Home / Reviews / డిక్టేటర్‌ సినిమా రివ్యూ & రేటింగ్.

డిక్టేటర్‌ సినిమా రివ్యూ & రేటింగ్.

Author:

dictator

నందమూరి బాలకృష్ణ 99 వ సినిమాగా, ప్రతిష్టాత్మకంగా నిర్మించబడింది “డిక్టేటర్” సినిమా. ఒకప్పుడు సంక్రాంతి కి భారీ విజయాలు సాధించిన బాలయ్య బాబు ఇప్పుడు అదే సెంటిమెంట్ తో సంక్రాంతి బరిలో నిలిచాడు. ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ నిర్మించిన, శ్రీవాస్ దర్శకత్వం వహించిన డిక్టేటర్ సినిమా భారీ అంచనాలతో ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరో 3 సినిమాలకి పోటీగా వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ: 

సూపర్ మార్కెట్ లో ఒక చిన్న ఉద్యోగం చేస్తుంటాడు మన చందు (బాలకృష్ణ). తన అన్న చూసిన ఒక హత్య వల్ల విలన్ల చేతిలో భాదలు పడుతుంటుంది ఇందు (సొనాల్). చందు వల్ల ఇందు కి ఆ రౌడీల ల భాద తప్పుతుంది, ఈ గొడవలో ఒక మినిస్టర్ కొడుకుని మరియు అతని గ్యాంగ్ ని అంతమొదిస్తాడు చందు. ఇంకోవైపు తమ సూపర్‌మార్కెట్ లో జరిగిన ఒక దొంగతనాన్ని తన నెత్తిన వేసుకొని జైలుకి వెళ్తాడు చందు. అసలు ఆ దొంగతనాన్ని ఎందుకు తనపై వేసుకున్నాడొ తెలుసుకునే క్రమంలో చందు గతం చంద్రశేఖర్ ధర్మ జీవితం తెలుస్తుంది. అసలు ధర్మ గ్రూప్ ఆఫ్ కంపనీస్ ఛైర్మన్ కథ మరియు అతను ఎందుకు సూపర్‌మార్కెట్ లో పని చేస్తున్నాడో అన్నది మిగిలిన స్టోరీ.

అలజడి విశ్లేషణ: 

నిన్ననే తెలుగు సినిమా కొత్త కొత్త ఆలోచనలతో తనను తాను మార్చుకుంటుంది అని రాశాము, కానీ పొద్దున్నే మరో మూస కథ ఉన్న సినిమా చూడాల్సి రావడం భాదకరం.  బాలకృష్ణ తన 99వ సినిమా కోసం ఎటువంటి తేడాలు లేకుండా రొటీన్ కథనె ఒప్పుకున్నారు. సినిమా మొదటి సగంలో సామాన్య పౌరుడిగా ఉండి, రెండవ భాగంలో తన గొప్పతనాన్ని చాటే ఫ్లాష్‌బాక్ తో విలన్ల దుమ్ము దులుపుతాడు. సమరసింహరెడ్డి సినిమా నుండి దాదాపు బాలయ్య బాబు అన్ని సినిమాలు ఇదే ఫొర్ములాని ఫాలొ అవుతున్నాయి. లౌక్యం సినిమాతో విజయం సాదించిన అనుభవంతో కోన వెంకట్, గోపి మోహన్ రాసిన రొటీన్ కథని శ్రీవాస్ బాగానే కష్టపడి దర్శకత్వం వహించాడు. తర్వాతి సన్నివేశం ఏమీ వస్తుందో ఊహించే విధంగా ఉన్న కథకి శ్రీవాస్ అతికించిన కాలనీ కామెడీ అంతగా ఆకట్టుకొలేదు. సినిమాలోని లెక్కలేనన్ని పాత్రలు సినిమాపై పట్టు లేకుండా చేస్తాయి. చాలా మంది విలన్లు, చాలా మంది కమీడియన్ లు ఉండడం వల్ల ఎవరికి తమ టాలెంట్ చూపే అవకాశం రాలేదు. కానీ రత్నం రాసిన డైలాగ్స్ బాలయ్య కి బాగా సూట్ అయ్యాయి. బాలయ్య బాబు నటన, డైలాగ్స్ మాస్ ఆడియెన్స్ కి బాగా నచ్చుతాయి. అంజలి, బాలకృష్ణ ల కెమిస్ట్రీ బాగా కుదిరింది. సొనాల్ గ్లామర్ సినిమాకు ఇంకో ప్లస్ పాయింట్. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా అంతగా నచ్చకపోవచ్చు, కానీ బాలయ్య అభిమానులకు ఈ సినిమా బాగానే నచ్చుతుంది.

నటీనటుల పని తీరు:

బాలకృష్ణ: బాలకృష్ణ తన నటనతో సినిమాను నిలబెట్టాడు, తన పవర్ఫుల్ డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడు, మాస్ ప్రేక్షకులకి బాలకృష్ణ పాత్ర కనెక్ట్ అవుతుంది.

అంజలి: అంజలి తన నటనలో ఇంకా మెరుగు పరుచుకోవల్సినవి చాలా ఉన్నాయి, తన పాత్ర ఉంది కొద్దిసేపే అయిన ఆ పాత్రకు తన నటనతో న్యాయం చేసింది.

సోనాల్ చౌహన్: సోనాల్ చౌహన్ పాత్ర కేవలం అందాల ఆరబోతకే తీసుకున్నారు, అంతకంటే సోనాల్ నటించడానికి ఏమి లేదు.

30 ఇయర్స్ పృధ్వీ, ప్రభాస్ శ్రీను, పోసాని క్రిష్ణమురళీ, శకలక శంకర్ కామెడీతో ప్రేక్షకులని అంతగా ఆకట్టుకోలేకపోయారు. విలన్లుగా నటించిన రతి అగ్నిహోత్రి , కబీర్ ఖాన్ లు తమ పాత్రల మేరకు నటించారు.

సాంకేతిక వర్గం పనితీరు:

కోన వెంకట్, గోపి మోహన్ లు మళ్లీ ఏమాత్రం కొత్తదనం లేకుండా రొటీన్ కథ అందించారు. ఈ సినిమా కి దర్శకత్వం వహించిన శ్రీవాస్కి మాత్రం మంచి మార్క్లు ఇవ్వవచ్చు. ఎంచుకున్న కథలో కొత్తదనం లేకపోవడంతో ఈ సినిమాని అన్ని రసాలతో నింపే ప్రయత్నం చేశాడు. ఇంకా సంగీతం విషయానికి వస్తే తమన్ అందించిన పాటల్లో రెండు మాత్రమే ఆకట్టుకుంటాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మరియు థీం సాంగ్ ఐతే ఆడియెన్స్ కి బాగా నచ్చుతాయి.  రత్నం రాసిన మాటలు, శ్యాం కె నాయుడు సినిమాటోగ్రఫీ బాగున్నాయి. నిర్మాత ఎక్కడ తగ్గకుండా సినిమా ని బాగా రిచ్ గా ఉండేలా తీశారు.

ప్లస్ పాయింట్స్:

  • బాలకృష్ణ నటన
  • తమన్ సంగీతం
  • సినిమాటోగ్రఫీ
  • రత్నం మాటలు

మైనస్ పాయింట్స్:

  • రొటీన్ కథ
  • ఫెయిల్ అయిన కామెడీ ట్రాక్
  • సినిమా మొదటి సగం

అలజడి రేటింగ్: 2.75/5

పంచ్ లైన్ “కొంత మందికి మాత్రమేడిక్టేటర్‌.

 

(Visited 1,180 times, 63 visits today)