Home / Inspiring Stories / ఈ చిన్ని వస్తువులే మహిళలను ఆపద నుండి రక్షిస్తాయని తెలుసా?

ఈ చిన్ని వస్తువులే మహిళలను ఆపద నుండి రక్షిస్తాయని తెలుసా?

Author:

ప్రతిరోజూ మహిళలపై జరుగుతున్న ఆకృతాలను వార్తలలో చూస్తూనే ఉన్నాం. ఇదివరకటికంటే ఈ తరహా నేరాలు పెరుగుతూనే ఉన్నాయి. రాత్రుల్లని కాదు పగలు కూడా.. ఎక్కడో మారుమూలలో కాదు పట్టనం నడిబొడ్డు రోడ్డు మీద, ఆఫీసుల్లోనూ ఆఖరికి సొంత ఇంట్లోనూ ఆడవాళ్ళకి రక్షణ లేదు. ఇంట్లో ఉండీ గ్యాస్ డెలివరీబాయ్ కీ, పిజ్జ డేలివరీ అబ్బాయికీ భయపడాలి మరెలా? మహిళ తనని తాను రక్షించుకోవటం ఎలా?? అంటే ఇదిగో కొన్ని మార్గాలున్నయి. ఈ మహిళా దినోత్సవానికి ఆమె కు ఒక చీరో, నగలో ఇంకేదో కాదు ఆమెను రక్షించే ఈ గాడ్జెట్స్ ని బహుమతిగా ఇవ్వండి. స్త్రీ రక్షణ కోసం మార్కెట్ లో ఉన్న పరికరాల గురించి కనీసం ఆమెకు సమాచారం ఇవ్వండి చాలు. స్త్రీ ఆపద సమయాల్లో రక్షణ కోసం వాడే ఆయుధాలు మరీ ప్రాణాంతకం కావు గానీ ఆ పరిస్తితులనుంచి తనను తాను కాపాడుకునేందుకు పనికి వస్తాయి….

స్టన్ గన్: స్టన్‌గన్ల ద్వారా దాడిచేసి ఎదుటి వ్యక్తికి విద్యుత్తు షాక్‌ కొట్టేలా చేయడం. ఎలక్ర్టోడ్ల సాయంతో ఆ మనిషికి గుచ్చుకున్న వెంటనే భారీ షాక్‌కు గురై దాదాపు 10నుంచి 20 నిమిషాల పాటు అచేతనంగా పడిపోతాడు. ఆ సమయంలో ఆ మహిళ పారిపోయే సమయం చిక్కుతుంది. స్టన్ గన్ అంటే పెద్ద ఆయుధం లాంటి వస్తువేం కాదు. సాధారణంగా హ్యాండ్‌బ్యాగుల్లో ఉండే లిప్‌స్టిక్‌ అంత సైజులోనూ అందుబాటులో ఉంటున్నాయి. వాటిలో 3 మిలియన్ల వోల్డ్‌ల విద్యుత్తు ఉంటుంది. 4.1మిల్లీయాంప్‌లు షాక్‌కు గురిచేసేలా చేస్తాయి. దూరంలో ఉండగానే వారికి ఎలక్ర్డోలు తాకేలాచేయొచ్చు. ఆపదకాలంలో ఆదుకోవడం తోపాటు దీన్ని టార్చ్ లాగా కూడా వాడుకోవచ్చు. ఇదే తరహాలో టార్చిలైట్‌ ఆకారంలో ఉండేవి, మరికొన్ని అరచేతిలో ఇమిడి పోయేవి వస్తుంటాయి. దాడిచేసే వ్యక్తికి నేరుగా అంటిస్తే షాక్‌కు గురిచేస్తాయి. వీటి ధర రూ.800 నుంచి రూ.1500 వరకు ఉంటాయి. ఫ్లిప్ కార్ట్ వంటి ఆన్లైన్ మార్కెట్లో 300-500 లలో కూడా ఉన్నాయి.

stun gun

క్యాబ్‌తో సేఫ్‌ జర్నీ: మహిళల మీద క్యాబ్ డ్రైవర్లు దాడులకు పాల్పడ్డ సంఘటనలూ ఎన్నో ఉన్నాయి. దానికి ప్రత్యామ్నాయంగా అంతర్జాతీయ, దేశీయ క్యాబ్‌ సంస్థలైన ఉబర్‌, ఓలా వంటి సంస్థలు వారి యాప్‌లను కొత్తతరహాలో అందిస్తున్నాయి. మన మొబైల్‌లో క్యాబ్‌ బుక్‌ చేస్తే ఏ రూట్‌లో వాహనం వెళుతుందో ముందే మనకు చూపిస్తాయి. అలా ఇంటికి కారెళ్లి ప్రయాణం మొదలు పెట్టిన దగ్గర నుంచి వాహన కదలికలు మనం ఉన్న చోట నుంచే గమనించొచ్చు. ఒక వేళ నిర్దేశిత మార్గం మారితే వెంటనే సంబంధిత డ్రైవర్‌ నెంబర్‌కు కాల్‌చేసి అడగొచ్చు.. ఒకవేళ స్పందించకపోతే ఆయా సంస్థల కస్టమర్‌కేర్లను సంప్రదించొచ్చు. అలా మనం దూరంగా ఉండి కూడా క్యాబ్‌లో సేఫ్‌ జర్నీ అందించొచ్చు. ఒకవేళ ఒంటరి మహిళ మొబైల్‌లో క్యాబ్‌బుక్‌ చేసుకోవాల నుకున్నా కొన్నిప్రత్యేక జాగ్రత్తలు తీసుకు న్నారు. మనం వెళ్లాల్సిన గమ్యస్థానాన్ని నిర్దేశించి క్యాబ్‌ బుక్‌ చేసుకున్నవెంటనే వాహన, డ్రైవర్‌ వివరాలు పూర్తి సమాచారం మనకు చూపుతుంది. వెంటనే దాంట్లో షేర్‌ ఆప్షన్‌ ఉంటుంది. దాన్ని క్లిక్‌ చేసి మన ఆత్మీయులకు ఆ వివరాలు పంపి ప్రయాణం చేయొచ్చు. మన మొబైల్‌లో నుంచే మార్గం దాటి వేరే చోటకు వెళుతున్న వెంటనే అప్రమత్తంఅవ్వొచ్చు. ఇలా క్యాబ్‌లతో ప్రయాణం కూడా యాప్‌లతో రక్షణగా వెళ్లొచ్చు.

