Home / Inspiring Stories / తెలుగు నేలల్లో వజ్రాల గనులు ఉన్నట్లుగా గుర్తించిన పరిశోధకులు. 400 ఎకరాలలో గుర్తింపు.

తెలుగు నేలల్లో వజ్రాల గనులు ఉన్నట్లుగా గుర్తించిన పరిశోధకులు. 400 ఎకరాలలో గుర్తింపు.

Author:

ఇప్పటికే ఎన్నో రకాల ఖనిజ నిక్షేపాలకి కొలువైన తెలుగు నేలలు, ఇప్పుడు మరో ఘనత సాధించాయి, మన తెలుగు నేల లోపల వజ్రాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు నిర్ధారించారు, కరువు అనే పదానికి పర్యాయ పదం అయిన అనంతపురం జిల్లాలో వజ్రాలున్నట్లు పరిశోధకులు తేల్చారు. అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం అటవీ ప్రాంతంలో వజ్ర నిక్షేపాలున్నట్టు కనుగొన్నారు. దీంతో నమూనాల సేకరణకు కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖకు చెందిన అడ్వయిజరీ కమిటీ గొట్టపు బావుల తవ్వకాలకు అనుమతులిచ్చింది.

తెలుగు నేలల్లో వజ్రాల గనులు ఉన్నట్లుగా గుర్తించిన పరిశోధకులు.

అనంతపురంలోని పిల్లలపల్లి ప్రాంతంలో ఉన్న అడవిలో దాదాపు 400 ఎకరాలలో వజ్ర నిక్షేపాలు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు, ఆ వజ్రాలని వెలికి తీసేందుకు 64 గొట్టపు బావులని తవ్వాలని కేంద్ర మైనింగ్ శాఖా కసరత్తులు చేస్తుంది, ఇందుకోసం ఆ ప్రాంతంలో సర్వేలు కూడా జరిపించారు, ముందుగా రోడ్డు మార్గాలని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు, 1984 నుంచి అంతరిక్ష సర్వేలు సాగుతున్నప్పటికీ అక్కడ నిక్షేపాలున్నాయన్న విషయం బయటకు పొక్కలేదు. కేంద్ర ప్రభుత్వం సూచనతో వజ్రాల వేట కోసం ఎన్‌ఎండీసీ అధికారులు కళ్యాణదుర్గం ప్రాంతంలో మకాం వేశారు. కరువు విలయతాండవం చేసే అనంతపురం జిల్లాలో వజ్ర నిక్షేపాలున్నట్టు కేంద్ర అనుమతులతో బయటపడడంతో జిల్లా వాసుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.

తెలుగు నేలల్లో వజ్రాల గనులు ఉన్నట్లుగా గుర్తించిన పరిశోధకులు.

ఈ ప్రాంతంలో చాలా సంవత్సరాల కిందటే వజ్రాల కోసం తవ్వకాలు చేసారు, కానీ వజ్రాలు లభించకపోవడంతో తవ్వకాలని నిలిపివేశారు, అప్పుడప్పుడు కొన్ని ప్రైవేట్ సంస్థలు తవ్వకాలు జరిపిన వాటికీ కూడా వజ్రాలు దొరకలేదు, ఈ ప్రాంతంలో కొంత మంది రైతులకి వజ్రాలు దొరినట్లుగా చెబుతారు, దేశవిదేశాల వజ్ర వ్యాపారాలు ఈ ప్రాంతంలో చాలా సార్లు వజ్రాల వేట సాగించారు. వర్షాలు కురిసిన ప్రతిసారీ ఈ ప్రాంతంలో వజ్రాల వేట సాగుతూనే ఉంది. ఇరుగుపొరుగు రాష్ర్టాల నుంచి కూడా ప్రజలు తండోపతండాలుగా వజ్రకరూరు పొలాల బాట పడతారు. ఈ అన్వేషణలో ఏటా ఒకరిద్దరికీ వజ్రాలు దొరుకుతున్నట్టు స్థానికుల సమాచారం.

తెలుగు నేలల్లో వజ్రాల గనులు ఉన్నట్లుగా గుర్తించిన పరిశోధకులు.

భూమి లోపల ఉండే కార్బన్ కాలక్రమేణా వజ్రాలుగా మారతాయి, రాళ్ల రూపంలో ఉండే ఈ వజ్రాలు సూర్య కిరణాల్ని ప్రసరింపచేయడం ద్వారా గుర్తిస్తారు, ఆ రాయి నుంచి వచ్చే మెరుపును బట్టి వజ్రంగా నిర్ధారిస్తారు. మట్టిలో మబ్బుగా ఉన్న ఆ రాయిని ఏదో ఒక మూల తగిన ఆయుధంతో చెక్కగానే కాంతి ప్రవేశించి ప్రకాశించడమే వజ్రం లక్షణం, ఇప్పుడు తవ్వకాలు చేపట్టి వజ్రాలుగా భావించే రాళ్లన్నింటిని నిశితంగా పరిశీలించి వజ్రాలని గుర్తిస్తారు, పరిశోధకులు చెప్పినట్లుగా ఈ ప్రాంతంలో భారీ ఎత్తున వజ్రాలు లభిస్తే, ఈ కరువు ప్రాంతం అభివృద్ధి చెందటంతో పాటు మన తెలుగు నేల ఖ్యాతి ప్రపంచ స్థాయికి వెళ్తుంది.

(Visited 3,642 times, 58 visits today)