ఈ కలెక్టర్ చేసిన పని గురుంచి తెలిస్తే ఫిదా అయిపోతారు.

Author:

ఇప్పటి వరకు ప్రజలకి ఎన్నో రకాలుగా సహాయం చేసిన కలెక్టర్లని మనం చూసి ఉంటాం, ఇప్పుడు చెప్పబోయే కలెక్టర్ గురుంచి తెలుసుకొని ఆశ్ఛర్యపోతారు, ఇలాంటి కలెక్టర్లు కూడా ఉంటారా అని అనుకోని అతనికి అభిమానులుగా మారిపోతారు, అతనే మహారాష్ట్రలోని అకోలా జిల్లా కలెక్టర్ శ్రీకాంత్.

district-collector-farewell-to-chauffeur-by-driving-him-to-work

పైన ఫొటోలో ఉన్న కారు కలెక్టర్ కోసం ప్రభుత్వం కేటాయించింది, కారుతో పాటు దిగంబర్ థక్ అనే డ్రైవర్ ని కూడా కేటాయించింది, గత 35 ఏళ్ళ నుండి దిగంబర్ థక్ ఆ జిల్లాకి వచ్చే కలెక్టర్లకి డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నాడు,  ఆయన కెరీర్ లో మొత్తం ఇప్పటివరకు 18 మంది కలెక్టర్లకు డ్రైవర్ గా విధులు నిర్వహించారు. తన వృత్తిలో భాగంగా ఏ రోజు ఎలాంటి పొరపాటు చేయలేదు, దిగంబర్ థక్ రిటైర్ అయ్యే రోజు రావడంతో అలాంటి వ్యక్తి రిటైర్మెంట్ ను కాస్తంత డిఫరెంట్ గా నిర్వహించాలని డిసైడ్ అయ్యారు ప్రస్తుత కలెక్టర్ శ్రీకాంత్.

దిగంబర్ థక్ చివరి పనిదినం నాడు కలెక్టర్ శ్రీకాంత్ యే స్వయంగా కారుకి డెకరేషన్ చేపించి, దిగంబర్ థక్ ని  అధికారులు కూర్చొనే వెనుక సీట్ లో కూర్చోబెట్టి తానే డ్రైవింగ్ చేసాడు, దానితో పాటు ఆఫీస్ లో ఘనంగా వీడ్కోలు సభని నిర్వహించారు, దింగబర్ థక్ గత 35 సంవత్సరాలుగా అధికారులని ఎంతో జాగ్రత్తగా టైంకి గమ్యానికి చేర్చారు, అంత మంచి ప్రభుత్వ ఉద్యోగికి గుర్తిండిపోయే వీడ్కోలు ఇవ్వాలని ఇలా చేసానని కలెక్టర్ చెప్పుకొచ్చారు.కలెక్టర్ శ్రీకాంత్ చేసిన ఈ పని అందరికి నచ్చేసింది, అయన సింప్లిసిటీకి ఆఫీస్ లో ఉన్నవారంతా ఫిదా అయిపోయారు, చిన్న ప్రభుత్వ ఉద్యోగం వస్తేనే అహంకారంతో ఊగిపోయే వారున్న ఈరోజుల్లో కలెక్టర్ స్థాయిలో ఉండి కూడా ఒక సామాన్య ఉద్యోగి కోసం అయన డ్రైవర్ గా మారిపోవడం అనేది చాలా గొప్ప విషయం.

చాలా ఆఫీస్ లలో కింది స్థాయి ఉద్యోగులని చిన్నచూపు చూస్తారు,కానీ కిందిస్థాయి ఉద్యోగులు సక్రమంగా పనిచేస్తేనే ఏ ఆఫీస్ అయిన వృద్ధిలోకి వస్తుంది, వారికీ మనం ఏమి ఇవ్వలేకపోయిన వారిని చిన్నచూపు చూడకుండా రోజుకొకసారి పలకరిస్తే చాలు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు.

(Visited 2,760 times, 69 visits today)

Comments

comments