferred

రాజకీయ వ్యూహాల్లో నిజాయితీ గల ఆఫీసర్లు బలవ్వటం కొత్తేం కాదు మనకు. ఒక రాజకీయ నాయకుడి అక్రమ ఇసుక క్వారీ పై చర్యలు తీసుకున్నందుకు ఒక ఎమ్మార్వోని చంపేసారు.మరో చోట ఇంకో లేడీ ఆఫీసర్ మీద దాడి చేసారు. ఇంక మనకు తెలియని సంఘటనలు అనేకం మొన్నటికి మొన్న “వ్యాపం” కుంబకోణంలో ఒక మంత్రిగారి హస్తం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి ఆ వెంటనే ఆ కేసుతో సంబందం ఉన్న వాళ్ళంతా దా 40 మంది మరణించారు అన్నీ సాధారణ మరణాలే. దాని వెనక ఎవరున్నారనేది బహిరంగ రహస్యం. మన రాష్ట్రంలోనే జరిగిన ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో IAS లు ఇరుక్కున్నారు శిక్షలూ అనుభవిస్తున్నారు. ఐతే వారి మీద వచ్చిన అవినీతి ఆరోపణల వెనుక జరిగిన రాజకీయపు ఆట మనందరికీ తెలుసు.

అయితే తన తప్పేంటో కూడా అర్థం కాకుండానే ఒక లేడీ ఆఫీసర్ శిక్షకు గురయ్యారు. 24 గంటల్లో రెండు వేరు వేరు ప్రాంతాలకు బదిలీ చేయబడ్డారు. ఇంతకీ ఆమె చేసిన తప్పేమిటీ అంటే ఒక తెలియని నంబర్ నుంచి వచ్చిన కాల్ ని అటెండ్ అవక పోవటమే. ఎందుకంటే అది ఒక మంత్రి గారి కాల్. పని బిజీలో ఉండి ఆమె తన ఫోన్ లిఫ్ట్ చేయనందుకు ఆమె పై వ్యక్తిగత ద్వేషం తో ఈ చర్య తీసుకున్నారు. అసలు విషయం ఏమిటంటే… కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారి జిల్లాలో గల కుడ్లిగిలో విధులు నిర్వహిస్తున్నారు అనుపమ. ఒక రోజు ఆమె డ్యూటీలో బిజీగా ఉంది. అంతలోనే ఆమె ఫోన్ కు కొత్త నెంబర్ నుండి కాల్ వచ్చింది.డ్యూటీ హడావుడిలో తెలియని నంబరే కదా అని ఆమె కాల్ లిప్ట్ చేయలేదు.అయితే దురదృష్టవశాత్తూ ఆ ఫోన్ వచ్చింది ఒక మంత్రి గారి నుండి. ఒక లోకల్ దందాలో చర్యలు తీసుకున్నందుకు ఆ నిందితులు మంత్రి గారి దగ్గర సెటిల్మెంట్ కొసం వెళ్ళటం తో ఆ విషయం మాట్లాడేందుకని సదరు మంత్రిగారు కాల్ చేసారట.ఐతే ఆ ఫోన్ అనుపమా ఐపీఎస్ లిఫ్ట్ చేయకపోవటంతో నా ఫోన్ నే లిఫ్ట్ చేయదా..? అంటూ కోపంతో ఊగిపోయారు మంత్రిగారు.అంతే ఆమె మీద అనధికారిక “క్రమశిక్షణా రాహిత్య” చర్యలకు ఆదేశించారు.ఫలితం రెండో రోజే ఆమెకు వేరే చోటికి ట్రాన్స్ ఫర్ చేస్తున్నట్టు ఆదేశాలొచ్చాయ్. ఆమె అక్కడికి వెళ్ళి చార్జ్ తీసుకునే లోపే మరో ఆర్డర్ అప్పటికప్పుడే అక్కన్నుంచి మళ్ళీ వేరే చోటికి ట్రాన్స్ ఫర్ చేస్తున్నట్టు చెప్పే పత్రాలు ఆమె చేతికి రావటంతో షాక్ తిన్నారు. అప్పుడు ఆమెకు అర్థమయ్యింది. ఈ దేశంలో ప్రజలనూ,నాయకులనూ రక్షించటమే కాదు వారి వ్యక్తిగత ఈగో లను కూడా తాము భరించటం తప్ప ఇంకేం చేయలేం అని….

తొమ్మిదో తరగతి కూడా పాస్ అవ్వని ఒక యువనేత కింద ఒక IAS ఆఫీసర్ చేతులు కట్టుకుని నిలబడాలి. కనీస విలువలు కూడా లేకుండా ఒక నాయకుడు బూతులు తిడుతూంటే మరో ఐపీఎస్ పల్లెత్తు మాట అనకుండా తలవంచుకొని పడాలి. తమ చదువూ,సామజికంగా తమకుండే వ్యక్తి గత మర్యాదనీ వదిలేసి తానో తప్పుచేసిన వాడిలా పోలీస్ అయినందుకే ప్రజల మధ్య “మానసికంగా శిక్షించబడాలి” ఇక ఎప్పటికీ ఇంతేనా? ఇలా ఒక ప్రశ్న మనలో రానంత కాలం మన నాయకులూ మారరు మన కోసం నిజానికి నిజాయితీగా పని చేసే “కొందరు” అధికారులు ఇలా బలి కావటమూ ఆగదు….

Must Read: తనకు రావాల్సిన దాంట్లో 50 లక్షలు తగ్గించుకున్న పవన్ కళ్యాణ్.

(Visited 3,379 times, 24 visits today)