EDITION English తెలుగు
మూవీ రివ్యూ: 'పేట'   మూవీ రివ్యూ:వినయ విధేయ రామ   మూవీ రివ్యూ:యన్.టి.ఆర్‌ -కథానాయకుడు   హైదరాబాద్ లో రోబో కిచెన్   ఈ క్యాబ్ డ్రైవ‌ర్ రాత్రి పూట అవ‌స‌రం ఉన్న వారిని ఉచితంగా క్యాబ్‌లో ఇంటి దగ్గ‌ర దింపుతాడు. ఎందుకో తెలుసా..?   మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే మాటకు కరెక్ట్ అర్థం ఈ జంటే... వీరి కథ వింటే ఆశ్చర్యపోవాల్సిందే. రియల్ స్టోరీ..!   మూవీ రివ్యూ: పడి పడి లేచె మనసు   పొరిగింటి రెండేళ్ల చిన్నారి కోసం...చనిపోతూ ఈ తాత ఇచ్చిన విలువైన బహుమతి ఏంటో తెలుసా..?   కేంద్రం సంచలన నిర్ణయం...! ఇకపై ఆధార్ అడిగితే కోటి జరిమానా...జైలు శిక్ష! వివరాలు ఇవే!   ఎంతపెద్ద జ్వరమైనా ఈ ట్రిక్ పాటిస్తే సింపుల్ గా తగ్గిపోద్ది.! కావాల్సింది పెసరపప్పు ఒక్కటే.!
Home / Entertainment / సినిమా రివ్యూ : దేవదాస్

సినిమా రివ్యూ : దేవదాస్

Author:

సీనియర్‌ హీరో నాగార్జున, నేచురల్ స్టార్‌ నాని కాంబినేషన్‌ లో తెరకెక్కిన మల్టీస్టారర్‌ సినిమా దేవదాస్‌. చాలా కాలం తరువాత వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌లో అశ్వనీదత్‌ స్వయంగా నిర్మాతగా తెరకెక్కించిన ఈ సినిమాకు శ్రీరామ్‌ ఆదిత్య దర్శకుడు. భలే మంచి రోజు, శమంతకమణి లాంటి డిఫరెంట్ సినిమాలను తెరకెక్కించిన శ్రీరామ్‌ ఆదిత్య.. నాగ్‌, నాని లాంటి స్టార్లను డైరెక్ట్ చేస్తుండటంతో దేవదాస్‌పై మంచి హైప్‌ క్రియేట్ అయ్యింది. మరి ఆ అంచనాలను శ్రీరామ్‌ ఆదిత్య అందుకున్నాడా..? మల్టీస్టారర్‌గా తెరకెక్కిన దేవదాస్‌ సక్సెస్‌ అయ్యిందా..? నాగ్‌,నానిల కాంబినేషన్ ఏ మేరకు అలరించింది..?

కథ:

అనాథ అయిన దేవా (నాగార్జున) ను చేరదీస్తాడు డాన్ (శరత్ కుమర్) ప్రపంచానికి తన మొహం తెలియకుండా దేవా ఓ డాన్ గా ఎదుగుతాడు. అయితే.. మరో డాన్ డేవిడ్ (కునాల్ కపూర్) శరత్ కుమార్ ను చంపేస్తాడు.వాళ్ల నాన్న ను చంపిన వాళ్లమీద పగ తీర్చుకునే క్రమంలో దాస్ (నాని) అనే డాక్టర్ తో పరిచయం ఏర్పడుతుంది.. దేవా ను మార్చాలనే దాస్ ప్రయత్నం సక్సెస్ అయిందా..తన నాన్నను చంపిన వాళ్లమీద దేవా పగతీర్చుకున్నాడా లేదా  అనేది మిగిలిన కథ.

అలజడి విశ్లేషణ :

ఇద్దరు హీరోలు కలిసి చేసే హంగామా సగటు కమర్షియల్ ప్రేక్షకుడికి పాసైపోతుంది. ఓ మంచి సినిమా చూసిన ఎక్స్ పీరియన్స్ మాత్రం ఇవ్వదు..కమర్షియల్ ఎంటర్ టైనర్ కాబట్టి సినిమా చూసినంత సేపు అలా వెళ్లిపోతుంది తప్ప కథ, కథనాలు చెక్ చేసుకుంటే.. ‘‘దేవదాస్’’ లో ఏమి కనిపించదు. ఈ విషయంలో మాత్రం దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య నే తప్పపట్టాలి. ఇద్దరు మంచి స్టార్ లను పెట్టుకుని, సింపుల్ లైన్ తో ఓ సాదాసీదా సినిమా తీసాడు కానీ.. మంచి కథనం రాసుకోవడంలో విఫలమయ్యాడు. సినిమా మొదలైనప్పటి నుంచి ఫ్లాట్ గా వెళుతుంది తప్ప.. వావ్ అనిపించే మూమెంట్ ఎక్కడా కనిపించదు. సీన్లల్లో బలం కొరవడింది. కామెడీ ఉంది కానీ పేలలేదు, ఎమోషన్ ఉంది కానీ టచ్ అవ్వలేదు. రొమాన్స్ ఉంది కానీ ఫీల్ లేదు. సో ఇలా ప్రతీది చప్పగా సాగిపోతుంది..ఇలాంటి కథ,కథనాలకు నాగ్,నాని లిద్దరు ప్రధాన బలమయ్యారు. తమ నటన, స్క్రీన్ ప్రెజెన్స్ లతో అలరించి ఆడియన్స్ ను మాగ్జిమమ్ ఎంటర్ టైన్ చేశారు. టైమ్ పాస్ కోసం అయితే ఓకే కానీ, ఓ మంచి సినిమా చూద్దామని వెళితే ఈ ‘‘దేవదాస్’’ లు నిరాశపరుస్తారు.

ప్లస్ పాయింట్స్‌ ;

  • నాగార్జున, నానిల నటన
  • కొన్ని ఎమోషనల్‌ సీన్స్‌
  • కామెడీ
  • సినిమాటోగ్రఫి

మైనస్‌ పాయింట్స్‌;

  • ప్రీ క్లైమాక్స్‌
  • కొన్ని బోరింగ్‌ సీన్స్‌     

 పంచ్ లైన్: టైమ్ పాస్

(Visited 1 times, 1,070 visits today)