ఈ రోజు అర్ధరాత్రి నుండే “ధృవ” ఆడియో హంగామా.

Author:

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం ‘ధృవ’. డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వస్తున్నా ఈ సినిమా ఇప్పటికే ఒక్కపాట మినహా షూటింగ్ పూర్తీ చేసుకుంది. ఒకవైపు చివరి సాంగ్ కోసం రెఢీ అవుతూనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు అన్ని వేగవంతం చేశారు. ఇంతకు ముందే చెప్పినట్టు ఈ సినిమా ఆడియో ఫంక్షన్ జరపడంలేదు. నేరుగా ఆడియోని మార్కెట్ లోకి విడుదల చేయనున్నట్టు చిత్ర టీం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ రోజు అర్ధరాత్రి 12 గంటలకు ధృవ ఆడియోని ఆదిత్య మ్యూజిక్ వారు ఆన్ లైన్ లో విడుదల చేస్తున్నారు.

dhruva-audio-from-mid-night

మాస్ ప్రేక్షకుల అభిరుచులు, వారి ఆలోచనలు ఎలా ఉంటాయో సురేందర్ రెడ్డి సినిమాలు చుస్తే మనకు తెలిసిపోతుంది. మాస్ ఎలా చూపిస్తాడో కామెడీ కూడా అదే స్థాయిలో చూపిస్తున్న దర్శకుడితను. ఇప్పటికే తన స్టైలిష్ మేకింగ్ తో పోస్టర్స్, టీజర్ తో ఈ సినిమాపై చాలా అంచనాలు పెంచాడు. ఆడియో కూడా విన్నారంటే సగం సినిమా చూసిన ఆనందం ప్రేక్షకులకు కలుగుతుంది. హిపాప్ థమిజా అందించిన ఈ సినిమా సంగీతంలో నాలుగు పాట్లు ఉన్నాయి. ఇందులో మూడు చంద్రబోస్ రాయగా ఒకటి యాదగిరి రాశాడు. గీత ఆర్ట్స్ బ్యానర్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో చరణ్ సరసన రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఒకప్పటి అందాల హీరో అరవింద్ స్వామి విలన్ గా నటిస్తున్నాడు.

(Visited 212 times, 20 visits today)