EDITION English తెలుగు
కాలా సినిమా రివ్యూ & రేటింగ్.   డేవిడ్ వార్నర్ మరియు భార్య కాండిస్ బాల్-టాంపెరింగ్ కుంభకోణం తరువాత గర్భస్రావం చేస్తారు   చైనా హఫీజ్ సయీద్ ను వెలుపలికి వెలుపల కోరుకుంటున్నారు.   MH17 రష్యన్ సైనిక క్షిపణి వ్యవస్థ డౌన్ కూలిపోయింది, పరిశోధకులు చెప్పారు   అమెరికాపై ఆధారపడిన సంబంధం భారత్కు ఎప్పటికీ ఉండదు: నిపుణుడు కాంగ్రెస్ సభ్యులకు చెబుతాడు   హెల్త్కేర్ యాక్సెస్ అండ్ క్వాలిటీలో 195 దేశాలలో నెమ్మదిగా మెరుగుపరుచుకోవడం, భారతదేశం రాంక్స్ 145   ఢిల్లీ మనిషి తన కుమారుని హతమార్చాడు   పెట్రోల్ ధరలు పెరగడంతో పలు నగరాల్లో 80 రూపాయల మేరకు ధరలు పెరిగాయి   కేరళ ప్రభుత్వం గత 24 గంటల్లో బాధిత ప్రాంతాల్లో తాజా కేసులను నమోదు చేయకుండా, సమయానుగుణ జోక్యం ద్వారా వ్యాప్తిని తగ్గించింది.   మనిషి ఇండోర్-గోవా ఇండిగో విమానంలో టేకాఫ్ ముందు తన ప్రియురానికి ప్రతిపాదించాడు.

నకిలీ స్వైపింగ్ మెషిన్లని ఎలా గుర్తుపట్టాలో తెలుసుకోండి…!

Author:

నోట్ల రద్దుతో ప్రజలంతా డిజిటల్ లావాదేవీలా బాట పట్టారు, నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించిన తెల్లారి నుండే కార్డుల వాడకం ఓ రేంజ్ లో పెరిగిపోయింది, జేబులో నోట్లులేక ప్రతి షాప్ లో డెబిట్, క్రెడిట్ కార్డులని వాడటం అలవాటు అయిపోయింది, ఎక్కువశాతం ప్రజలు డిజిటల్ లావాదేవీలే చేస్తుడంటంతో కొంతమంది కేటుగాళ్లు ప్రజల్ని డిజిటల్ గానే మోసం చేయాలనీ సరికొత్త ప్లాన్ వేశారు. ఇప్పుడు టీ కొట్టు నుండి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ల లోను స్వైపింగ్ మెషిన్ లనే వాడుతున్నారు, ఈ కేటుగాళ్లు నకిలీ స్వైపింగ్ మెషిన్ లని తయారుచేసి డబ్బులు కొట్టేయాలని ప్లాన్ వేశారు, నకిలీ స్వైపింగ్ మిషన్ల ద్వారా మీ కార్డు సమాచారం, పిన్ నెంబర్ ని చోరీ చేస్తున్నారు. ఏ స్వైపింగ్ మిషన్ ఒరిజినల్ – ఏది డూప్లికేట్ అనేది గుర్తించేందుకు కొన్నిమార్గదర్శకాలు రిలీజ్ చేసింది కార్డ్ టెర్మినళ్ల తయారీ సంస్థ ఇంజెనికో విడుదల చేసింది.

స్వైపింగ్ మెషిన్ లో స్కిమ్మర్ అనే డివైస్ ని ఉంచి మన సమాచారాన్ని దొంగిలిస్తారు, ఆ స్కిమ్మర్ అమర్చిన స్వైపింగ్ మెషిన్లని గుర్తుపట్టడానికి స్వైపింగ్ మెషిన్ తయారీ సంస్థ కొన్ని సూచనలని చేసింది.

నకిలీ స్వైపింగ్ మెషిన్ లని గుర్తించడానికి ఈ కింది సూచనలని పాటించండి:

1. సాధారణ టెర్మినల్ కంటే స్కిమ్మింగ్ టెర్మినల్ స్లాట్ గుర్తించదగినంత పెద్దదిగా ఉంటుంది. ఈ పొటోలో చూపిస్తున్నట్టు కార్డు మొత్తం దాదాపు లోపలికెళ్లినట్టు అనిపిస్తే అది స్కిమ్మర్ అని అనుమానించాలి.
Fake-Swiping-Machine-నకిలీ స్వైపింగ్ మెషిన్
2. సాధారణ టెర్మినల్‌కి కంటే స్కిమ్మర్‌కి రెండు వైపులా, దాని పైనా మరింత వెడల్పుగా, పొడవుగా ఉంటుంది. మోసపూరిత డివైజ్‌లను గుర్తించేందుకు ప్రాధమిక సూచన ఇదే.
 Fake-Swiping-Machine-నకిలీ స్వైపింగ్ మెషిన్
3. స్కిమ్మర్‌లో కార్డు పెట్టిన స్వల్ప సమయంలోనే టెర్మినల్ కీప్యాడ్ మీద బటన్ హైలైట్ అవ్వడం ఆగిపోతుంది. సాధారణంగా కొద్ది సేపటివరకు హైలైట్ అవుతుంది కాబట్టి వెంటనే అప్రమత్తమవ్వాలి.
Fake-Swiping-Machine-నకిలీ స్వైపింగ్ మెషిన్
4. టెర్మినల్‌కి స్కిమ్మర్ జతచేసి ఉంటే… మన కార్డు స్కాన్ చేసినప్పుడు టెర్మినల్‌ పై భాగంలో వెలిగే గ్రీన్ లైట్ ఆరిపోతుంది. గ్రీన్ లైట్ వెలగకపోతే మోసం జరుగుతున్నట్టు గుర్తించాలి.
 Fake-Swiping-Machine-నకిలీ స్వైపింగ్ మెషిన్
5. దాదాపు అన్ని పేమెంట్ టెర్మినళ్లకు పక్కనే స్టైలస్ (పెన్నులాంటిది) జతచేసి ఉంటుంది. కార్డులు స్కాన్ అయిన తర్వాత క్లయింట్లు సిగ్నేచర్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. అయితే iSC250లో స్కిమ్మర్ ఉంటే స్టైలస్ పెట్టేందుకు స్థలం సరిపోదనీ ఇంజెనికో తెలిపింది.
Fake-Swiping-Machine-నకిలీ స్వైపింగ్ మెషిన్
కార్డు పెట్టిన తరువాత పలుమార్లు ఎర్రర్ అని వచ్చిన , కార్డు స్కాన్ చేయడానికి ఎక్కువ సమయం తీసుకున్న అటువంటి మెషిన్ అనుమానించాల్సిందే, ఈ సూచనలని పాటించి సైబర్ నేరస్థుల చేతిలో మోసపోకుండా ఉండండి, ఈ సమాచారాన్ని అందరికి షేర్ చేయండి.
(Visited 4,239 times, 68 visits today)

Comments

comments