cab sos

పెప్పర్‌ స్ర్పే: దేశంలో నిర్భయ ఘటన తరవాత పెప్పర్‌ స్ర్పేలు బాగా ప్రాచుర్యంలోకొచ్చాయి. వీటి లోనే కొత్తగా పెప్పర్‌ స్ర్పేగన్స్‌ అందుబాటు లోకొచ్చాయి. వ్యక్తి 6 నుంచి 10 అడుగుల దూరం ఉండగానే వారిపై ఈ గన్‌ సాయంతో దాడిచేయొచ్చు.. పెప్పర్‌ ద్రావణంతో నిండిన బాటిల్‌ను బుల్లెట్లలా లోడ్‌ చేయాల్సి ఉంటుంది. అది టార్చిలైట్‌లా కూడావాడు కోవచ్చు. వీటితోపాటు వ్యక్తిగత రక్షణ కోసం దువ్వెన, పెన్‌లలో ఇమిడిఉండే చిన్నపాటి కత్తులాంటివి కూడా హ్యాండ్‌ బ్యాగుల్లో పెట్టుకోవచ్చు. ఎదుటి వ్యక్తుల నుంచి ఎదుర్కొనేందుకు రాడ్లకిట్లు కూడా అందుబాటు లోకొచ్చాయి. చూడ్డానికి అరచేతిలో ఇమిడిపోయేలా ఉన్నా వాటిని తెరిస్తే తలపైమోదే రాడ్లలా మారిపోతా యి. ఇప్పుడు ఈ వస్తువులన్నీ ఆన్‌లైన్‌ వేదికగా అమ్మకానికి ఉన్నాయి. ఒక్క క్లిక్‌ కొడితే చాలు ఇంటికి డెలెవరీ చేయడానికి ఆయాసంస్థలు సిద్ధంగా ఉన్నాయి. అయితే అధిక హాని చేసే వాటిని వాడటం వల్ల మనుషులకు తీవ్ర హాని జరిగితే మళ్ళీ చట్ట పరమైన సమస్యలుంటాయి కాబట్టి. మామూలువి ఎంచుకోవటం మంచిది. ఆ వివరాలు ఆయా వస్తువులమీదే రాసి ఉంటాయి.

Pepper spray

అలారం కీ చెయిన్స్: జనరద్దీ ప్రాంతాల్లోనూ కళ్లు మూసి తెరిచేలోపు రోడ్డు మీదున్న యువతిని బలవంతంగా కారులో ఎక్కించుకెళ్లే సందర్భాలు చాలానే వినుంటాం. పక్కవారికి తెలియకుండా అమ్మాయిల కిడ్నాప్‌లను అడ్డుకోవడానికి అలారం మోత మోగించే గాడ్జెట్లు వచ్చేశాయి. అవి నిత్యం వాడుకునే కీచైన్‌లా, హ్యాండ్‌ బ్యాండులా ఉంటాయి.. కాని సమయం వచ్చినప్పుడు అవే చుట్టుపక్కల పరిసరాలను అప్రమత్తం చేయడానికి ఉపయోగడపతాయి. వాటికి ప్రత్యేకంగా ఎస్‌ఓఎస్‌ బటన్‌ ఉంటుంది. దాన్ని ఒత్తితే చాలు చెవులు చిల్లులు పడేలా శబ్దం చేస్తుంది. వాటి తీవ్రత దాదాపు 110 డెసిబుల్స్‌ వరకు ఉంటుంది. దాంతో అక్కడ ఉన్నవారు అప్రమత్తం అయ్చేలా చేయొచ్చు. వీటి ధర కూడా రూ.1000లోపు ఉంటుంది. కొన్ని రకాల అలారాలైతే మోతతోపాటు ముందుగా ఎంచుకున్న మొబైల్‌ నెంబర్లకు సందేశం కూడా పంపుతాయి.

alarm keychain
ఈ మహిళా దినోత్సవ కానుకగా వీటిల్లో ఏదో ఒకటి మీ సోదరికో, భార్యకో బహుమతిగా ఇవ్వండి. ఈ అంశాలమీదా కొత్త యాప్ లమీదా సమచారం సేకరించి వారికి ఇవ్వండి. వారి రక్షణ కంటే మీకు మరేదీ ముఖ్యం కాదని వారికి చెప్పండి. హ్యాపీ ఉమన్స్ డే…!

(Visited 666 times, 41 visits today)